వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: జయలలిత చికిత్స సమయంలో సీసీకెమెరాల స్విచ్చాఫ్: అపోలో ప్రతాప్ రెడ్డి

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆసుపత్రిలోని సీసీటీవిలను ఆఫ్ చేశామని ఆపోలో ఆసుపత్రి ఛైర్మెన్ ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు. జయలలిత ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన ప్రతి సమాచారాన్ని విచారణ కమిషన్‌కు అందించినట్టు ప్రతాప్ రెడ్డి చెప్పారు.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక సందేహలు వ్యక్తమైన నేపథ్యంలో అన్నాడిఎంకె ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించింది.ఈ కమిషన్ ముందు జయలలిత సన్నిహితురాలు శశికళ వాంగ్మూలం ఇచ్చింది.

ఆస్తుల కేసుతో జయలలితకు ఒత్తిడి,బాత్‌రూమ్‌లో కిందపడ్డారు: శశికళ, ఆ రోజు ఏమైందంటే?ఆస్తుల కేసుతో జయలలితకు ఒత్తిడి,బాత్‌రూమ్‌లో కిందపడ్డారు: శశికళ, ఆ రోజు ఏమైందంటే?

శశికళ వాంగ్మూలానికి సంబంధించిన సమాచారం మీడియాలో వచ్చిన మరునాడే ఆపోలో ఆసుపత్రిలో ఆమె ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన విషయాలపై అపోల్ ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

 సీసీ కెమెరాలను ఆఫ్ చేశాం

సీసీ కెమెరాలను ఆఫ్ చేశాం

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకొనే సమయంలో సీసీటీవిలను ఆఫ్ చేసినట్టు అపోలో ఛైర్మెన్ ప్రతాప్ సి. రెడ్డి చెప్పారు. జయలలితకు అపోలో ఆసుపత్రిలో 75 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స జరిగింది. 75 రోజుల పాటు ఆసుపత్రిలోని సీసీటీవిలను స్విచ్చాఫ్ చేసినట్టు ఆయన చెప్పారు. .జయలలితను అందరూ చూడడడం వారికి ఇష్టం లేకపోవడంతోనే సీసీకెమెరాలను స్విచ్చాఫ్ చేసినట్టు ఆయన చెప్పారు.

ఐసీయూలోనే జయలలిత ఒక్కరే

ఐసీయూలోనే జయలలిత ఒక్కరే

ఐసీయూలో జయలలిత ఒక్కరే ఉండేవారని అపోలో ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి చెప్పారు.ఐసీయూలో ఉన్న ఇతర రోగులను వేరే ఐసీయూల్లోకి మార్చినట్టుగా ప్రతాప్ రెడ్డి చెప్పారు. ఐసీయూలోని 24 రూమ్‌లలో ఒక్క రూమ్‌నే ఉపయోగించినట్టు ప్రతాప్ రెడ్డి చెప్పారు.

 జయ రూమ్‌లోకి ఎవరినీ అనుమతించలేదు

జయ రూమ్‌లోకి ఎవరినీ అనుమతించలేదు

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో ఆమె ట్రీట్‌మెంట్ తీసుకొంటున్న రూమ్‌లోకి ఎవరినీ కూడ అనుమతించలేదని అపోలో ఆసుపత్రి ఛైర్మెన్ ప్రతాప్ సీ. రెడ్డి చెప్పారు సందర్శకులను కూడ అనుమతించలేదన్నారు. సన్నిహిత బంధువులు మినహా ఇతరులను ఎవరినీ ఐసీయూలోనికి అనుమతించరాదన్న విధానాన్ని మాత్రమే తాము అనుసరించామన్నారు.

 గుండెపోటుతో జయలలిత మృతి

గుండెపోటుతో జయలలిత మృతి

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి విషమంగా ఉండటంతో తాము ఎవరినీ అనుమతించలేదన్నారు. మరికొందరిని తీసుకురావాలని ఆమె బంధువులు కోరుకుంటే, డ్యూటీ డాక్టర్ అనుమతించే అవకాశం ఉండేదన్నారు. తీవ్ర గుండెపోటు రావడంతో జయలలితను కోల్పోవలసి వచ్చిందన్నారు. తమ ఆసుపత్రి చేయగలిగినదంతా చేసిందన్నారు.

డాక్యుమెంట్లను కమిషన్‌కు ఇచ్చాం

డాక్యుమెంట్లను కమిషన్‌కు ఇచ్చాం

జయలలిత మృతికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లను విచారణ కమిషన్‌కు అందించామని అపోలో ఛైర్మెన్ ప్రతాప్ సి. రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిషన్‌కు తాము అన్ని రకాల డాక్యుమెంట్లను అందించామన్నారు. కమిషన్‌ విచారణకు సహకరిస్తామని ఆయన చెప్పారు

English summary
A day after reports emerged of an affidavit by J Jayalalithaa's close aide VK Sasikala detailing the events before the late AIADMK chief's hospitalisation on 22 September 2016, another major revelation came to the fore on Thursday. In remarks that have raised eyebrows, Apollo Hospitals Chairman Dr Prathap C Reddy has said that during the time the former chief minister was hospitalised (75 days), all the CCTV cameras at the hospital had been switched off.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X