బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోం మంత్రి మీద బిగ్ బాస్ ఫేం నర్సు జయలక్ష్మి, సీఎం కొడుకు మీద శశికళ పోటీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి మీద ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ (ఎంఇపీ) టిక్కెట్ పై నర్సు జయలక్ష్మి పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు. ఓటమి అంటే ఏమిటో తెలీని రామలింగా రెడ్డికి నర్సు జయలక్ష్మి గట్టి పోటీ ఇస్తోందని ఎంఇపీ పార్టీ నాయకులు అంటున్నారు.

వివాదల నర్సు

వివాదల నర్సు

అనేక వివాదాలతో నిత్యం వార్తలో ఉండే జయలక్ష్మి కన్నడ బిగ్ బాస్ షోతో ఓ వెలుగువెలిగారు. ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ నౌహిరా షేక్ బుధవారం ఆ పార్టీ అభ్యర్థు రెండో జాబితాను విడుదల చేశారు.

సీఎం కొడుకు మీద శశికళ

సీఎం కొడుకు మీద శశికళ

రెండో జాబితాలో మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్మ మీద గురుమల్లేష్ తో పోటీ చేయిస్తున్నారు. మైసూరు జిల్లాలోని వరుణా నియోజక వర్గంలో సీఎం సిద్దూ కుమారుడు డాక్టర్ యతీంద్ర మీద శశికళతో పోటీ చేయిస్తున్నారు.

75 నియోజక వర్గాలు

75 నియోజక వర్గాలు

బెంగళూరు నగరంలోని చామరాజపేట నియోజక వర్గంలో సయ్యద్ ఇస్లాంతో పోటీ చేయిస్తున్నారు. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసిన ఎంఇపీ 224 నియోజక వర్గాల్లో ఇంకా 75 మంది పేర్లు ప్రకటించవలసి ఉంది.

సీఎం కావాలని నర్సు

సీఎం కావాలని నర్సు

బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలో తాను ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నానని జయలక్ష్మి బహిరంగంగా చెప్పారు. ఇప్పుడు హోం మంత్రి రామలింగా రెడ్డి మీద శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసి కనీసం ఎమ్మెల్యే అవుతారో లేదో వేచి చూడాలి అంటున్నారు బీటీఎం లేఔట్ ప్రజలు.

English summary
MEP chief Dr Nowheera Sheikh has released second list of 75 candidates. Bigg boss fame nurse Jayalaxmi will has gets ticket from BTM Layout in Bangaluru against home minister Ramalinga reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X