వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

bihar-assembly-election-2020:రెండు ఐఈడీ బాంబులు స్వాధీనం, నిర్వీర్యం చేసిన సీఆర్పీఎఫ్..

|
Google Oneindia TeluguNews

బీహర్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల వేళ బాంబు కలకలం రేపింది. ఔరంగబాద్‌లో గల దిబ్రా ప్రాంతంలో రెండు ఐఈడీ బాంబులను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) స్వాధీనం చేసుకొంది. తర్వాత వాటిని జనావాసం లేని చోటకు తీసుకెళ్లి నిర్వీర్యం చేశాయి. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ పేలుడు పదార్థాలు ఎవరూ పెట్టారనే అంశంపై క్లారిటీ లేదు.

Recommended Video

Bihar Election Phase 1 : Bihar Assembly Election 2020 CRPF Defuses 2 Explosive Devices In Dhibra

16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఆర్జేడీ నుంచి 42 మంది, జేడీయూ నుంచి 35, బీజేపీ 29 మంది, 21 కాంగ్రెస్, 8 మంది లెప్ట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇతరులతో కలిపి మొత్తం 1066 మంది భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది.

Bihar Assembly Election 2020: CRPF defuses 2 explosive devices in Dhibra

కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నికల సంఘం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. 80 ఏళ్లు.. ఆ పై వయస్సు వారికి పోస్టల్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించింది. ఈవీఎంలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. థర్మల్ స్కానర్లను ఏర్పాటు చేశారు. ఓటర్లకు మంచినీరు, సబ్బుతోపాటు శానిటైజర్ కూడా అందుబాటులో ఉంచారు.

వచ్చేనెల 3వ తేదీన రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. 7వ తేదీన మూడో విడత ఎన్నికలతో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తారు. వచ్చేనెల 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోతోంది.

English summary
Two Improvised explosive devices were recovered and defused by Central Reserve Police Force in Aurangabad's Dhibra area on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X