వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bihar elections: 46 మంది అభ్యర్థులతో బీజేపీ ఫేజ్-2 జాబితాల విడుదల

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రెండో దశ పోలింగ్ జరిగే 46 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశమైన మరుసటి రోజే ఈ జాబితాను విడుదల చేయడం గమనార్హం.

ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న నంద కిశోర్, మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా తనయుడు నితీష్ మిశ్రా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. బీహార్ అసెంబ్లీలో 243 స్థానాలుండగా, 110 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను నిలబెడుతోంది. 11 సీట్లను వీఐపీకి కేటాయించింది.

Bihar assembly elections 2020: BJP releases list of 46 candidates for phase 2

ఎన్డీఏలో భాగస్వామి అయిన జేడీయూ 115 సీట్లలో పోటీ చేస్తుండగా, జితన్ రాం మాంఝీకి చెందిన హెచ్ఏఎంకి ఏడు సీట్లు ఇచ్చింది. . కాగా, 243 అసెంబ్లీ స్థానాలు కలిగిన బీహార్ రాష్ట్రంలో మూడు దశల్లో (అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7) ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

నితీష్ చేతిలో బీహార్.. మోడీ చేతిలో దేశం..
ప్రధాని నరేంద్ర మోడీలో చేతిలో దేశం ఎలా సురక్షితంగా ఉందో.. బీహార్ రాష్ట్రం సురక్షితంగా ఉండాలంటే అధికారం నితీష్ కుమార్ చేతిలో ఉండాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో బీహార్ ప్రజలను నితీష్ కంటికి రెప్పలా చూసుకున్నారని, రాష్ట్రంలో వెలుపల ఉన్నవారికి కూడా ఆర్థిక సాయం చేశారన్నారు.

Recommended Video

Donald Trump's Telangana Fan Bussa Krishna Lost Life ట్రంప్‌ మీద పిచ్చి ప్రేమతో అభిమాని మృతి

గతంలో బీహార్ మొత్తం కేవలం నాలుగు మెడికల్ కాలేజీలు ఉండేవని, ఆరేళ్లలో అవి 14కు పెరిగాయన్నారు. మరో 11 కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లే బాధ్యత తమదేనని జేపీ నడ్డా హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం పాట్నాకు చేరుకున్నారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే, నితీష్ కుమార్‌ను ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించారు.

English summary
The Bharatiya Janata Party (BJP) on Sunday released a list of 46 candidates who will be contesting from 94 constituencies in Bihar that go to polls in the second phase of assembly elections in the state on November 3.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X