వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bihar:ఓటర్లు ట్రెండ్ సెట్ చేస్తారు,ట్రెండ్ ఫాలో కారు, అరే సాంబా రాసుకోరా తేజస్వీ గర్బర్ సింగ్ జోస్యం

|
Google Oneindia TeluguNews

పాట్నా/ బీహార్: బీహార్ లో ఎవరు అధికారంలోకి వస్తారు ? అనే నిర్ణయించడంలో ఈరోజుతో అక్కడి ప్రజలు పక్కా డిసైడ్ చేస్తారు. శనివారం బీహార్ లో ఆఖరి పోలింగ్ జరుగుతోంది. 16 జిల్లాలోని 78 శాసన సభ నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. బీహార్ లో ఎవరు అధికారంలోకి వస్తారు అనే విషయం నేటితో తేలిపోతుందని, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పెట్టాపేడా సర్దుకుని ఇంటికి వెళ్లడానికి సిద్దంగా ఉండాలని ఆర్ జేడీ నేత. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ చిలక జోస్యం చెప్పారు. ఓటర్లు ట్రెండ్ సెట్ చేస్తారు, ట్రెండ్ ఫాలో కారు, అరే సాంబా రాసుకో అంటూ తేజస్వీ యాదవ్ గబ్బర్ సింగ్ టైపులో ఆయన అనుచరులతో పక్కాధీమాతో చిలక జోస్యం చెప్పినట్లు ఈ డైలాగ్ చెబుతున్నారు.

Recommended Video

Bihar Assembly polls 2020 : ఓటర్లు ట్రెండ్ సెట్ చేస్తారు,ఫాలో కారు..మేము గెలవడం ఖాయం! -Tejaswi Yadav

Home Stay: మైసూరు ఆంటీలు, మండ్య బజ్జీలు, రేట్లు డేట్లు ఫిక్స్, లాక్ డౌన్ నష్టాలు, హైటెక్ స్కెచ్ !Home Stay: మైసూరు ఆంటీలు, మండ్య బజ్జీలు, రేట్లు డేట్లు ఫిక్స్, లాక్ డౌన్ నష్టాలు, హైటెక్ స్కెచ్ !

 మీరు ఈ పని చెయ్యండి.... పైన దేవుడు ఉన్నాడు

మీరు ఈ పని చెయ్యండి.... పైన దేవుడు ఉన్నాడు

బీహార్ లో జరుగుతున్న చివరి విడత పోలింగ్ లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని శనివారం ఆర్ జేడీ నేత తేజస్వీ యాదవ్ 16 జిల్లాల ప్రజలకు మనవి చేశారు. మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి. పైన ఉన్న ఆ దేవుడు మీ పక్షాన ఉన్నాడు, అందరికి న్యాయం జరుగుతుందని తాను నమ్ముతున్నానని తేజస్వీ యాదవ్ ప్రజలకు మనవి చేశారు.

 సీఎం పని ఫినిష్

సీఎం పని ఫినిష్

డబుల్ ఇంజన్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజల కష్టాలు తీర్చడంలో పూర్తిగా విఫలం అయ్యారని తేజస్వీ యాదవ్ ఆరోపించారు. తాను సీఎంగా అనిరకాలుగా విఫలం అయ్యానని నితీశ్ కుమార్ కు బాగా తెలుసు, అందుకే ప్రజల ముందుకు వచ్చి ఇవే నా చివరి ఎన్నికలు అంటూ నాటకాలు ఆడుతున్నారని, ఆయన నాటకాలు రక్తికట్టించవని, ప్రజలు ఆయన్ను నమ్మేపరిస్థితిలో లేరని ఆర్ జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడుతున్నారు.

 10వ తేదీ మనకు పండగే

10వ తేదీ మనకు పండగే

బీహార్ లో ఇప్పటికే రెండు విడతల పోలింగ్ జరిగిపోయింది. శనివారం 78 శాసన సభ నియోజక వర్గాల్లో మూడో విడత పోలింగ్ జరుగుతోంది. మూడో విడత పోలింగ్ లో 2. 35 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నవంబర్ 10వ తేదీన బీహారో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మొత్తం 243 శాసన సభ నియోజక వర్గాల కింగ్ లు ఎవరో తెలిసిపోతుంది. మనకు దీపావళి పండగ నాలుగు రోజుల ముందుగానే (నవంబర్ 10వ తేదీ) వస్తుంది, అందరూ పండగ చేసుకోవడానికి సిద్దంగా ఉండాలని ఆర్ జేడీ కార్యకర్తలకు తేజస్వీ యాదవ్ సూచించారు.

 అరే సాంబా రాసుకోరా

అరే సాంబా రాసుకోరా

బీహార్ లోని 243 శాసన సభ నియోజక వర్గాల్లో పలు పార్టీలకు చెందిన 1, 204 మంది అభ్యర్థులతో పాటు 382 మంది స్వతంత్ర పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎంతమంది పోటీ చేసినా, అధికార పార్టీ నాయకులు (జేడీయూ- బీజేపీ) నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం మనవైపే ఉన్నారు, అధికారం మనదే, రేయా సాంబా రాసుకోరా అంటూ గబ్బర్ సింగ్ టైపులో ఆర్ జేడీ నేత తేజస్వీ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తేజస్వీ యాదవ్ కచ్చితంగా సీఎం అవుతారని ఆర్ జేడీ నాయకులు చిలక జోస్యం చెబుతున్నారు.

English summary
Bihar Assembly Election 2020: Bihar Voters Will Take Decision About Future, Says RJD leader Tejaswi Yadav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X