వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలోకి మోదీ... 12 ర్యాలీల్లో పాల్గొననున్న ప్రధాని...

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగనున్నారు. ఎన్డీయే ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా మొత్తం 12 ర్యాలీల్లో ఆయన పాల్గొననున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మొదట అక్టోబర్ 23న ససరం,గయా,భాగల్‌పూర్‌లలో జరిగే ఎన్నికల ర్యాలీల్లో మోదీ పాల్గొననున్నట్లు బీహార్‌ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ప్రధాని మోదీ ర్యాలీలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో పాటు ఎన్డీయే మిత్రపక్ష నేతలు హాజరవుతారని చెప్పారు.

Recommended Video

Bihar Elections 2020 : PM Modi To Hold 12 Election Rallies in Bihar| NDA alliance VS Mahagathbandhan

అక్టోబర్ 28 నాటికి మోదీ రెండో విడత ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొంటారని... ఇందులో భాగంగా దర్భంగా,ముజఫర్‌పూర్,పాట్నా తదితర పట్టణాల్లో జరిగే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటారని తెలిపారు. నవంబర్ 1 నుంచి నవంబర్ 3 వరకూ తూర్పు చంపారన్,చప్రా,సమస్తీపూర్ జిల్లాల్లో జరిగే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటారని... పశ్చిమ చంపారన్,సహస్రా,ఫోర్బ్స్ గంజ్‌లలో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని చెప్పారు.

Bihar Assembly Election 2020 PM Modi to hold 12 rallies as part of campaign

ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానంగా ఏ అంశాన్ని అస్త్రంగా మలుచుకోబోతున్నారన్న దానిపై గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. 'ఆయన చెప్పబోయే విషయాలు చాలా కీలకం... ఆయనకున్న పాపులారిటీ రీత్యా సహజంగానే జనం ఆయన ఏం చెప్తారా అని కుతుహలంతో ఎదురుచూస్తుంటారు.. ఆయన చెప్పే అంశాలే ఎన్నికల్లో కీలకంగా మారవచ్చు..' అని ఏసియన్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ADRI) వ్యవస్థాపకుడు షైబల్ గుప్తా పేర్కొన్నారు.

కాగా,మొత్తం మూడు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 28న తొలి దశ, నవంబరు 3న రెండో దశ, నవంబరు 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబరు 10న ఫలితాలను ప్రకటిస్తారు. కరోనా నేపథ్యంలో బౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఎక్కువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ధర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. 46 లక్షల మాస్కులు, 6 లక్షల పీపీఈ కిట్లు, 7 లక్షల శానిటైజర్లు, 7.6 లక్షల ఫేస్ షీల్డ్స్, 23 లక్షల హ్యాండ్ గ్లవ్స్ ఎన్నికల ప్రక్రియ కోసం అందుబాటులో ఉంచనున్నారు. పోలింగ్ సమయాన్ని కూడా గంట పెంచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంగ్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మాస్కు ఉన్న వారిని మాత్రమే ఓటింగ్‌కు అనుమతిస్తారు. చివరి గంటలో కోవిడ్ రోగులకు ఓటువేసే అవకాశం కల్పిస్తారు.

English summary
Prime Minister Narendra Modi is scheduled to hold 12 rallies across Bihar as part of the National Democratic Alliance’s (NDA) campaign for the upcoming three-phase state elections, Bharatiya Janata Party (BJP) said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X