వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: ఈ ఏడాది టెక్కీలకు భారీగా ఉద్యోగాలు, బెంగుళూర్ టాప్

సాఫ్ట్ వేర్ రంగం మందగమనంలో ఉండడంతో ఉద్యోగాలు ఎప్పుడు పోతాయోననే ఆందోళన టెక్కీలకు ఉంది.అయితే ఓ సర్వే నివేదిక టెక్కీలకు శుభవార్తను తెచ్చింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సాఫ్ట్ వేర్ రంగం మందగమనంలో ఉండడంతో ఉద్యోగాలు ఎప్పుడు పోతాయోననే ఆందోళన టెక్కీలకు ఉంది.అయితే ఓ సర్వే నివేదిక టెక్కీలకు శుభవార్తను తెచ్చింది. వేలాది ఉద్యోగాలు 2017 ఆర్థిక సంవత్సరంలో ఐటీ పరిశ్రమలో రానున్నాయని ఆ నివేదిక చెబుతోంది.

ప్రపంచంలో సాఫ్ట్ వేర్ రంగంలో అనేక మార్పులు ఇటీవలకాలంలో చోటుచేసుకొన్నాయి.దీంతో ఐటీ పరిశ్రమ అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది.

సాఫ్ట్ వేర్ రంగం మందగమనంలో ఉందని నిపుణులు అభిప్రాయంతో ఉన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇండియన్ ఐటీ పరిశ్రమపై తీవ్రంగా కన్పిస్తోంది.

Recommended Video

అమెరికాలో మారిన పద్దతులకు అనుగుణంగా ఇండియాకు చెందిన పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడ మార్పులు చేశాయి,. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడ స్థానికులకు ఎక్కువగా ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి సాఫ్ట్ వేర్ కంపెనీలు.

భారీగా ఉద్యోగాలు

భారీగా ఉద్యోగాలు

2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేల ఉద్యోగాలు రానున్నాయని ఓ నివేదిక వెల్లడిస్తోంది. ఆన్ లైన్ సంస్థ అధ్యయనంలో ఈ మేరకు తేలింది. ఈ ఏడాదిలో అత్యధిక సంఖ్యలో అమెజాన్ సిటీ, హెచ్ సి ఎల్ , గోల్డ్ మాన్ సాచ్స్, ఐబిఎం లాంటి ప్రముఖ సంస్థల్లో ఈ ఎనలిటిక్స్ ఉద్యోగాలకు మంచి ఓపెనింగ్స్ ఉండనున్నాయని తేలింది. ఎనలిటిక్స్, శిక్షణ సంస్థ ఎడ్వాన్సెర్ ఎడ్యూవెంచర్స్ సంయుక్తంగా ది ఎనలటిక్స్ అండ్ డేటా సైన్స్ ఇండియా జాబ్స్ 2017 పేరుతో ఈ అధ్యయనం నిర్వహించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద విశ్లేషణ కేంద్రం ఇండియా

ప్రపంచంలోనే అతిపెద్ద విశ్లేషణ కేంద్రం ఇండియా

అమెరికా తర్వాత ప్రపంచవ్యాప్తంగా విశ్లేషణ డేటా సైన్స్ ఉద్యోగాల్లో అవకాశాల్లో 12 శాతం వాటాతో ఇండియా ఉంది. అయితే ప్రపంచంలోనే అతి పెద్ద విశ్లేషణ కేంద్రంగా ఇండియాను ఉన్నట్టు ఈ సర్వేలో గుర్తించారు. వీటిల్లో అమెజాన్, సిటీ, ఐబిఎం, హెచ్ సి ఎల్ వంటి ఎక్కువ సంఖ్యలో ఎనలిటిక్స్ ఉద్యోగాలను కల్పించాయి.

ఉద్యోగాల్లో బెంగుళూర్ టాప్

ఉద్యోగాల్లో బెంగుళూర్ టాప్

అయితే భారత్ లోని బెంగుళూరు నగరంలో ఇతర నగరాలతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు దక్కే అవకాశం ఉందని తేలింది. బెంగుళూరులో అన్ని ఎనలిటిక్స్ ఉద్యోగాల్లో 25 శాతంతో టాప్ లో నిలిచింది. ఢిల్లీ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ఇక ఫ్రెషర్స్ విషయానికి వస్తే చెన్నై మొత్తం ఓపెనింగ్స్ లోనే టాప్ లో ఉంది. రెండు నుండి ఏడేళ్ళ అనుభవం ఉన్న వారిలో దాదాపు 50 శాతం ఉద్యోగాలున్న అన్ని నగరాల్లోనూ ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది.

సగటు జీతం రూ. 10.5 లక్షలు

సగటు జీతం రూ. 10.5 లక్షలు

ఎనలిటిక్స్ , డేటా సైన్స్ ఉద్యోగాల్లో ఏడాదికి సగటు జీతం రూ. 10.5 లక్షలు, దాదాపు 40 శాతం ఉద్యోగాల్లో ఏడాదికి రూ. 10 లక్షల ఎక్కువ జీతం లభిస్తోంది. తద్వారా ఇది అత్యధిక వేతనం చెల్లిస్తున్న రంగాల్లో ఒకటిగా నిలిచింది. వివిధ పరిశ్రమల్లో టెక్నాలజీ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో దేశంలో నైపుణ్యం కలిగిన విశ్లేషకుల నిపుణుల డిమాండ్ పెరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎనలిటిక్స్ విభాగం ఉద్యోగాల్లో దాదాపు 100 శాతం వృద్దిని సాధించిందన్నారు. దీన్ని అందిపుచ్చుకొనేందుకు ఐటి ఉద్యోగులు డేటా సైన్స్ నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.

English summary
Amid layoff fears in the IT industry, which is facing tough times, the number of analytics jobs has nearly doubled in the past one year, according to a study by Analytics India Magazine .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X