• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Bigg Boss:వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంటిలోకి ఆ హాట్ భామ.. బోల్డ్ సీన్స్‌‌కు కేరాఫ్‌గా..!

|

ముంబై: బిగ్‌బాస్ షో దేశవ్యాప్తంగా పలు భాషల్లో ప్రసారమవుతున్న ఏకైక రియాల్టీ షో. తెలుగులో సెప్టెంబర్ 6వ తేదీన కింగ్ నాగార్జున హోస్ట్‌గా ప్రారంభం అవగా ఆ తర్వాత అక్టోబర్ 3వ తేదీన హిందీలో బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్ వ్యాఖ్యాతగా ప్రారంభమైంది. ఇక లేటెస్ట్‌గా అక్టోబర్ 6న తమిళంలో ఈ మెగా రియాల్టీ షో ప్రారంభం అయ్యింది. దీనికి కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరిగిపోయాయి.

 వెల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా

వెల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా

తెలుగులో ప్రారంభమైన బిగ్‌బాస్‌ షోలో అప్పుడే మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరిగాయి. అందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై వచ్చిన స్వాతి దీక్షిత్ అప్పుడే ఎలిమినేట్ కావడం కూడా జరిగిపోయింది. ఇక హిందీలో కూడా ఒకప్పటి హాట్ భామ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. పలు బోల్డ్ వెబ్ సిరీస్‌లలో నటించిన సప్నా సప్పు హిందీ బిగ్‌బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటర్ కానున్నట్లు బాలీవుడ్ సమాచారం. సప్నా సప్పు ఒకప్పుడు తన అందాల ఆరోబోతతో కుర్రాళ్లకు పిచ్చెక్కింది. అందుకే ఆమె సప్నా భాబీగా మరింతగా పాపులర్ అయ్యింది.

 రొమాంటిక్ సీన్స్‌కు కేరాఫ్‌గా.

రొమాంటిక్ సీన్స్‌కు కేరాఫ్‌గా.

రానున్న వారాల్లో సప్నా సప్పు బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంటర్ కానున్నట్లు టైమ్‌ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఏ రోజు ఆమె హిందీ బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెడతారనే దానిపై క్లారిటీ లేదు. సప్నా భాబీ అనే రొమాంటిక్ వెబ్‌సిరీస్‌తో ఆమె వెలుగులోకి వచ్చింది. శృంగార భరితమైన సన్నివేశాల్లో నటించి కుర్రకారుకు కైపెక్కించింది. అంతెందుకు 60 ఏళ్ల ముసులోడు కూడా సప్నా సప్పును చూసేందుకు ఎగబడ్డారంటే ఆమె ఏ స్థాయిలో రెచ్చిపోయి నటించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ వెబ్ సిరీస్ దాదాపుగా నాలుగు సీజన్ల పాటు కంటిన్యూగా నడిచింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సప్పా సప్పు అంటే తెలియని వారుండరు. పలు భోజ్‌పూరీ సినిమాల్లో నటించడమే కాకుండా... హిందీ, గుజరాతీ సినిమాల్లో కూడా సప్నా నటించింది. రెండు దశాబ్దాల పాటు సిని పరిశ్రమలో ఉన్న సప్పా దాదాపు 250 సినిమాల్లో నటించింది.

  Bigg Boss Telugu 4 : Amma Rajashekar OR Sujatha Who Will Eliminate This Week?
   మిథున్ చక్రవర్తితో తొలిసినిమా

  మిథున్ చక్రవర్తితో తొలిసినిమా

  ఇక తన బాలీవుడ్ కెరీర్‌ను 1998లో మిథున్ చక్రవర్తి నటించిన గుండా ద్వారా ప్రారంభించింది. అందులో మిథున్‌కు సోదరిగా నటించింది. టాంక్ జాంక్, లవ్ లస్ట్ డ్రామా, సప్నా కా అంగూర్, బాస్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. అయితే అన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇటు టీవీ పరిశ్రమలో కూడా ఆమె నెగ్గలేకపోయింది. కానీ ఎప్పుడైతే హాట్ అందాలను వెబ్‌సిరీస్‌లో ప్రదర్శించిందో సప్నా సప్పు టాక్ ఆఫ్ ది టౌన్ కాదు.. టాక్ ఆఫ్ ది బాలీవుడ్‌గా నిలిచి అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకుంది. ఇదే సప్నాకు బిగ్‌బాస్‌ అవకాశం తీసుకొచ్చి ఉంటుందనే ప్రచారం బాలీవుడ్‌లో జరుగుతోంది.

  ఇక సప్నా వ్యక్తిగత విషయానికొస్తే గుజరాత్ పారిశ్రామికవేత్తతో 2013లో వివాహం జరిగింది. అయితే తర్వాత దంపతులిద్దరూ విడిపోయారు. సప్నాకు ఒక కొడుకు ఉన్నాడు. మొత్తానికి సప్నా బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయితే షోకు ఎలాంటి ఫ్లేవర్ తీసుకొస్తుందో వేచిచూడాలి.

  English summary
  Web Series actor Sapna sappu will be making a wild card entry to the Salman Khan hosted Bigg Boss -14 if sources are to be believed.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X