వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bihar: MGB అంటే మహాఘట్ బంధన్ కాదు ‘మర్ గయా భయ్యా’: మీరు ఫినిష్, కేంద్ర మంత్రి జోకులు !

|
Google Oneindia TeluguNews

పాట్నా/ కొల్ కత్తా/ న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా మారుతోంది. బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో రౌండ్ రౌండ్ కు ఫలితాలు తారుమారు కావడంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎంతకావాలంటే అంత బీపీ పెరిగిపోతుంది. బీహార్ లో ఇప్పటి వరకు ఎన్ డీఏ కూటమి ముందంజలో దూసుకుపోతుంది. అయితే బీహార్ లో మేమే అధికారంలోకి వస్తామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మహాఘట్ బంధన్ (MGB) నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. MGB అంటే మహాఘట్ బంధన్ కాదు 'మర్ గయా భయ్యా,' అని అర్థం, మీపని అయిపోయిందిరా, మీరు ఫినిష్ భయ్యా అంటూ కేంద్ర మంత్రి బబూల్ సుప్రియో ఆర్ జేడీ, కాంగ్రెస్ పార్టీల నాయకులను ఎద్దేవ చేస్తూ జోకులు వేశారు.

Super: బీహార్ సీఎం తేజస్వీ యాదవ్, ఓరి పిచ్చోడా, ఎవడిగోళవాడిది, లీడర్ ఏం చెప్పారు ? వీళ్లు ఏం చేశారు!Super: బీహార్ సీఎం తేజస్వీ యాదవ్, ఓరి పిచ్చోడా, ఎవడిగోళవాడిది, లీడర్ ఏం చెప్పారు ? వీళ్లు ఏం చేశారు!

 నువ్వానేనా.... చూసుకుందామా ?

నువ్వానేనా.... చూసుకుందామా ?

బీహార్ అసెంబ్లీ ఫలితాల కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్ జేడీ నేత, మహాఘట్ బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటీ పడుతున్నారు. బీహార్ రారాజు నువ్వానేనా అంటూ ఓట్ల లెక్కింపు సందర్బంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య పోటీ తారాస్థాయికి చేరింది.

MGB అంటే మర్ గయా భయ్యా

MGB అంటే మర్ గయా భయ్యా

బీహార్ లో ఆర్ జేడీ- కాంగ్రెస్ వాటి మిత్రపక్షాలు కలిసి మహాఘట్ బంధన్ (MGB) అనే కూటమిని ఏర్పాటు చేసి ఎన్ డీఏతో పోరాటం చేసిన విషయం తెలిసిందే. మహాఘట్ బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ పేరు ప్రకటించేశారు. ఎంజీబీ అంటే మహాఘట్ బంధన్ కాదు ‘మర్ గయా భయ్యా' అని అర్థం అని కేంద్ర మంత్రి, పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకుడు బబూల్ సుప్రియో సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీరు ఫినిష్..... అది గ్యారెంటీ

మీరు ఫినిష్..... అది గ్యారెంటీ


బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం అర్దరాత్రికి పూర్తి కావచ్చని ఎన్నికల కమీషన్ అధికారులు అంచనా వేశారు. మంగళవారం రాత్రి 7.45 గంటల సమయానికి మహాఘట్ బంధన్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఆర్ జేడీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తున్నదని వెలుగు చూసింది .ఇలాంటి సమయంలో మీరు ఎలాగూ అధికారంలోకి రాలేరు అది గ్యారెంటీ, ఫలితాలు మొత్తం వెళ్లడి అయిన తరువాత మర్ గయా భయ్యా, మేము ఫినిష్ అంటూ మీరే ఏడుస్తారని కేంద్ర మంత్రి బబూల్ సుప్రియో వ్యంగంగా అన్నారు.

ఎన్ డీఏ VS ఎంజీబీ

ఎన్ డీఏ VS ఎంజీబీ

బీహార్ లో ఎన్ డీఏ అధికారంలోకి వస్తుందా ? లేక మహాఘట్ బంధన్ (ఎంజీబీ) అధికారంలోకి వస్తుందా ? అనే విషయం కచ్చితంగా చెప్పడం సాధ్యం కావడం లేదు. ప్రతి రౌండ్ రౌండ్ కు ఫలితాలు తారుమారు అవుతున్నాయి. మంగళవారం రాత్రి 7. 30 గంటల వరకు ఎన్నికల అధికారులు ప్రకటించిన ఫలితాల ప్రకారం ఎన్ డీఏ- 121, మహాఘట్ బంధన్- 114, ఇతరులు-8 మంది ముందంజలో దూసుకుపోతున్నారు. మొత్తం మీద అర్దరాత్రి ఎవరు స్వీట్లు పంచుకుంటారు ? ఎవరు తలలు పట్టుకుంటారు అనే విషయం కొన్ని గంటల్లో పక్కాగా వెలుగు చూడనుంది.

Recommended Video

#Biharelectionresults2020: EVMs Are Robust, Tamper-Proof, SC Upheld Its Integrity More Than Once: EC

English summary
Bihar Assembly Election Result 2020: Union state minister Babul Supriyo mocked Mahagathbandhan (MGB) as Mar Gaya Bhai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X