వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ ఎన్నికల బరిలో శివసేన - 50 సీట్లలో పోటీ - మహా సీఎం ఉద్ధవ్‌తో ప్రచారం

|
Google Oneindia TeluguNews

మరాఠా పార్టీ శివసేన తొలిసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సమాయత్తం అయింది. బీహార్ కు చెందిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో శివసేన నేతల ప్రమేయంపై బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేయడం, బీజేపీతో సేన విబేధాలు తారా స్థాయికి చేరడం, బీహార్ ఎన్నికల్లో మహారాష్ట్ర అంశాలే ప్రధానంగా మారిన నేపథ్యంలో శివసేన నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబు ఆయువుపట్టుపై దాడి - జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ సంచలనం -ప్రధాని మోదీని కలిసిన రోజేచంద్రబాబు ఆయువుపట్టుపై దాడి - జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ సంచలనం -ప్రధాని మోదీని కలిసిన రోజే

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని, కనీసం 50 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించుతామని ఆ పార్టీ ఎంపీ అనిల్‌ దేశాయ్ ఆదివారం మీడియాకు తెలిపారు. అయితే, మహారాష్ట్రలో కాంగ్రెస్ తో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. బీహార్ లో మాత్రం ఏ పార్టీతోనూ శివసేన పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే ఈ స్థానాల్లో పోటీ చేస్తుందని దేశాయ్ చెప్పారు.

Bihar Assembly elections 2020: Shiv Sena To Contest 50 Seats, Uddhav To Campaign

శివసేన పార్టీ శ్రేణులు ఎక్కడైతే ప్రజా సేవలో పాల్గన్నాయో.. ఆయా నియోజక వర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడుతున్నట్లు అనిల్‌ దేశాయ్ చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ట్రంపెట్‌ ( ఓ రకమైన సంగీత వాయిద్య పరికరం) గుర్తుతో పోటీ చేయనుందన్నారు. అంతకు ముందు జెడియు ఎన్నికల గుర్తులో కూడా బాణం ఉండటంతో ..శివసేన ఎన్నికల గుర్తుతో పోటీ చేసేందుకు ఎన్నికల కమిషన్‌ నిరాకరించింది. ఇకపోతే,

కన్నీటి పర్యంతమైన కిమ్ జోంగ్ - ఉత్తరకొరియా ప్రజలకు క్షమాపణలు - తొలిసారి బాహుబలి ప్రదర్శనకన్నీటి పర్యంతమైన కిమ్ జోంగ్ - ఉత్తరకొరియా ప్రజలకు క్షమాపణలు - తొలిసారి బాహుబలి ప్రదర్శన

Recommended Video

Bihar Elections 2020 : Key Issues in Nitish Vs Tejashwi Row | NDA alliance VS Mahagathbandhan

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే శివసేన పార్టీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రచారం నిర్వహిస్తారని అనిల్ దేశాయ్ తెలిపారు. బీహార్ లో ఉద్ధవ్ ప్రచార షెడ్యూల్ పై త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు. 243 స్థానాలు గల బీహార్‌ అసెంబ్లీకి ఈ నెల 28, నవంబర్‌ 3, నవంబర్‌ 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్న విషయం విదితమే.

English summary
The Shiv Sena is going to contest around 50 seats in the upcoming Bihar Assembly polls, party MP Anil Desai said on Sunday.Talking to PTI, Mr Desai said the Shiv Sena does not have an alliance with any party for polls in the eastern state. "The Shiv Sena is contesting around 50 seats. We have fielded our candidates in constituencies where we have our cadre involved in public work," the Rajya Sabha member said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X