వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bihar Assembly Elections Result 2020: ఎన్డీయే ఆర్జేడీ కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 7తో ముగిశాయి. ఇక అదే రోజున ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి. అయితే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఈ సారి బీహార్‌ను ఏలేది ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమే అని తేల్చేశాయి. ఇక సీఎంగా తేజస్వీ యాదవ్ ప్రమాణస్వీకారం చేయడమే మిగిలిందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే కొన్ని సార్లు ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా తప్పే అవకాశాలున్నాయి. నవంబర్ 10వ తేదీన ఓటరు తీర్పు వెలువడనుంది. ఇప్పటికే ఓటరు తీర్పు ఈవీఎంలలో సంక్షిప్తమై ఉంది. ఇక నవంబర్ 10వ తేదీన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020కి సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఈ సారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య జరిగాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు జరిగాయి. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికలకు లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉండటంతో తొలిసారిగా ఆయన ప్రచారంకు దూరమయ్యారు. అయితే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా‌తో పాటు పలువురు ఇతర టాప్ నాయకులు ఎన్డీయే తరపున ప్రచారం చేశారు. అంతేకాదు ఎన్నికలకు ఒక్క రోజు ముందు అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు తిరిగి నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ ప్రజలకు లేఖ రాశారు.

Bihar Assembly Elections 2020 Results Live updates in Telugu

ఇక బీహార్ ఎన్నికల ఫలితాలతో పాటుగా తెలంగాణలోని దుబ్బాకకు జరిగిన ఉపఎన్నిక ఫలితాలు కూడా మినిట్‌-టూ- మినిట్ అప్‌డేట్స్ మీకోసం

Newest First Oldest First
1:55 AM, 11 Nov

ఇప్పటివరకూ 235 అసెంబ్లీ స్థానాల్లో ఫలితం తేలినట్లు ఈసీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇందులో ఎన్డీయే 119 స్థానాల్లో గెలుపొందగా...108 స్థానాల్లో మహాకూటమి గెలుపొందింది. ఎంఐఎం 5 స్థానాల్లో,బీఎస్పీ ఒక స్థానంలో గెలుపొందాయి. మరో 6 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యంలో ఉండగా... ఆర్జేడీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
1:38 AM, 11 Nov

మధ్యప్రదేశ్‌లోని కేవలం రెండు స్థానాలు మినహాయిస్తే మిగతా ఉపఎన్నికల ఫలితాలన్నీ వెల్లడించినట్లు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఆశిష్ కుంద్రా తెలిపారు.
1:09 AM, 11 Nov

బీహార్ ఎన్నికల్లో ఇప్పటివరకూ 223 స్థానాల్లో ఫలితం వెల్లడైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మరో 20 చోట్ల ఇంకా తుది ఫలితం వెల్లడికావాల్సి ఉందని తెలిపింది.
12:46 AM, 11 Nov

ఇది చారిత్రాత్మక దినం. బీహార్‌లో ఎన్డీయే మరోసారి అక్కడి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నది. ప్రధాని మోదీ నాయకత్వాన్ని వారు విశ్వసించారు. బీహార్ అభివృద్ది జరగకుండా భారత్ అభివృద్ది అసంపూర్తిగా మిగిలిపోతుందని చాటి చెప్పారు.: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
12:38 AM, 11 Nov

బీహార్‌లో 203 స్థానాల ఫలితాలను ఈసీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో ఎన్డీయే 102(బీజేపీ 60,జేడీయూ 34,వీఐపీ 4,హెచ్ఏఎం 4),మహాకూటమి(ఆర్జేడీ 64,కాంగ్రెస్ 16,వామపక్షాలు 13) స్థానాలు,ఎంఐఎం 5,బీఎస్పీ 1,స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలుపొందారు.
12:19 AM, 11 Nov

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్దికే పట్టం కట్టారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే 122 సీట్ల ఆధిక్యంలో ఉందన్నారు. ప్రజాస్వామ్యం ఎలా బలోపేతం అవుతుందో తాజా తీర్పుతో బీహార్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. రికార్డు స్థాయిలో పేదలు,అణగారిన వర్గాలు,మహిళలు బీజేపీకి ఓటు వేశారని చెప్పారు.
11:32 PM, 10 Nov

బిహార్ ఎన్నికలపై అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రెస్ మీట్ నిర్వహించనున్న కేంద్ర ఎన్నికల సంఘం....
10:33 PM, 10 Nov

