వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Shock: ట్రెండ్ ఫాలో అయిన మాజీ డీజీపీ, ట్రెండ్ సెట్ చేసిన కానిస్టేబుల్, అక్కడ ఓడలు బండ్లు అయ్యాయి!

|
Google Oneindia TeluguNews

పాట్నా/ బీహార్/ న్యూఢిల్లీ: ఎప్పుడు ఎవరు హీరో అవుతారో ఎవరు జీరో అవుతారో చెప్పడం చాలా కష్టం. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అని పెద్దల చెప్పిన సామెత ఇప్పుడు బీహార్ ఎన్నికల సందర్బంగా ఇద్దరి విషయంలో అక్షరాలా నిజం అయ్యింది. బీహార్ కే పోలీసు బాస్ గా ఉన్న వ్యక్తి అదే రాష్ట్రంలో కానిస్టేబుల్ గా పని చేసిన వ్యక్తి చేతిలో ఎదురుదెబ్బ తిన్నారు. కానిస్టేబుల్ గా పని చేసిన వ్యక్తి డీజేపీగా పని చేసిన వ్యక్తితో డీకొట్టి మరీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టిక్కెట్ సంపాధించుకున్నాడు. మాజీ డీజీపీ, మాజీ కానిస్టేబుల్ ఇద్దరూ ఒకే అసెంబ్లీ నియోజక వర్గం టిక్కెట్ కోసం పోటీ పడటం ఇక్కడ విశేషం. ట్రెండ్ ఫాలో అవడానికి మాజీ డీజీపీ ప్రయత్నిస్తే మాజీ కానిస్టేబుల్ ఇక్కడ ట్రెండ్ సెట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.

Waste husband: ఫస్ట్ నైట్ లేదు, భార్య పస్తులు, 400 మంది ఆంటీలతో ఎంజాయ్, క్యాషియర్ లీలలు!Waste husband: ఫస్ట్ నైట్ లేదు, భార్య పస్తులు, 400 మంది ఆంటీలతో ఎంజాయ్, క్యాషియర్ లీలలు!

డీజీపీ పదవి నుంచి రాజకీయాల్లోకి

డీజీపీ పదవి నుంచి రాజకీయాల్లోకి

బీహార్ డీజీపీ (పోలీస్ బాస్)గా పని చేసిన గుప్తేశ్వర్ పాండే స్వచ్చందంగా పదవీ విరమణ చేసి గత ఆదివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేతుల మీదుగా జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు. డీజేపీగా పని చేసిన అనుభవంతో ఆయన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజా సేవ చెయ్యాలని ప్రయత్నించారు.

 బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ కేసు ఎఫెక్ట్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ కేసు ఎఫెక్ట్

బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే జేడీయూలో చేరిన వెంటనే ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టిక్కెట్ ఇవ్వకూడదని, ఆయన మహారాష్ట్ర ప్రజలను అవమానించారని కాంగ్రెస్ పార్టీ కొత్తవాదన తెరమీదకు తెచ్చింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు విషయంలో ముంబాయి పోలీసుల మీద అప్పటి డీజేపీ హోదాలో గుప్తేశ్వర్ పాండే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

 కానిస్టేబుల్ కు జైకొట్టిన బీజేపీ

కానిస్టేబుల్ కు జైకొట్టిన బీజేపీ

తాను పుట్టిపెరిగిన సొంతఊరు అయిన బక్సార్ అసెంబ్లీ నియోజక వర్గం ఎన్నికల్లో పోటీ చెయ్యాలని మాజీ డీజేపీ గుప్తేశ్వర్ పాండే కలలుకన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సొంతఊరిలో పోటీ చెయ్యడానికే డీజేపీ పదవికి స్వచ్చందంగా రాజీనామా చేశారు. అయితే బక్సార్ నియోజక వర్గం అసెంబ్లీ టిక్కెట్ మాజీ కానిస్టేబుల్ పరుశురామ్ తన్నుకుపోయాడు.

ఓడలు బండ్లు అయ్యాయి..... బండ్లు ఓడలు అయ్యాయి

ఓడలు బండ్లు అయ్యాయి..... బండ్లు ఓడలు అయ్యాయి

బీహార్ పోలీసు శాఖలో పరుశురామ్ ఓ కానిస్టేబుల్ గా పని చేశాడు. సీఐడీతో పాటు నేర విచారణ శాఖ విభాగాల్లో పరుశురామ్ కు పనిచేసిన అనుభవం ఉంది. బీహార్ లో అధికారంలో ఉన్న జేడీయూ, ఆ పార్టీ మిత్రపక్షం బీజేపీల మధ్య అంతకు ముందే ఓ ఒప్పందం జరిగింది. మిత్రపక్షంలోని ఒప్పందంలో భాగంగా బక్సార్ నియోజక వర్గం బీజేపీకి కేటాయించిన జేడీయూ చివరికి మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండేకి చేతులు ఎత్దేసింది.

సార్ ఆశీర్వదించండి

సార్ ఆశీర్వదించండి

బక్సార్ నియోజక వర్గంలో పోటీ చెయ్యడానికి తనకు అవకాశం కల్పించిన బీజేపీకి మాజీ కానిస్టేబుల్ పరుశురామ్ ధన్యవాదాలు తెలిపారు. తనకు మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే సోదరుడితో సమానం, ఆయన ఆశీర్వాదంతో బక్సార్ నియోజక వర్గంలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని పరుశురామ్ ధీమా వ్యక్తం చేశారు.

Recommended Video

Bihar Elections 2020 : Key Issues in Nitish Vs Tejashwi Row | NDA alliance VS Mahagathbandhan
 ట్రెండ్ ఫాలో అయిన మాజీ డీజీపీ..... ట్రెండ్ సెట్ చేసిన మాజీ కానిస్టేబుల్

ట్రెండ్ ఫాలో అయిన మాజీ డీజీపీ..... ట్రెండ్ సెట్ చేసిన మాజీ కానిస్టేబుల్


ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మాజీ కానిస్టేబుల్ పరుశురామ్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే కాళ్లుమొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. మొత్తం మీద ఎప్పుడు ఎవరు హీరో అవుతారో, ఎవరు జీరో అవుతారో చెప్పడం చాలా కష్టం అనే సామెతకు ఈ బీహార్ లోని బక్సార్ నియోజక వర్గం చక్కటి ఉదాహరణగా నిలిచింది.

English summary
Bihar Assembly Election 2020: Buxar Assembly Election Ticket Race, Ex Constable Beats Bihar's Former DGP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X