వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైరస్ మిస్త్రీ మృతి.. మోడీ, సుప్రియ సూలే సహా పలువురు సంతాపం..

|
Google Oneindia TeluguNews

టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. దీంతో పలువురు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. మిస్రీ మరణంపై ప్రధాని మోడీ సంతాపం తెలియజేశారు. అతను గొప్ప పారిశ్రామిక వేత్త అని కొనియాడారు. అతని మరణం ప్రపంచ వ్యాపార రంగానికి గొప్ప లోటు అని చెప్పారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Recommended Video

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ఇక లేరు *National | Telugu OneIndia

మిస్త్రీ మరణంపై ఎన్సీపీ నేత సుప్రీయ సూలే ట్వీట్ చేశారు. తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తోందని తెలిపారు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని తెలిపారు. అతని ఆత్మకు శాంతి కలుగాలని కోరుకుంటున్నామని వివరించారు.

Big loss to the world: PM Modi condoles demise of Cyrus Mistry

మిస్త్రీ మరణం తమకు షాక్‌నకు గురిచేసిందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ అన్నారు. అతనితో చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉందన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా సంతాపం తెలిపారు. అతని ఆత్మకు శాంతి కలుగాలని కోరుకున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా సంతాపం తెలియజేశారు.

సైరస్ మిస్త్రీ మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబయి తిరిగి వస్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు రోడ్డు డివైడర్‌ను గట్టిగా ఢీకొట్టింది. ప్రమాదంలో సైరస్ మిస్త్రీ తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచారు. పాల్ఘాట్ ప్రాంతంలోని చరోటీ వద్ద సూర్యా నది వంతెనకు సమీపంలో ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వారిని గుజరాత్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. సైరస్ మిస్త్రీ దుర్మరణం పట్ల వ్యాపార, రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది.

English summary
prime Minister Narendra Modi, several Union ministers, and leaders from various parties condoled the demise of former chairman of Tata Sons Cyrus Mistry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X