• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
LIVE

Dubbaka Bypoll: ముగిసిన పోలింగ్.. దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు నవంబర్ 10

|

హైదరాబాదు: తెలంగాణలోని దుబ్బాకలో ఉపఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. సోమవారం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే క్రాంతిపై దాడి చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీలన్నీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా ఓటరు మాత్రం ఎవరికి ఓటు వేయాలన్నదానిపై క్లారిటీతో ఉన్నాడు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.

ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్ కోసం సన్నాహాలు పూర్తయ్యాయి. 17 జిల్లాల్లో 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 7 గంటలకు రెండోదశ పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఎన్నికల పోలింగ్ నాటికి రెండురోజుల ముందే ప్రచార పర్వానికి తెరపడింది.

Bihar Assembly Election 2020 Live Updates:94 seats to go for polling in second phase

రెండో దశ పోలింగ్‌లో మొత్తం 2.85 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రెండో దశలో 1500 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక రెండో దశలో వెస్ట్ చంపారన్, ఈస్ట్ చంపారన్, షెయోహర్, సీతమర్హి, మధుబని, దర్భాంగా, ముజాఫర్‌పూర్, గోపాల్ గంజ్చ సివాన్, శరన్, వైశాలి, సమస్తిపూర్, బెగుసరాయ్, ఖగారియా, భగల్‌పూర్, నలంద, పాట్నా జిల్లాలో పోలింగ్ జరగనుంది. ఇక రెండో దశ పోలింగ్ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ఉన్నాడు. వైశాలి జిల్లా రఘుపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వీ బరిలోకి దిగుతున్నాడు. సమిస్తాపూర్ జిల్లా హసన్‌పూర్ నియోజకవర్గం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ బరిలో దిగుతున్నాడు.

Newest First Oldest First
6:19 PM, 3 Nov
బీహార్
ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్. 94 సీట్లకు ముగిసిన పోలింగ్
6:18 PM, 3 Nov
నవంబర్ 10న దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు
6:17 PM, 3 Nov
దుబ్బాకలో ముగిసిన ఉపఎన్నిక పోలింగ్. సాయంత్రం 6 గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటువేసేందుకు అవకాశం
6:04 PM, 3 Nov
మధ్యప్రదేశ్
సాయంత్రం 5:30 సమయానికి మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో 66.09 శాతం పోలింగ్ నమోదు
5:25 PM, 3 Nov
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: సివాన్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు బారులు తీరిన మహిళలు.
5:23 PM, 3 Nov
దుబ్బాక ఉపఎన్నిక: సాయంత్రం 4 గంటల వరకు 78.12శాతం పోలింగ్ నమోదు
5:02 PM, 3 Nov
దుబ్బాకలో 3 గంటల వరకు 71 శాతం పోలింగ్ నమోదైంది.
5:01 PM, 3 Nov
దుబ్బాక ఉపఎన్నికలో పలుచోట్ల ఈవీఎం యంత్రాలు మొరాయించాయి.
4:23 PM, 3 Nov
బీహార్
ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉపాధిపై ప్రసంగించిన సమయంలో నితీష్ కుమార్‌పై రాళ్లు, ఉల్లిపాయలు విసిరిన ప్రజలు
3:29 PM, 3 Nov
బీహార్
భారత్ మాతా కీ జై, జైశ్రీరాం నినాదాలు మహాగట్భంధన్‌కు ఇబ్బందిగా మారాయి: ప్రధాని మోడీ
1:44 PM, 3 Nov
దుబ్బాక
దుబ్బాకలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 55.52 శాతం పోలింగ్ నమోదు
1:35 PM, 3 Nov
సిద్ధిపేట
సిద్ధిపేట
సిద్దిపేట తన నివాసంలో ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని సమీక్షిస్తున్న మంత్రి హరీష్ రావు,ఎమ్మెల్యే క్రాంతి కిరణ్,చింత ప్రభాకర్, దేవందర్ రెడ్డి గారు వివిధ మండలాల ఇంచార్జ్ పాల్గొన్నారు
1:07 PM, 3 Nov
పాట్నా
పాట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
1:06 PM, 3 Nov
బీహార్
బంకీపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తన కొడుకు లవ్ సిన్హా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేసిన శతృఘ్నసిన్హా
1:04 PM, 3 Nov
మధ్యప్రదేశ్
మధ్య ప్రదేశ్‌లో 29 స్థానాలకు ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో కమల్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రానికి ఏమీ చేయలేదు.. ప్రజలు మరోసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు: కమల్‌నాథ్
1:00 PM, 3 Nov
దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ అదనపు ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్
12:20 PM, 3 Nov
దుబ్బాక
దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు
11:46 AM, 3 Nov
బీహార్‌లో గత పదేళ్లలో ప్రతి ఇంటికి విద్యుత్,మరియు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. రానున్న రోజుల్లో బీహారీల ఆకాంక్షలను నెరవేరుస్తాం: ప్రధాని మోడీ
11:33 AM, 3 Nov
డీజీపీని కలిసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ మరియు కాంగ్రెస్ నేతలు.దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిపై టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ ఫిర్యాదు
11:12 AM, 3 Nov
దుబ్బాకలో ఉదయం 11 గంటల సమయానికి 33.34 శాతం పోలింగ్ నమోదు
11:11 AM, 3 Nov
వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును పరిశీలించిన కలెక్టర్ భారతి హొళికెరి
11:02 AM, 3 Nov
ప్రశాంతంగా సాగుతున్న దుబ్బాక పోలింగ్.. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సాగుతున్న పోలింగ్
10:57 AM, 3 Nov
దుబ్బాక
దుబ్బాక
దుబ్బాక ఉపఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత
10:55 AM, 3 Nov
ఎమ్మెల్యే క్రాంతిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయన్ను పరామర్శించి వివరాలను తెలుసుకున్న మంత్రి హరీష్ రావు
10:45 AM, 3 Nov
ఒడిషా
ఒడిషా ఉపఎన్నికలో భాగంగా ఓటర్లకు టెంపరేచర్ చెక్ చేస్తున్న సిబ్బంది
10:39 AM, 3 Nov
ఇప్పటి వరకు ఐదు ఎన్నికల్లో నాలుగుసార్లు విజయఢంకా మోగించిన టీఆర్ఎస్ పార్టీ
10:38 AM, 3 Nov
దుబ్బాకలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న గులాబీ దళం
10:34 AM, 3 Nov
దుబ్బాకలో ఉదయం 9 గంటల వరకు 12.74శాతం పోలింగ్ నమోదు
10:12 AM, 3 Nov
ఉత్తర ప్రదేశ్
ఉప ఎన్నికలను ఎదుర్కొంటోన్న ఉత్తర ప్రదేశ్‌లో ఉదయం 9 గంటల సమయానికి 7.87 శాతం పోలింగ్ శాతం నమోదైనట్లు వెల్లడించిన ఎన్నికల అధికారులు. యూపీలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నారు.
10:10 AM, 3 Nov
మధ్యప్రదేశ్
ఉప ఎన్నికలను ఎదుర్కొంటోన్న మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని ఓ పోలింగ్ కేంద్రానికి చేతుల మీద తన తల్లిని ఎత్తుకొచ్చిన వ్యక్తి.
READ MORE

English summary
The second phase of the Bihar Assembly election is scheduled to be held on Tuesday (3 November). The second of the three-phased poll will see over 2.85 crore voters cast their ballot, while there are nearly 1,500 candidates in the fray
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X