వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ కు బిగ్ రిలీఫ్ .. బాగా తగ్గిన కరోనా కొత్త కేసులు, మరణాలు; తగ్గిన యాక్టివ్ కేసులు.. లెక్కలివే !!

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి తెలిసిందే. కేసుల్లో హెచ్చుతగ్గులతో నిత్యం కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 30 వేలకు దిగువన కరోనా కేసులు నమోదవుతున్న తీరు కాస్త ఊరట కలిగిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 26,115 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటి లెక్కల కంటే 13.6% తక్కువగా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి దేశంలోని మొత్తం కేసులు 3.35 కోట్లకు చేరాయి. గత 24 గంటల్లో 252 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,45,385 కి చేరింది. ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కొత్త కేసులలో సగానికి పైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రం నుండి నమోదు అవుతున్నట్లుగా తెలుస్తుంది.

కేరళ కొంప ముంచిన ఓనం పండుగ ; కేరళ కరోనా కల్లోలంతో పండుగలపై కేంద్రం అలెర్ట్కేరళ కొంప ముంచిన ఓనం పండుగ ; కేరళ కరోనా కల్లోలంతో పండుగలపై కేంద్రం అలెర్ట్

బాగా తగ్గిన యాక్టివ్ కేసులు .. గణనీయంగా పెరుగుతున్న రికవరీలు

బాగా తగ్గిన యాక్టివ్ కేసులు .. గణనీయంగా పెరుగుతున్న రికవరీలు

భారతదేశంలో యాక్టివ్ కేసులు 3,09,575 వద్ద ఉన్నాయి. ఇది 184 రోజుల్లో అత్యల్పంగా ఉంది. క్రియాశీల కేసులు తగ్గుముఖం పట్టడం భారతదేశానికి కాస్త ఊరట నిస్తుంది. తాజాగా క్రియాశీల కేసుల రేటు 0.92 శాతానికి తగ్గింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.85% మరియు వీక్లీ పాజిటివిటీ రేటు 2.08% గా ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,13,951 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 3.27 కోట్ల మంది కరోనా మహమ్మారి నుండి బయటపడ్డారు. గత 24 గంటల్లో 34 వేల మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇక రికవరీ రేటు 97.7 5 శాతానికి పెరిగింది. ఇక తాజాగా నమోదైన కొత్త కేసుల కంటే కరోనా రికవరీలే ఎక్కువగా ఉండటం గమనార్హం.

కేరళలో 15 వేలకు పైగా కేసులు .. 92 మరణాలు

కేరళలో 15 వేలకు పైగా కేసులు .. 92 మరణాలు

భారతదేశంలో అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ కేసులు ఉన్న మహారాష్ట్రలో 2,583 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా ఒకేరోజు అత్యధిక కేసులు నమోదైన కేరళలో సోమవారం 15,692 మంది వైరస్ పాజిటివ్‌గా పరీక్షించారు. కేరళ రాష్ట్రంలో తాజాగా నమోదైన కేసులు మొత్తం కేసుల సంఖ్యను 45.24 లక్షలకు పైగా తీసుకెళ్ళింది. కేరళ రాష్ట్రంలో తాజాగా నమోదైన 92 మరణాలతో కలిపి మరణాల సంఖ్య 23,683 గా నమోదైంది. కేరళ నుండి వచ్చే వ్యక్తులపై కఠినమైన ఆంక్షలు విధించిన పొరుగున ఉన్న కర్ణాటకలో 677 కొత్త కేసులు, 24 మరణాలు సంభవించాయి.

 మిజోరాంలో పెరుగుతున్న కేసులు.. ఆ రాష్ట్రాలలో జీరో మరణాలు

మిజోరాంలో పెరుగుతున్న కేసులు.. ఆ రాష్ట్రాలలో జీరో మరణాలు

సోమవారం ఢిల్లీలో 20 కోవిడ్ కేసులు నమోదు కాగా, సున్నా మరణాలు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 0.04 శాతంగా ఉంది.1,731 కొత్త కేసులతో ఒక రోజులో అత్యధిక సంఖ్యలో కొత్త కేసుల్లో ఈశాన్య రాష్ట్రాలలో మిజోరాం ముందుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో రెండు కోవిడ్ మరణాలు సంభవించాయి. ఇక దేశంలోని రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ , ఉత్తరాఖండ్ మరియు జార్ఖండ్‌లో సున్నా కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.

Recommended Video

గణేష్ నిమజ్జనోత్సవానికి రావడం ఆనందంగా ఉందన్న భక్తులు!!
 మళ్ళీ వ్యాక్సిన్ల ఎగుమతి ప్రారంభించనున్న భారత్

మళ్ళీ వ్యాక్సిన్ల ఎగుమతి ప్రారంభించనున్న భారత్

వచ్చే నెలలో భారతదేశం వ్యాక్సిన్లను ఎగుమతి చేయడం తిరిగి ప్రారంభిస్తుందని ప్రభుత్వం సోమవారం తెలిపింది. మొత్తంగా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ల తయారీదారుగా ఉన్న భారత్, తన సొంత జనాభాకు టీకాలు వేయడంపై దృష్టి పెట్టడానికి ఏప్రిల్‌లో వ్యాక్సిన్ ఎగుమతులను నిలిపివేసింది. ఇక మళ్లీ వ్యాక్సిన్ల ఎగుమతి ప్రారంభించనుంది. గత 24 గంటల్లో 96.46 లక్షలకు పైగా వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి.

English summary
The corona epidemic continues to spread in India. There have been 26,115 latest coronavirus cases, 252 people died yesterday. It is estimated that 4,45,385 people in the country have died due to corona so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X