వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రానికి షాక్: ఎన్ఆర్‌సీ వ్యతిరేక తీర్మానానికి బీహార్ అసెంబ్లీ ఆమోదం, ఎన్పీఆర్‌కు సవరణలు

|
Google Oneindia TeluguNews

పాట్నా: మిత్రపక్షంగా ఉంటూనే ఎన్డీఏకు షాకిచ్చారు బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్. మంగళవారం బీహార్ అసెంబ్లీలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్‌సీ)ని రాష్ట్రంలో అమలు చేయబోమంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.

మా తల్లి ఎప్పుడు పుట్టిందో తెలియదు: ఎన్‌పీఆర్ క్లాజులపై సీఎం నితీష్, కేంద్రానికి లేఖమా తల్లి ఎప్పుడు పుట్టిందో తెలియదు: ఎన్‌పీఆర్ క్లాజులపై సీఎం నితీష్, కేంద్రానికి లేఖ

2010 ఫార్మాట్‌లోనే ఎన్పీఆర్..

2010 ఫార్మాట్‌లోనే ఎన్పీఆర్..

నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్‌పీఆర్)ను మాత్రం తాము తమ రాష్ట్రంలో 2010 ఫార్మాట్‌లోనే అమలు చేస్తామంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన ఎన్పీఆర్‌లో కొన్ని వివాదాస్పద నిబంధనలున్నాయని, వాటిని కేంద్రం తొలగించాలని కేంద్రానికి ఆయన సూచించారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాసినట్లు తెలిపారు.

ఎన్పీఆర్‌లో కొత్తగా ట్రాన్స్‌జెండర్ కాలమ్..

ఎన్పీఆర్‌లో కొత్తగా ట్రాన్స్‌జెండర్ కాలమ్..


పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు మద్దతు తెలిపిన బీహార్ సీఎం నితీష్.. మొదట్నుంచి ఎన్ఆర్‌సీని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం అసెంబ్లీలో ఎన్ఆర్‌సీకి వ్యతిరేక తీర్మానం చేశారు. ఎన్పీఆర్ మాత్రం రాష్ట్రంలో పాత నమూనాలో అమలు చేస్తామని చెప్పారు. ట్రాన్స్‌జెండర్ కాలమ్ కూడా ఎన్పీఆర్ ఫాంలో పొందుపరుస్తామని తెలిపారు.

సీఏఏ నల్ల చట్టమంటూ..

సీఏఏ నల్ల చట్టమంటూ..


కాగా, సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్‌సీలపై మంగళవారం బీహార్ అసెంబ్లీలో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో స్పీకర్ అంగీకరించారు. అయితే, సీఏఏను నల్ల చట్టం అంటూ ప్రతిపక్ష నేతలు ఆందోళనకు దిగాయి. దీంతో అధికార పక్షం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల చట్టాలను పార్లమెంటు ఆమోదించగలదా? అని ప్రశ్నించారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని వ్యతిరేకించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ.. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్‌పీఆర్) ఫాంలలో పొందుపర్చబడిన వివాదాస్పద నిబంధనలను, ప్రశ్నలను తొలగించాల్సిందిగా తాము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు.

ఎన్ఆర్‌సీ అవసరం లేదన్న నితీష్

ఎన్ఆర్‌సీ అవసరం లేదన్న నితీష్

ఎన్ఆర్‌సీని దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం లేదని సీఎం నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. కాలా కానూన్ అంటూ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రతిపక్ష పార్టీల నేతలు అసెంబ్లీలో నిరసనలు చేసిన క్రమంలో బీజేపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ స్పందించారు.

English summary
The Bihar assembly on Tuesday passed the resolution to not implement the National Register of Citizens (NRC) in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X