వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bihar assembly election 2020:బీహర్‌లో మందకొడిగా పోలింగ్, ఓటుహక్కు వినియోగించుకోండి: మోడీ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ తర్వాత దేశంలోనే కాదు ప్రపంచంలో తొలిసారి ఓ రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి. బీహర్‌లో తొలి విడత 71 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కోవిడ్-19 కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే బీహర్ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. కరోనా వైరస్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకొని.. ఓటేయాలని విన్నవించారు.

Recommended Video

Bihar Elections 2020 Voting Underway: Modi Urges Voters కనీవినీ ఎరుగని రీతిలో ఓ రాష్ట్ర ఎన్నికలు!!

తొలి గంటలో 5 శాతం మాత్రమే పోలింగ్ శాతం నమోదయ్యింది. తర్వాత మరో గంటకు.. ఉదయం 9 గంటల వరకు 6.03 శాతం ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంది అని ప్రధాని మోడీ భావించారు. ఓటు హక్కు వినియోగించుకొని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.01 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 599 మంది థర్డ్ జెండర్ ఉన్నారు.

Bihar Assembly Election 2020: PM Modi urges voters to join polling with COVID-19 precautions

ఆర్జేడీ నుంచి 42 మంది, జేడీయూ నుంచి 35, బీజేపీ 29 మంది, 21 కాంగ్రెస్, 8 మంది లెప్ట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇతరులతో కలిపి మొత్తం 1066 మంది భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. వచ్చేనెల 3వ తేదీన రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. 7వ తేదీన మూడో విడత ఎన్నికలతో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తారు. వచ్చేనెల 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోతోంది.

English summary
voting got underway in bihar, Prime Minister Narendra Modi urged the voters to participate in the “festival of democracy”, following all COVID-19-related precautions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X