వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోటి ఉద్యోగాలిస్తానని చెప్పలేదు: ఆర్జేడీ మేనిఫెస్టోపై తేజశ్వి యాదవ్ క్లారిటీ

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ పార్టీల పరస్పర విమర్శలు దాడి పెరిగిపోతోంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి బీహారీలకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామంటూ తన మేనిఫెస్టోలో పెట్టి విమర్శలపాలవుతున్న విషయం తెలిసిందే. ఇది ఇలావుంటే, ఆర్జేడీ నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి తేజశ్వి యాదవ్ కోటి మందికి ఉద్యోగాలిస్తామంటూ ప్రకటన చేశారనే ప్రచారం జరుగుతోంది.

సచిన్-సెహ్వాగ్‌ జోడీలా నితీశ్-మోదీ - చైనా సరిహద్దులో బీహార్ సైనికుల ప్రాణత్యాగం: రాజ్‌నాథ్ సచిన్-సెహ్వాగ్‌ జోడీలా నితీశ్-మోదీ - చైనా సరిహద్దులో బీహార్ సైనికుల ప్రాణత్యాగం: రాజ్‌నాథ్

ఈ నేపథ్యంలో తేజశ్వి యాదవ్ తాజాగా స్పందించారు. తాను కోటి ఉద్యోగాలిస్తామని చెప్పలేదని, కేవలం 10 లక్షల ఉద్యోగాలను మాత్రమే కల్పిస్తామని చెప్పినట్లు తేజస్వి ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.

Bihar Assembly Elections: ‘Not promising 1 crore jobs,’ Tejashwi Yadav releases RJD’s manifesto

'నేను 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాను. కోటి ఉద్యోగాలు ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదు. తాను తొలి కేబినెట్‌ సమావేశంలోనే ఈ ఉద్యోగాలన్నీ కల్పిస్తామని అనలేదు. అయితే దేశంలో ఒక్కసారిగా 10 లక్షల ఉద్యోగాలు కల్పించడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో ఈ మొత్తం ఉద్యోగాలు ఇప్పుడు అవసరం ' అని తేజశ్వి యాదవ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

'మేము ఎక్కడ నుంచి ఉపాధి కల్పిస్తామోనని ప్రజలు ఎగతాళి చేసేవారు. ఇప్పుడు, ఆదాయాలు, ఉపాధి మధ్య వ్యత్యాసం ఉందని మీరు అర్థం చేసుకోవాలి' అని అన్నారు. తాము ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో టీచర్లు, ప్రొఫెసర్స్, జూనియర్ ఇంజినీర్లు, డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఇలా అనేక ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు.

అంతేగాక, భారీ సంఖ్యలో పోలీసుల భర్తీ కూడా చేయాల్సి ఉందని చెప్పారు తేజశ్వి యాదవ్. మణిపూర్ చిన్న రాష్ట్రమే అయినప్పటికీ బీహార్ కంటే ప్రతి లక్ష మందికి అక్కడే ఎక్కువ పోలీసులు ఉన్నారని తెలిపారు.

తేజశ్వి యాదవ్ 10 లక్షల ఉద్యోగాలిస్తామని ఆర్జేడీ మేనిఫెస్టోలో పేర్కొనగా.. బీజేపీ ఉచిత కరోనా వ్యాక్సిన్ తోపాటు 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. బీజేపీ సీఎం అభ్యర్థి నితీష్ కుమారేనా? ఆయన ఉద్యోగాలివ్వలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారని అన్నారు తేజస్వి. ఇప్పుడేమో బీజేపీ 19 లక్షల ఉద్యోగాలిస్తామని చెబుతోందని ఎద్దేవా చేశారు.

కాగా, 243 స్థానాలున్న బీహార్‌ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న ఎన్నికలు జరగుతాయి. ఇక ఫలితాలు నవంబర్ 10న వెలువడతాయి.

English summary
Amid the ongoing slugfest over NDA’s vaccine promise ahead of Bihar Assembly elections 2020, Rashtriya Janata Dal leader Tejashwi Yadav, who is the chief ministerial candidate of Mahagathbandhan, released the party’s election manifesto on Saturday and said he will not promise one crore jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X