హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీ బిల్లు వస్తుందో, రాదోనని అన్వర్: మర్రి సంచలనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Marri Sashidgar Reddy
న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో వస్తుందో, రాదో తెలియదని కేంద్ర మంత్రి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపి నేత తారిఖ్ అన్వర్ అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తమ పార్టీ సానుకూలమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

తెలంగాణ కన్నా విదర్భ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ చాలా పురాతనమైందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఇరు ప్రాంతాల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని ఆయన సూచించారు.

ఇదిలావుంటే, తెలంగాణకు చెందిన శాసనసభ్యుడు, జాతీయ ప్రకృతి వైపరీత్యాల వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి రాష్ట్ర విభజనపై సంచలన వ్యాఖ్య చేశారు. రాష్ట్ర విభజన బాధాకరమైన విషయమని ఆయన మంగళవారంనాడు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన అన్నారు. జివోఎం అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కాగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కాంగ్రెసు తీర్మానం చేసిందని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాన్ని తాము పార్టీ అధిష్టానానికి వివరించినట్లు ఆయన తెలిపారు. జీవోఎంకు ఏమీ నివేదిక ఇవ్వకూడదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు.

English summary
Talking on Telangana issue, NCP leader Tauriq Anwar said that his party is for smaller states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X