వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైరస్ మిస్త్రీకి భారీ ఊరట: టాటా గ్రూప్ ఛైర్మెన్‌గా తిరిగి నియమించాలన్న అప్పీలేట్ కోర్టు

|
Google Oneindia TeluguNews

ముంబై: టాటా గ్రూప్ ఛైర్మెన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపు సరికాదని నేషనల్ కంపెనీ లా అప్పెలేట్ ట్రైబ్యునల్ పేర్కొంది. తిరిగి అతన్ని టాటా గ్రూప్ ఛైర్మెన్‌గా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. అదేసమయంలో ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్‌గా ఎన్ .చంద్రశేఖరన్‌ నియామకం చెల్లదని అది సహేతుకమైన నియామకం కాదని కోర్టు పేర్కొంది. అయితే టాటా గ్రూప్ ఛైర్మెన్‌గా సైరస్ మిస్త్రీ తిరిగి నియమించేందుకు నాలుగు వారాల సమయం ఇచ్చింది కోర్టు. ఈ సమయంలోగా టాటా అప్పీల్ చేసుకోవచ్చని ఆదేశాల్లో పేర్కొంది.

 తన తొలగింపు అక్రమం అని NCLTలో పిటిషన్

తన తొలగింపు అక్రమం అని NCLTలో పిటిషన్

ముంబైలోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ముందు టాటా గ్రూప్ ఛైర్మెన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపు అక్రమం అని సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కార్ప్ సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి. అయితే ఈ పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ కొట్టివేసింది. దీంతో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ అప్పిలేట్‌ను ఆశ్రయించారు సైరస్ మిస్త్రీ.

2012లో సైరస్ మిస్త్రీ బాధ్యతలు..2016లో తొలగింపు

2012లో సైరస్ మిస్త్రీ బాధ్యతలు..2016లో తొలగింపు

టాటా సన్స్‌కు సైరస్ మిస్త్రీ ఆరవ ఛైర్మెన్. 2016 అక్టోబర్‌లో ఆయన్ను ఛైర్మెన్‌గా తొలగిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. రతన్ టాటా పదవీవిరమణ చేసిన తర్వాత 2012లో సైరస్ మిస్త్రీ ఛైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇక మిస్త్రీని తొలగించడంతో NCLTలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే జూలై 9న పిటిషన్‌ను కొట్టివేయడమే కాదు రతన్ టాటాపై బోర్డు సభ్యులపట్ల క్రమశిక్షణ లేకుండా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది.

తన తొలగింపు కంపెనీ యాక్ట్స్‌కు విరుద్ధంగా ఉందన్న మిస్త్రీ

తన తొలగింపు కంపెనీ యాక్ట్స్‌కు విరుద్ధంగా ఉందన్న మిస్త్రీ


ఇదిలా ఉంటే టాటా సన్స్‌ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం మేరకు ఒక వ్యక్తిని ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్‌గా నియమించే అధికారంతో పాటు తొలగించే అధికారం కూడా ఉందని స్పెషల్ బెంచ్ పేర్కొంది. బోర్డు సభ్యుల్లో మెజార్టీ సభ్యులు మిస్త్రీపట్ల కాన్ఫిడెన్స్ లేకపోవడంతోనే తనను తొలగించారని ట్రైబ్యునల్ పేర్కొంది. తనను అన్యాయంగా తొలగించారంటూ సైరస్ మిస్త్రీ అప్పీలేట్‌ను ఆశ్రయించారు. తన తొలగింపు కంపెనీ చట్టంకు విరుద్ధంగా ఉందని వాదనలు వినిపించారు.అంతేకాదు టాటా సన్స్‌లో చాలా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని అప్పిలేట్ దృష్టికి తీసుకొచ్చారు.

English summary
In what is being seen as a big win for Cyrus Mistry, the National Company Law Appellate Tribunal on Wednesday ordered restoration of him as the Executive Chairman of Tata Sons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X