• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అసలు అగ్నిపరీక్ష: పదవులపై పేచీ: ఎల్లుండి ఎన్డీఏ భేటీ: ముఖ్యమంత్రికి అసమ్మతి ఉచ్చు

|

పాట్నా: బిహార్ రాజకీయాల్లో మలి అంకం ఆరంభమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో గట్టెక్కిన నితీష్ కుమార్ ప్రభుత్వానికి అసలు అగ్నిపరీక్ష ఎదురైంది. ఇన్నాళ్లూ ఓ మోస్తరు మెజారిటీతో ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చిన ఆయన రాజకీయ చతురతకు, వ్యూహాలకు ఈ సారి అయిదేళ్ల పదవీ కాలం ముళ్ల కిరీటంలా మారడం ఖాయంగా కనిపిస్తోంది. పదవుల పంపకాల్లో ఏ మాత్రం తేడా కొట్టినా.. ప్రభుత్వం మైనారిటీలో పడే ప్రమాదాన్ని నితీష్ కుమార్ ఎదుర్కొంటున్నారు.

స్థానిక సంస్థల పోరుపైనా కన్నేసిన ఒవైసీ: అసద్‌తో బిహార్ మజ్లిస్ ఎమ్మెల్యేలు భేటీ: రోడ్ మ్యాప్స్థానిక సంస్థల పోరుపైనా కన్నేసిన ఒవైసీ: అసద్‌తో బిహార్ మజ్లిస్ ఎమ్మెల్యేలు భేటీ: రోడ్ మ్యాప్

ఆ రెండు పార్టీలే కీలకం..

ఆ రెండు పార్టీలే కీలకం..

243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 స్థానాలు అవసరం అవుతాయి. దీనికంటే మూడంటే మూడు సీట్లను మాత్రమే జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతాపార్టీ సంకీర్ణ కూటమి దక్కించుకోగలిగింది. మొన్నటి ఎన్నికల్లో జేడీయూ-115, భారతీయ జనతా పార్టీ-110, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ-11, జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ ఆవామ్ మోర్చా-7 స్థానాలకు పోటీ చేశాయి. ఇందులో బీజేపీ-74, జేడీయూ-43 సీట్లల్లో గెలుపొందాయి. ఈ రెండు పార్టీలకు కూడా 122 స్థానాలు దక్కలేదు. ఎన్డీఏతో పొత్తు కుదుర్చుకున్న హిందుస్తాన్ ఆవామీ మోర్చా, వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ నాలుగు చొప్పున స్థానాలను గెలుచుకున్నాయి.

మంత్రి పదవులు..

మంత్రి పదవులు..


ఈ రెండు పార్టీలకు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కలుపుకొంటే 125కు చేరుతుంది నితీష్ కుమార్ బలం. ఈ ఎనిమిది మంది ఎన్డీఏ నుంచి బయటికి వస్తే.. నితీష్ కుమార్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. ఏ రకంగా చూసుకున్నా ఇది ఆయనకు కత్తి మీద సాములాంటిదే. ఈ పరిణామాల మధ్య జేడీయూ, బీజేపీ, హిందుస్తానీ ఆవామ్ మోర్చా, వికాల్ శీల్ ఇన్సాఫ్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఆదివారం రాజధాని పాట్నాలో సమావేశం కాబోతున్నారు. మంత్రి పదవుల కేటాయింపుపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రిగా నితీష్ ఎన్నిక..

ముఖ్యమంత్రిగా నితీష్ ఎన్నిక..

ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించడానికి అవసరమైన ఉమ్మడి సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై చర్చించడానికి ఎన్డీఏ నేతలు ఈ ఉదయం పాట్నాలో నితీష్ కుమార్ నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం ఆదివారం భేటీ కావాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్‌ను ఈ సమావేశం సందర్భంగా అధికారికంగా ఎన్నుకోవడం లాంఛనప్రాయమే. సభాపక్ష నేతగా ఆయనను ఎన్నకుంటారు. ప్రమాణ స్వీకారం ఎప్పడు చేయాల్సి ఉంటుందనే తేదీని కూడా ఈ సమావేశంలోనే ఖరారు చేస్తారు. మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలనే అంశంపైనా చర్చ సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ భేటీని ఎన్డీఏ నేతలు అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు.

  #Biharelectionresults2020: 'Voter's Priority Is Only Development' - PM Modi
  సాయంత్రం కేబినెట్..

  సాయంత్రం కేబినెట్..

  ఇదిలావుండగా.. ఈ సాయంత్రం నితీష్ కుమార్.. మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మంత్రులకు మాత్రమే ఈ కేబినెట్‌కు హాజరు కావాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఈ మేరకు సమాచారాన్ని పంపించినట్లు చెబుతున్నారు. గెలిచిన మంత్రులు ఈ భేటీకి హాజరు కావాల్సి ఉంటుంది. కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా వారు తమ తదుపరి చర్యలను తీసుకుంటారని అంటున్నారు.

  English summary
  Bihar Chief Minister Nitish Kumar told that NDA MLAs will hold a joint meeting, all decisions will be notified at that meeting. The meeting will be held on November 15th at 12:30 pm. There will be a Cabinet meeting today in the evening, Nitish Kumar said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X