వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

MLA candidate: వారంలో పోలింగ్, ఆడబిడ్డకు జన్మనిచ్చిన అభ్యర్థి, సీఎం, మోదీ ఖుషి, మంచిరోజులు!

|
Google Oneindia TeluguNews

పాట్నా/ బీహార్: బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న సందర్బంగా అక్కడ రాజకీయ ప్రచార వేడి తారాస్థాయికి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి ప్రచారం చెయ్యలేక ఆసుపత్రిలో ఉంది. అయితే ఆడబిడ్డకు జన్మనచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని స్వయంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీగ రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించి మా మహిళా అభ్యర్థికి ఓటు వేస్తే మీ జీవితాలు బాగుంటాయని, మీకు మంచి రోజులు వస్తాయని బీహార్ సీఎం స్థానిక ప్రజలకు మనవి చేస్తున్నారు.

Illegal affair: భర్త ఎగ్ రైస్ వ్యాపారి, గుడ్డు పక్కింట్లో పెడుతున్నాడని రాగిముద్దతో చంపేసిన భార్య!Illegal affair: భర్త ఎగ్ రైస్ వ్యాపారి, గుడ్డు పక్కింట్లో పెడుతున్నాడని రాగిముద్దతో చంపేసిన భార్య!

గ్రామ పంచాయితీ అధ్యక్షురాలు

గ్రామ పంచాయితీ అధ్యక్షురాలు


బీహార్ లోని జగదీష్ పుర్ శాసన సభ నియోజక వర్గం నుంచి సుషమ్లతా కుశ్వాన్ అనే మహిళ జేడీయూ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నిండు గర్బిణి అయిన సుషమ్లతా కుశ్వాన్ మీద ఉన్న నమ్మకంతో ఆమెకు సీఎం నితీశ్ కుమార్ జేడీయూ సీటు కేటాయించారు. ప్రస్తుతం సుషమ్లతా కుశ్వాన్ గ్రామ పంచాయితీ అధ్యక్షురాలి పదవిలో ఉన్నారు. లక్కీలేడీ సుషమ్లతా కుశ్వాన్ కు ఏకంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం చక్కింది.

మహిళలే టార్గెట్..... లక్కీలేడీ

మహిళలే టార్గెట్..... లక్కీలేడీ

జగదీష్ పుర శాసన సభ నియోజక వర్గంలో ఎక్కడ గ్రామసభలు జరిగినా గ్రామ పంచాయితీ అధ్యక్షురాలు సుషమ్లతా కుశ్వాన్ పాల్గొంటున్నది. గ్రామ పంచాయితీ సభలు, సమావేశాల్లో ఎక్కువ శాతం మహిళలు హాజరు కావడానికి సుషమ్లతా కుశ్వాన్ అనేక చర్యలు తీసుకుంది. గ్రామ సభల్లో మహిళలకు ప్రధాన్యత ఇస్తూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే సుషమ్లతా కుశ్వాన్ సీఎం నితీశ్ కుమార్ కంట్లో పడటంతో ఆమెకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం చిక్కింది.

 ఇప్పటికే కూతురు... ఇప్పుడు మరో కూతురు

ఇప్పటికే కూతురు... ఇప్పుడు మరో కూతురు

2012లో సుషమ్లతా కుశ్వాన్ కు వివాహం అయ్యింది. సుషమ్లతా కుశ్వాన్ కు ఇప్పటికే 5 ఏళ్ల కుమార్తె ఉంది. ఇప్పుడు మరో అమ్మాయికి ఆమె జన్మనిచ్చింది. జేడీయూలో సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన సుషమ్లతా కుశ్వాన్ తరువాత గ్రామ పంచాయితీ అధ్యక్షురాలు అయ్యింది. అంచలంచెలుగా సుషమ్లతా కుశ్వాన్ జేడీయూలో ఎదుగుతూ వచ్చింది. సుషమ్లతా కుశ్వాన్ పనితీరును స్వయంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అనేక సందర్బాల్లో మెచ్చుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల బరిలో 15 మంది లీడర్స్

అసెంబ్లీ ఎన్నికల బరిలో 15 మంది లీడర్స్

జగదీష్ పుర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి 15 మంది ప్రముఖలు పోటీ చేస్తున్నారు. స్థానిక ఆర్ జేడీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రంబిశున్ సింగ్ లోహియా, ఎల్ జేపీ నుంచి భగవాన్ సింగ్ కుశ్వాన్ తో పాటు మొత్తం 15 మంది అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నుంచి సుషమ్లతా కుశ్వాన్ పోటీ చేస్తున్నారు. జగదీష్ పుర్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న 15 మందిలో ఏకైక మహిళా అభ్యర్థి సుషమ్లతా కుశ్వాన్ కావడం ఇక్కడ ప్రత్యేకత.

 సీఎం, డీసీఎం ప్రచారం

సీఎం, డీసీఎం ప్రచారం

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సుషమ్లతా కుశ్వాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నది. జగదీష్ పుర్ నియోజక వర్గంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీతో పాటు బీజేపీ, జేడీయూ నాయకులు బహిరంగ ప్రచారం చేశారు. ఈ సందర్బంగా బహిరంగ సభలో మాట్లాడిన సీఎం నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ఆడబిడ్డకు జన్మనిచ్చిన సుషమ్లతా కుశ్వాన్ ను శుభకాంక్షలు తెలిపారు.

మీకు మంచి రోజులు రావాలంటే ఓటు వెయ్యండి

మీకు మంచి రోజులు రావాలంటే ఓటు వెయ్యండి

మీరు సుషమ్లతా కుశ్వాన్ కు గెలిపిస్తే మంచి రోజులు వస్తాయని, ఓటును దుర్వినియోగం చేసుకుంటే మీకు ఇక్కడ మళ్లీ కష్టాలు ఎదురౌతాయని ప్రత్యర్థి పార్టీ ఆర్ జేడీ ఎమ్మెల్యే రంబిశున్ సింగ్ లోహియాపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లిన సీఎం నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ జేడీయూ అభ్యర్థి సుషమ్లతా కుశ్వాన్ ను అభినందించి ధైర్యంగా ఉండాలని, నువ్వే కచ్చితంగా గెలుస్తావని ఆమెకు ధైర్యం చెప్పారు.

English summary
Bihar Assembly Election 2020: Jagdishpur JDU candidate Sushumlata Kushwaha has delivered a baby girl just ahead of election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X