• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వహ్ క్యా బాత్ హై: బిగ్‌బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ: అదరగొట్టిన శివగామి

|
Google Oneindia TeluguNews

చెన్నై: వరల్డ్ బిగ్గెస్ట టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్.. తెలుగులాగే తమిళంలోనూ అదర గొడుతోంది. 55 రోజులు పూర్తయ్యాయి. బహుభాషా నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నారు. ఆరంభం నుంచీ ఆయనే హోస్ట్‌గా కొనసాగుతున్నారు. తమిళంలో కూడా ఇది అయిదో సీజన్. మొదటి సీజన్ నుంచీ కమల్ హాసన్ హోస్ట్‌గా ఉంటోన్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో తీరిక లేని షెడ్యూల్‌లోనూ ఆయన హోస్ట్‌గా కనిపించారు.

కరోనా పాజిటివ్..

తొలిసారిగా కమల్ హాసన్ హోస్ట్‌గా తన బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీనికి కారణం- ప్రాణాంతక కరోనా వైరస్. కొద్దిరోజుల కిందటే ఆయనకు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన ఐసొలేషన్‌లో ఉంటున్నారు. చికిత్స తీసుకుంటున్నారు. ప్రతిరోజూ ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోన్నారు డాక్టర్లు. ఆరోగ్యం రోజురోజుకూ మెరుగుపడుతోంది. శరవేగంగా ఆయన ఈ మహమ్మారి నుంచి కోలుకుంటోన్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తారని శృతి హాసన్ ఇటీవలే ఓ ట్వీట్ చేశారు.

గందరగోళానికి తెర..

కమల్ హాసన్ ఐసొలేషన్‌కు వెళ్లాల్సి రావడం వల్ల ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ తమిళం సీజన్ 5ను ఎవరు హోస్ట్‌ చేస్తారనేది కొంత గందరగోళంగా మారింది. కమల్‌లా సమర్థవంతంగా ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోలో వీక్షకులను కట్టి పడేసే సామర్థ్యం ఎవరికి ఉందనే విషయంపై డిబేట్స్ సాగాయి.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై. అప్పట్లో కొన్ని పేర్లు తెరమీదికి వచ్చినప్పటికీ- అవేవీ వాస్తవ రూపాన్ని దాల్చలేదు.

హోస్ట్‌గా..

ఈ పరిణామాల మధ్య బిగ్‌బాస్ సీజన్ 5 తమిళం హోస్ట్‌ ఎవరో తేలిపోయింది. దీనికి సంబంధించిన ప్రొమో విడుదలైంది. దీన్ని టెలికాస్ట్ చేస్తోన్న విజయ్ టీవీ ఓ ప్రొమోను తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. హోస్ట్‌గా ఎవరు వ్యవహరిస్తారనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఈ ప్రొమోలో కమల్ హాసన్ కూడా కనిపించారు. తాను కరోనా వైరస్ బారిన పడ్డానంటూ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు ఓ సందేశాన్ని ఇచ్చారు. ఐసొలేషన్‌లో ఉన్నానని, తన స్థానంలో హోస్ట్‌గా ఎవరు వస్తారో.. మీరే చూడండి అంటూ ఆయన ఇంట్రడ్యూస్ చేశారు.

శివగామి ఎంట్రీ..

కమల్ హాసన్ స్థానంలో సీనియర్ నటి రమ్యకృష్ణ హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. కమల్ స్థానాన్ని ఆమె రీప్లేస్ చేశారు. ఇది తాత్కాలికమే. వైరస్ నుంచి కోలుకున్న తరువాత మళ్లీ కమల్ హాసన్ బిగ్‌బాస్ డయాస్ మీదికి వచ్చేస్తారు. శనివారం రాత్రి నాటి ఎపిసోడ్‌ను సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు రమ్యకృష్ణ. ఆమె అలా బిగ్‌బాస్ డయాస్ మీదికి రాగానే.. ఆమె పేరు మారుమోగిపోయింది. ట్విట్టర్‌లో హోరెత్తిపోయింది. #RamyaKrishnan అనే పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. కంటిన్యూ‌గా రమ్యకృష్ణకు సంబంధించిన అప్‌డేట్స్ పోస్ట్ అవుతూనే వస్తోన్నాయి. వేల కొద్దీ ట్వీట్లు పడ్డాయి.

కమల్ హాసన్ సూచనలతోనే..

బిగ్‌బాస్ తమిళంలో కమల్ హాసన్ కాకుండా మరొకరు హోస్ట్‌గా కనిపించడం ఇదే తొలిసారి. ఈ అయిదు సీజన్‌ల పాటు కమల్ హాసన్ కనిపించారు. ఆయన కరోనా బారిన పడటంతో తప్పుకోవాల్సి వచ్చింది. అందుకే- కొత్త హోస్ట్ మీద ఆకాశాన్నంటేలా అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్‌ను మరిపించేలా, ఆయన సృష్టించిన మ్యాజిక్‌ను మరిచిపోయేలా తాత్కాలికంగా ఎవరిని హోస్ట్‌గా తీసుకోవాలనే విషయం మీద పెద్ద కసరత్తే సాగింది. కమల్ హాసన్ సూచనలతోనే నిర్వాహకులు రమ్యకృష్ణను సెలెక్ట్ చేశారని తెలుస్తోంది.

ప్రేక్షకుల అంచాలను అందుకున్నారా?


ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోనకు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఏ భాషలోనైనా ఇప్పటిదాకా ఆమె బిగ్‌బాస్‌కు హోస్ట్ చేయలేదు. యాంకర్‌గానూ కనిపించలేదు. ఉన్నపళంగా ఈ షోను ఆమె హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లందరినీ పేరుపేరునా పలకరించారు. వారి గేమ్ స్ట్రాటజీలోని లోపాలను ఎత్తి చూపారు. బి స్ట్రాంగ్ అంటూ సూచించారు. దీనికోసం రమ్యకృష్ణ బాగానే వర్కవుట్ చేసినట్టే కనిపించింది.

మిశ్రమ స్పందన..

ఆమె హోస్ట్ పట్ల తమిళ ప్రేక్షకులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఫర్వాలేదని చెబుతున్నారు. మరికొందరు వరస్ట్‌గా అభివర్ణిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల్లో రమ్యకృష్ణ క్రేజ్, గ్లామర్, ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తెరపై కనిపర్చే చురుకుదనం రియాలిటీ షోలోనూ ప్రదర్శించగలిగారంటూ ప్రశంసిస్తున్నారు. మరి కొందరు ఆమె తడబడుతున్నారని, ఇంకా మెరుగైన ప్రదర్శన చేయడానికి అవకాశం ఉందనీ అంటున్నారు.

English summary
The latest promo of Bigg Boss Tamil Season 5 has all the answers. In the video, Kamal Haasan can be seen interacting with the contestants from the hospital. He also introduced Ramya Krishnan as a temporary host.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X