వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

bihar-assembly-election-2020: నితీశ్ కుమార్ నాలుగోసారి అధికారం చేపడుతారా..?

|
Google Oneindia TeluguNews

బీహర్ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 71 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. అయితే బీహర్ ఎన్నికల్లో నితీశ్ అధికారం చేపడుతారా అనే చర్చ జరుగుతోంది. నాలుగోసారి సీఎం పదవీ చేపడుతారా..? బీహరీలు మద్దతు తెలుపుతారా అనే ప్రశ్న తలెత్తుతోంది. సర్వేలు అన్నీ నితీశ్ వైపు మొగ్గుచూపాయి. కానీ వాస్తవం ఏంటో పోలింగ్ తర్వాత తేలనుంది.

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రచార పర్వంలో దూసుకెళుతున్నారు. 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు చిరాగ్ పాశ్వాన్ కూడా నితీశ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బీహర్ నుంచి నితీశ్ విముక్తి అంటూ ధ్వజమెత్తారు. దీనికితోడు లాక్ డౌన్ సమయంలో వలసకూలీల ఇబ్బందులు, ముజఫర్ నగర్ షెల్టర్ హోం ఇష్యూలను అస్త్రాలుగా ఎంచుకుంటున్నారు.

Bihar Assembly Election 2020: Will Nitish Kumar Get A Fourth Term?

కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నికల సంఘం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. 80 ఏళ్లు.. ఆ పై వయస్సు వారికి పోస్టల్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించింది. ఈవీఎంలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. థర్మల్ స్కానర్లను ఏర్పాటు చేశారు. ఓటర్లకు మంచినీరు, సబ్బుతోపాటు శానిటైజర్ కూడా అందుబాటులో ఉంచారు.

వచ్చేనెల 3వ తేదీన రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. 7వ తేదీన మూడో విడత ఎన్నికలతో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తారు. వచ్చేనెల 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోతోంది.

English summary
three-phase election in Bihar that would decide if Nitish Kumar gets a fourth term as the Chief Minister, began this morning with voting on 71 of the state's 243 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X