వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్ఐ ద్వారా పాక్‌కి బ్రహ్మోస్ సమాచారం లీక్: అధికారి అరెస్ట్, లోతుగా విచారణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ క్షిపణి పరీక్ష కేంద్రంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిషాంత్ అగర్వాల్ అనే డీఆర్డీఓ అధికారిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం నుంచి జరుగుతున్న సోదాల్లో భాగంగా గతంలో వచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు నాగ్‌పూర్ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

దేశ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన బ్రహ్మోస్ సాంకేతిక సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచారి ఐఎస్ఐ ద్వారా నిషాంత్ పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు ఏయే సమాచారాన్ని చేరవేశాడు, ఎలా దీన్ని కొనసాగించాడు అనే విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు.

 Big breach at BrahMos missile unit: Agent passing on information to Pak-US arrested

అంతేగాక, ఈ విషయం ఇంతవరకు బయటకు ఎందుకురాలేదనే అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మనదేశ రక్షణ వ్యవస్థలో బ్రహ్మోస్ క్షిపణి అత్యంత కీలకమైనది. దీన్ని గతంలో రష్యా సహకారంతో అభివృద్ధి చేసినప్పటికీ.. గత కొంత కాలంగా భారత శాస్త్రవేత్తలే దీన్ని తయారు చేస్తున్నారు.

దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞాతాతపతీ మార్చడం, కొత్త వ్యవస్థల్ని చేర్చడం ద్వారా అధునాతన క్షిపణిగా తీర్చిదిద్దుతున్నారు. ఈ కీలక మార్పులను నిషాంత్ పాకిస్థాన్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ తోపాటు అమెరికాకు కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
There was a major security breach at the high profile Brahmos missile unit in Maharashtra's Nagpur. A spy with an affiliation to the ISI, Pakistan was arrested for allegedly sharing top secrets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X