వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగేళ్ల కనిష్టం: భారీగా పడిపోయిన బీటెక్, ఎంటెక్ ఎన్‌రోల్‌మెంట్స్

|
Google Oneindia TeluguNews

బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య గత కొద్ది సంవత్సరాలుగా భారీగా తగ్గిపోతోంది. హైయ్యర్ ఎడ్యుకేషన్(ఏఐఎస్‌హెచ్ఈ)పై ఆల్ ఇండియా సర్వే శనివారం విడుదలైంది. ఈ సర్వే ప్రకారం ప్రాఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య నాలుగేళ్ల కనిష్టానికి తగ్గిపోయింది.

ఏఐఎస్‌హెచ్ఈ 2018-19 ప్రకారం. టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ చేసే విద్యార్థుల సంఖ్య సగానికిపైగా పడిపోయింది. 2014-15లో 2,89,311 ఉండగా 2018-19లో ఈ సంఖ్య 1,35,500కి పడిపోయింది. ఇదే కాలానికి బీటెక్ లో చేరే వారి సంఖ్య కూడా 11శాతం తగ్గిపోయింది. ఈ కాలానికి 42,54,919 నుంచి 37,70,949కు పడిపోయింది.

అయితే, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీఈడీ, ఎల్ఎల్ బీ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు మొగ్గుచూపుతూనే ఉన్నారు. 2014-15లో ఎంబీఏ చేసిన వారి సంఖ్య 4,09,432 ఉండగా, 2018-19లో 4,62,853కు చేరింది. బీఈడీలో చేరే వారి సంఖ్య కూడా 80శాతం పెరగడం గమనార్హం. 2014-15లో 6,57,194 ఉండగా.. 2018-19లో 11,75,517కు పెరిగింది.

Big fall in B.Tech, M.Tech enrolment, professional courses hit 4 year low

2015-16 విద్యాసంవత్సరంలో ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే అండర్ గ్రాడ్యుయేట్ల సంఖ్య 7,21,506 అంటే సుమారు 9శాతం పడిపోయింది. పోస్టుగ్రాడ్యుయేట్ చేసే వారి సంఖ్య కూడా 32శాతం తగ్గిపోయింది. 2015-16లో 18,07,646 నుంచి 2018-19లో 12,36,404కు పడిపోయింది.

3.74 కోట్ల మంది ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరతారని భావించినప్పటికీ 3.66 కోట్ల మంది చేరారు. సర్వే ప్రకారం హైయ్యర్ ఎడ్యుకేషన్‌లో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్ రేషియో(జీఈఆర్) 217-18లో 25.8శాతం నుంచి ఇప్పుడు 26.3శాతానికి పెరిగింది.

English summary
Student Enrolment in B.Tech and M.Tech programmes has seen a dramatic fall, according to the latest All India Survey on Higher Education (AISHE) released Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X