వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాలూ ప్రసాద్ రికార్డు బ్రేక్: ప్రచారంలో కొత్త ఒరవడి: ఒకేరోజు అన్ని ఎలా సాధ్యం?

|
Google Oneindia TeluguNews

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్ కోసం సన్నాహాలు పూర్తయ్యాయి. 17 జిల్లాల్లో 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం 7 గంటలకు రెండోదశ పోలింగ్ ఆరంభం కాబోతోంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఎన్నికల ప్రచార పర్వం పోలింగ్ నాటికి రెండురోజుల ముందే ప్రచార పర్వానికి తెరపడింది.

Recommended Video

Bihar Assembly Election 2020 : Bihar లో 'Double Engine' ప్రభుత్వమే ఏర్పాటవుతుంది! - ప్రధాని మోదీ

రాజకీయ పార్టీలన్నీ ఇక మూడోదశపై దృష్టి సారించాయి. ఈ నెల 7వ తేదీన తుదిదశ పోలింగ్ ఉంటుంది. 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. రెండోదశ ఎన్నికల ప్రచార పర్వంపై రాష్ట్రీయ జనతా దళ్ ఆధిపత్యాన్ని చలాయించినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత, మాజీ మంత్రి తేజస్వి యాదవ్.. సుడిగాలి పర్యటన సాగించారు. 19 బహిరంగ సభలను నిర్వహించారు.. ఒక్కరోజు వ్యవధిలోనే. బిహార్ రాజకీయ చరిత్రలో ఇదో రికార్డు.

Bihar Assembly elections 2020: RJD leader Tejashwi Yadav breaks Lalus record

ఈ విషయంలో తేజస్వి యాదవ్.. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రికార్డును తిరగరాశారు. ఇదివరకు లాలూ ప్రసాద్ యాదవ్.. ఒక్కరోజు వ్యవధిలో 16 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. తేజస్వి యాదవ్ దాన్ని బ్రేక్ చేశారు. 19 సభల్లో పాల్గొన్నారు. ఇందులో 17 బహిరంగ సభలు.. రెండు రోడ్‌షోలు ఉన్నాయి. ఉదయం 10:05 నిమిషాలకు సీతామర్హి నుంచి తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ఆయన ఆరంభించారు. వైశాలి జిల్లాలోని బిదూపూర్‌లో సాయంత్రం 4:45 నిమిషాలకు చివరి సభలో పాల్గొన్నారు.

నిరంతరాయంగా ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కొనసాగాయి. ఈస్ట్ చంపారన్, వెస్ట్ చంపారన్, గోపాల్‌గంజ్, సివాన్, వైశాలి జిల్లాల్లో ఆయన పర్యటించారు. ఈ సారి రాష్ట్రీయ జనతా దళ్ సంకీర్ణ కూటమిని అధికారంలోకి తీసుకుని రావడానికి తేజస్వి యాదవ్ ఎంత పట్టుదలతో ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు నాయకులు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మోస్ట్ పాపులర్ లీడర్‌గా తేజస్వి నిలిచినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

English summary
Rashtriya Janata Dal leader (RJD) leader Tejashwi Yadav set a new records. He held 17 public meetings and two roadshows during the campaign for the current Bihar assembly elections on Saturday. Till now, Lalu had a record of holding 16 public meetings in single day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X