• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ అసెంబ్లీ ఎన్నికల భారం ఈ కాంగ్రెస్ నేతల మీదే: మేజిక్ చేస్తారో?.. ముంచేస్తారో?

|

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం గడుస్తున్న కొద్దీ.. అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తన పట్టును నిలుపుకోవడానికి జనతాదళ్ (యునైటెడ్) సారథ్యంలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. బిహార్ అసెంబ్లీలో పాగా వేయడానికి సుదీర్ఘ కాలం నుంచీ వేచి చూస్తోన్న కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల బరిలో హోరాహోరీ పోరుకు తెర తీశాయి.

భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఈ సారి ఒంటరిగా పోటీ చేయబోతోండటం వల్ల ఓట్లు జేడీయూ పడే ఓట్లు చీలుతాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని అవకాశాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తోంది. రాష్ట్రీయ జనతాదళ్‌తో సీట్ల సర్దుబాటు, ఎల్జేపీ ఒంటరిపోరు వంటి అంశాలు తమకు లాభిస్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఇక ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన 30 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా బరిలో దింపబోతోంది. దీనికి సంబంధించిన జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ, మాజీ అధినేత రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఉన్నారు. అనారోగ్య కారణాల వల్ల సోనియాగాంధీ నేరుగా బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం లేదు. వర్చువల్ ర్యాలీల్లో మాత్రమే ఆమె ప్రసంగిస్తారని పార్టీ నాయకులు వెల్లడించారు.

bihar assembly elections 2020: Congress releases list of 30 star campaigners

వారితో పాటు కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌, బిహార్‌కే చెందిన షాట్‌గన్ శతృఘ్న సిన్హా, ఉత్తర ప్రదేశ్ సీనియర్ నేత రాజ్‌బబ్బర్, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), కేప్టెన్ అమరీందర్ సింగ్ (పంజాబ్), భూపేష్ బఘేల్ (ఛత్తీస్‌గఢ్)ను స్టార్ క్యాంపెయిన్ల లిస్టులో చేర్చింది.

  Bihar Elections 2020 : Key Issues in Nitish Vs Tejashwi Row | NDA alliance VS Mahagathbandhan

  తారిఖ్ అన్వర్, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, షకీల్ అహ్మద్, కీర్తి ఆజాద్ వంటి అనుభవం ఉన్న నేతలను పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయబోతున్నారు. మూడు దశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించబోతోంది కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం. తొలి విడత పోలింగ్ ఈ నెల 28వ తేదీన జరుగనుంది. వచ్చేనెల 3వ తేదీన రెండో విడత, 7న తుది దఫా పోలింగ్‌ను నిర్వహించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి.

  English summary
  Bihar assembly elections 2020: The list of star campaigners include Sonia Gandhi, Rahul Gandhi, former Prime Minister Manmohan Singh, Priyanka Gandhi along with celebrity politicians like Shatrughan Sinha and Raj Babbar, among other leaders.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X