అంతు చిక్కని ఓటరు నాడి -ఎన్నికల ఫలితాలపై పండితుల పల్టీ -ఈసారైనా నిజమవుతాయా?
కరోనా విలయ కాలంలో చేపట్టిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రహాసనంలో తుది అంకానికి ఇంకొద్ది గంటల్లో తెర లేవనుంది. చివరిదైన మూడో దశ పోలింగ్ లో భాగంగా 19 జిల్లాల్లోని 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసింది. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి ఇప్పటికే మొదటి, రెండో దశల్లో 165 సీట్లకు ఎన్నికలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక..
ట్రంప్‌కు భారీ షాక్: చీలిన రిపబ్లికన్లు -పిచ్చి ముదిరింది -ఎన్నికల సమగ్రతపై దాడి అంటూ తీవ్ర విమర్శలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల అధికారిక ఫలితాలు ఈనెల 10న(మంగళవారం) వెలువడనుండగా... చివరి దశ పోలింగ్ పూర్తయిన వెంటనే.. సర్వే సంస్థలు, న్యూస్ ఛానెళ్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించబోతున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల నేపథ్యంలో శనివారం చివరి దశ పోలింగ్ ముగిసిన తర్వాతే(సాయంత్రం 6 తర్వాతే) ఆయా ఛానెళ్లు, సర్వే సంస్థలు తమ అంచనాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది. కాగా..
షాక్: వారం తర్వాతే అమెరికా ఫలితాలు -9రాష్ట్రాల్లోనే ఆలస్యం ఎందుకంటే -భారత ఈసీకి జేజేలు

ఎగ్జిట్ పోల్స్ తారుమారు..
బీహార్ లో ఓటరు నాడిని పసిగట్టడంతో ఎగ్జిట్ పోల్స్ దారుణంగా విఫలమైన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. చివరిగా 2015 ఎన్నికల్లోనూ ఒకే ఒక్క అనామక సంస్థ తప్ప.. పోల్ పండితులుగా పేరుపొందిన వాళ్లంతా ప్రిడిక్షన్లు చెప్పడంలో దెబ్బతిన్నారు. నిజానికి ఓపీనియన్ పోల్స్ కంటే భిన్నంగా.. ఆయా పోలింగ్ బూత్ ల వద్ద నేరుగా ఓటర్ల నుంచి(ఓటేసిన తర్వాత) సేకరించిన అభిప్రాయాలతో ఎగ్జిట్ పోల్స్ ను రూపొందిస్తారు. గతంలో అవి కూడా తారుమారైన నేపథ్యంలో ఈసారైనా ఎగ్జిట్ పోల్స్ ఫలిస్తాయా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి...

2015లో ఏం జరిగిందంటే..
2015 బీహార్ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ జాతీయ ఛానెళ్లు చేసిన పోల్ సర్వేలన్నీ తప్పుగా తేలాయి. అప్పటికి అనామక సంస్థగా ఉన్న ‘యాక్సిస్ ఏపీఎం' తప్ప ఏ ఒక్కరూ సరైన అంచనాలను వెలువరించలేదు. నాటి బీహార్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బంపర్ మెజార్టీ సాధిస్తుందని చాణక్య టుడే, ఏబీపీ-నిల్సన్, ఇండియా టుడే-సిసిరో, ఎన్డీటీవీ లాంటి బడా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విషయంలో పప్పులో కాలేశాయి. ఒక్క ‘యాక్సిస్ ఏపీఎం' సంస్థ మాత్రమే నితీశ్-లాలూ నేతృత్వంలోని మహా కూటమికి 169 నుంచి 183 సీట్లు దక్కుతాయని సరిగ్గా అంచనా వేసింది. 2015 ఎన్నికల్లో మహాకూటమికి 178 సీట్లు(ఆర్జేడీ 80, జేడీయూ 71, కాంగ్రెస్ 27) దక్కగా, ఎన్డీఏకు కేవలం 56 సీట్లు దక్కాయి. అందులో బీజేపీ వాటానే 52. సీపీఐ ఎంల్ 3, ఇండిపెండెంట్లకు 4 స్థానాలు దక్కాయి. ఇక.

సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు..
2020 బీహార్ ఎన్నికలకు సంబంధిచి పలు జాతీయ ఛానెళ్లు ఓపీనియన్ పోల్స్ పేరుతో వెల్లడించిన అభిప్రాయంలోనూ.. ఈసారి మొగ్గు ఎన్డీఏ వైపే ఉందని, తేజస్వీ యాదవ్ నాయకత్వంలోని మహా కూటమి 70 నుంచి 90 సీట్లకే పరిమితమైపోతుందని పేర్కొన్నాయి. అయితే, సోషల్ మీడియా, యూట్యూబ్ కేద్రంగా పనిచేసే చిన్న మీడియా సంస్థలు నేరుగా జనంలోకి వెళ్లినప్పుడు మాత్రం 95 శాతానికి పైగా ఈసారి మార్పును కోరుతున్నట్లు చెప్పారు. తుది ఫలితం ఎలా ఉండబోతున్నదో తెలియాలంటే ఈనెల 10 వరకు ఆగాల్సిందే.