• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనాలో మోదీ సర్కార్ మరో భారీ ఖర్చు -రూ.45వేల కోట్లతో 6 సబ్‌మరైన్ల నిర్మాణానికి రక్షణ శాఖ ఆమోదం -నేవీకి బూస్ట్

|

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ ఉధృతి క్రమంగా పలుచబడుతూ, శుక్రవారం నాటి లెక్కల్లో కొత్తగా 1,32,364 కేసులు, 2,713 మరణాలు నమోదుకాగా, వ్యాక్సినేషన్ ప్రక్రియా ఇంకా నిదానంగానే సాగుతున్నది. విలయకాలంలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు చేస్తున్నారంటూ మోదీ సర్కారుపై కోర్టుల్లోనూ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. రూ.20వేల కోట్లతో నిర్మిస్తోన్ సెంట్రల్ విస్టా ప్రాజెక్టును తక్షణం నిలిపేయాలని ప్రతిపక్షాలన్నీ గగ్గోలుపెడుతుండగానే, కేంద్రం మరో భారీ ఖర్చుకు సిద్ధమైంది. అయితే ఇది దేశ రక్షణకు సంబంధించిన అంశం కావడంతో వ్యతిరేకతకు తావులేకుండాపోయింది..

అది కేసీఆర్ గొప్పతనమే కదా -ఈటల ఆస్తుల గ్రాఫ్ పైపైకి -10 రోజుల్లో కనుమరుగు: పల్లా, గువ్వల ఫైర్అది కేసీఆర్ గొప్పతనమే కదా -ఈటల ఆస్తుల గ్రాఫ్ పైపైకి -10 రోజుల్లో కనుమరుగు: పల్లా, గువ్వల ఫైర్

స్వాతంత్ర్యం వచ్చి 2022కు 75 ఏళ్లు పూర్తికానుండగా, ఆలోపు రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలి, ప్రధానంగా నేవీకి సంబంధించి 'ప్రాజెక్ట్‌-75 ఇండియా' పేరుతో అత్యాధునిక వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలని కేంద్రం సంకల్పించడం తెలిసిందే. ఇండియన్ నేవీకి మరింత బలాన్ని చూకూర్చుతూ, ఆ విభాగం చరిత్రలోనే అతిపెద్దదైన డీల్ ఒకటి ఖరారైంది. ఇండో-పసిఫిక్ రీజియన్ లో డ్రాగన్ చైనా ఆగడాలకు అడ్డుకట్టవేసేలా భారత్ అత్యాధునిక స‌బ్‌మెరైన్ల‌ను నిర్మించేందుకు సిద్దమైంది. నేవీ కోసం కొత్తగా 6 సబ్ మెరైన్లు నిర్మించేందుకు ర‌క్ష‌ణ‌శాఖ రూ.45వేల కోట్ల ప్రాజెక్టుకు అంగీకారం తెలిపింది.

 big boost for Indian Navy as Defence Ministry clears Rs 45,000cr mega-deal for 6 submarines

కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో శుక్రవారం జ‌రిగిన డిఫెన్స్ అక్విజిష‌న్ కౌన్సిల్ భేటీలో నేవీకి 6 స‌బ్‌మెరైన్ల ప్రాజెక్టుకు ఆమోదం ద‌క్కింది. స్వ‌దేశీయంగా స‌బ్‌మెరైన్ల‌ను నిర్మించేందుకు త్వ‌ర‌లోనే ప్ర‌తిపాద‌ల‌నల‌ను జారీ చేయ‌నున్న‌ట్లు అధికార వ‌ర్గాల ద్వారా వెల్ల‌డైంది. మ‌జ‌గాన్ డాక్స్‌(ఎండీఎల్‌), లార్సెన్ అండ్ ట‌ర్బో(ఎల్అండ్‌టీ) సంస్థ‌ల‌కు ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌తిపాద‌న‌లు పంపింది.

సీబీఐ అంటే సినిమాలాగే ఉండాలె -ఉద్యోగులెవరూ జీన్స్, టీషర్ట్, స్పోర్ట్స్ షూ వేయొద్దు: కొత్త డైరెక్టర్ సుబోధ్ ఆదేసీబీఐ అంటే సినిమాలాగే ఉండాలె -ఉద్యోగులెవరూ జీన్స్, టీషర్ట్, స్పోర్ట్స్ షూ వేయొద్దు: కొత్త డైరెక్టర్ సుబోధ్ ఆదే

  Indian Navy`s Mega-Deal రూ. 45 వేల కోట్లతో 6 Submarines | Project-75I || Oneindia Telugu

  ప్రాజెక్ట్‌-75 ఇండియాలో భాగంగా ఆరు డీజిల్‌-ఎల‌క్ట్రిక్ స‌బ్‌మెరైన్ల‌ను నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న స్కార్పియన్ క్లాస్ స‌బ్‌మెరైన్ల క‌న్నా పెద్ద సైజులో కొత్త జలాంతర్గాములు ఉండ‌నున్నాయి. వాటిలో అత్యంత శ‌క్తివంత‌మైన ఆయుధాల‌ను అమ‌ర్చ‌నున్నారు. 12 ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్స్, యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైళ్ల‌ను కూడా వాడ‌నున్నారు. సుమారు 18 హెవీవెయిట్ టార్పిడోల‌ను మోసుకువెళ్లే విధంగా స‌బ్‌మెరైన్లు ఉండాల‌ని ఇప్ప‌టికే నేవీకి సూచ‌న‌లు చేశారు. ప్ర‌స్తుతం భార‌తీయ నేవీ వ‌ద్ద 12 స‌బ్‌మెరైన్లు ఉన్నాయి. దీంతో పాటు ఐఎన్ఎస్ హ‌రిహంత్‌, ఐఎన్ఎస్ చ‌క్ర లాంటి న్యూక్లియ‌ర్ స‌బ్‌మెరైన్లు కూడా ఉన్నాయి.

  English summary
  Giving a fillip to the Navy, the Ministry of Defence (MoD) Friday cleared a mega project to domestically build six conventional submarines equipped with state-of-the-art technology at a cost of around Rs 43,000 crore. The submarines will be built under the much-talked-about strategic partnership model that allows domestic defence manufacturers to join hands with leading foreign defence majors to produce high-end military platforms to reduce import dependence.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X