బీహార్లో కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్‌. ఇప్పటి వరకు 121 స్థానాల్లో ఎన్డీయే విజయం సాధించగా..109 స్థానాల్లో ఆర్జేడీ కూటమి విజయం సాధించింది
9:13 PM, 10 Nov

హైదరాబాదు

బీహార్‌లో మజ్లిస్ పార్టీ ఐదు సీట్లు విజయం సాధించడంలో హైదరాబాదులోని అసదుద్దీన్ ఓవైసీ ఇంటి బయట సంబరాలు
7:25 PM, 10 Nov

బీహార్‌లో ముగిసిన 75 శాతం ఓట్ల లెక్కింపు. ఎన్డీయేకు 37.14శాతం ఓటు షేరు దక్కగా...మహాకూటమికి 37.04శాతం ఓటు షేరు లభించింది.
7:08 PM, 10 Nov

బీహార్‌లో కచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్లను పిలిచి కౌటింగ్‌లో జాప్యం చేయాలని నితీష్ కుమార్ చెబుతున్నారు. దీనివల్ల ఆయన ఓటమి కాస్త ఆలస్యం అవుతుంది తప్ప నితీష్ ప్రభుత్వం రాదు: ఆర్జేడీ ఎంపీ మనోజ్
6:22 PM, 10 Nov

బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ ఇమామ్ గంజ్ నుంచి విజయం
6:20 PM, 10 Nov

హసన్ పూర్ స్థానం నుంచి విజయం సాధించిన ఆర్జేడీ అభ్యర్థి తేజ్‌ప్రతాప్ యాదవ్
5:42 PM, 10 Nov

బీహార్‌లో ఐదు చోట్ల ఎంఐఎం విజయం సాధించింది
5:12 PM, 10 Nov

బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీకి అత్యధికంగా 23శాతం ఓట్లు
4:56 PM, 10 Nov

ఢిల్లీ

సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి రానున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా
4:54 PM, 10 Nov

మోకామాలో ఆర్జేడీ అభ్యర్థి అనంతకుమార్ విజయం
4:53 PM, 10 Nov

కుశేశ్వర అస్తాన్ అసెంబ్లీ స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి శశి భూషణ్ హజారీ సమీప కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ పై 7,222 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు
4:52 PM, 10 Nov

బీహార్

సాయంత్రం 4:45 గంటల సమయానికి 2.29 కోట్లు మేరా ఓట్ల లెక్కింపు: ఈసీ వర్గాలు
4:25 PM, 10 Nov

ఓట్ల లెక్కింపు సందర్భంగా 23 రౌండ్లకు గాను బీజేపీ 12 రౌండ్లలో ఆధిక్యత చాటింది
4:10 PM, 10 Nov

దుబ్బాక ఉపఎన్నిక

దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 62,772 ఓట్లు పోలవగా..టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 61,302 వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి 21,819 ఓట్లు వచ్చాయి
4:02 PM, 10 Nov

దుబ్బాక ఉపఎన్నిక

దుబ్బాక ఉపఎన్నికలో ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: కేటీఆర్
3:49 PM, 10 Nov

దుబ్బాక

1470 ఓట్ల మెజార్టీతో రఘునందన్ విజయం
3:47 PM, 10 Nov

దుబ్బాకలో బీజేపీ గెలుపు
3:35 PM, 10 Nov

హైదరాబాదు

హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ సంబరాలు
3:19 PM, 10 Nov

ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 20 స్థానాల్లో విజయాన్ని నమోదు చేసింది.
3:18 PM, 10 Nov

మహాకూటమి 7 స్థానాల్లో గెలుపొందింది.
2:48 PM, 10 Nov

బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటి వరకు 9 స్థానాల్లో విజయం సాధించింది.
2:34 PM, 10 Nov

ఇమామ్‌గంజ్‌లో తిరిగి పుంజుకున్న మాజీ ముఖ్యమంత్రి జితన్ రాంఝీ
1:43 PM, 10 Nov

ఈవీఎంపై సందేహాలు అక్కర్లేదు.. అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయి: ఈసీ
READ MORE

English summary
As the polling for Bihar Assembly elections finished, now all eyes are on the results that will be announced on November 10th,2020. Apart from Bihar the bypoll results for various states including Madhya Pradesh will also be declared.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X