వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CM Sketch: 30 మందిపై లైంగిక దాడి కేసు, కూమారీకి ఎమ్మెల్యే టిక్కెట్, లాలూ వియ్యంకుడికి సీఎం వల!

|
Google Oneindia TeluguNews

పాట్నా/న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఆ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల వేటలో బిజీ అయ్యారు. ధనబలం ఉన్న నాయకులను పార్టీ టిక్కెట్లు ఇవ్వడానికి పలు పార్టీలు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న మహిళ, మాజీ మంత్రికి జేడీయూ టిక్కెట్ ఇవ్వడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

30 మంది అమ్మాయిలపై లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తికి మీరు టిక్కెట్ ఇస్తారా ? అంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడంతో జేడీయూ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే CM Sketchతో మేము ఏం చెయ్యాలో మాకే తెలీదని జేడీయూ నేతలు అంటున్నారు.

Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!

సీఎం దూకుడు

సీఎం దూకుడు

బీహార్ లో అధికారంలో ఉన్న జేడీయూ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు ఇవ్వడం, అభ్యర్థులను జల్లెడ పట్టడంలో బిజీగా ఉంది. ఇక బీహార్ సీఎం నితీశ్ కుమార్ సైతం ఆచితూచి అభ్యర్థుల జాబితాను సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 115 మంది అభ్యర్థులజాబితాను సీఎం నితీశ్ కుమార్ విడుదల చేశారు.

ఇద్దరి పేర్లతో దూమరం

ఇద్దరి పేర్లతో దూమరం

బీహార్ సీఎం నితీశ్ కుమార్ విడుదల చేసిన 115 మంది జాబితాలో ఇద్దరు అనూహ్యంగా పార్టీ టిక్కెట్లు దక్కించుకున్నారు. 115 మంది జాబితాలో సీఎం నితీశ్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొత్తవారికి అవకాశం ఇచ్చారు. జేడీయూ విడుదల చేసిన జాబితాలో బీహార్ మాజీమంత్రి కూమారి మంజూవర్మ, ఆర్ జేడీ చీఫ్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మామ చంద్రికా రాయ్ కి జేడీయూ టిక్కెట్లు కేటాయించింది.

30 మందిపై లైంగిక దాడి కేసులో నిందితురాలు

30 మందిపై లైంగిక దాడి కేసులో నిందితురాలు

ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. షెల్టర్ హోమ్ లో ఉంటున్న 30 మంది బాలికల మీద లైంగిక దాడులు జరిగాయని ఆరోపణలు రావడంతో అప్పటి బీహార్ మంత్రి కూమారి మంజూవర్మతో పాటు ఆమె భర్త చంద్రశేకర్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏకంగా 30 మంది బాలికలపై లైంగిక దాడులు జరిగాయని ఆరోపణలు రావడంతో మంజూవర్మ ఆమె మంత్రి పదవికి రాజీనామా చేశారు.

బెయిల్ మీద దంపతులు

బెయిల్ మీద దంపతులు

బాలికలపై లైంగిక దాడులు జరిగాయని నమోదైన కేసులో బీహార్ మాజీ మంత్రి కుమారి మంజూవర్మ, ఆమె భర్త చంద్రశేఖర్ కోర్టు ముందు లొంగిపోయి బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ షెల్టర్ హోమ్ లైంగిక దాడి కేసును ప్రస్తుతం సీబీఐ విచారణ చేస్తోంది. ఇలాంటి లైంగిక దాడుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కూమారి మంజూవర్మకు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టిక్కెట్ ఇస్తారా ? అంటూ ప్రతిపక్షాలు సీఎం నితీశ్ కుమార్ పై విమర్శలు చేస్తున్నాయి. 2010, 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిరాయ్-బారాయ్ పూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన కుమారి మంజూవర్మ రెండు సార్లు భారీ మోజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు.

Recommended Video

Bihar Elections 2020 ABP-CVoter Opinion Poll : Nitish-Led NDA To Sweep With 141- 161 Seats
సినిమా ట్విస్ట్ లు కూడా వేస్ట్

సినిమా ట్విస్ట్ లు కూడా వేస్ట్

బీహార్ సెంబ్లీ ఎన్నికల్ల సందర్బంగా రాజకీయ నాయకులు ఒకరి ఎత్తులకు ఒకరు పైఎత్తులు వేస్తున్నారు. బీహార్ రాజకీయాల ముందు థ్రిల్లర్ సినిమా ట్విస్ట్ లు కూడా చాలా సింపుల్ గా కనిపిస్తున్నాయి. బీహార్ లో అధికారం కోసం ఆరాటపడుతున్న ఆర్ జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వియ్యంకుడు చంద్రిక రాయ్ కు జేడీయూ ఆనూహ్యంగా టిక్కెట్ కేటాయించి ఆందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తం మీద బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేడి దేశవ్యాప్తంగా కాక పుట్టిస్తోంది

English summary
Bihar Assembly Election 2020: The JD-U caught everyone by surprise by giving poll ticket to Kumari Manju Varma, the former Bihar social welfare minister and one of the accused of the infamous Muzaffarpur shelter home rape cases, in its list of 115 candidates announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X