వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరోనా సోకి బీజేపీ ఎమ్మెల్సీ మృతి, సంతాపం తెలిపిన నితీశ్ కుమార్..
కరోనా మహమ్మరి కరాళ నృత్యం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతుంది. వైరస్ ఎవరినీ వదలడం లేదు. మంగళవారం బీజేపీ ఎమ్మెల్సీ ఒకరు చనిపోయారు. కరోనా వైరస్‌తో ఆస్పత్రిలో చేరిన ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు.

బీజేపీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ మరణంపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఫోన్ చేసి వారిని పరామర్శించారు. బీహర్ బీజేపీ నేత సుశీల్ మోడీ కూడా సునీల్ సింగ్ మృతిపై సంతాపం తెలిపారు. అతని ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్ చేశారు. మరో ప్రజా ప్రతినిధి కరోనా వైరస్ బారినపడి చనిపోవడం కలకలం రేపింది. వైరస్ రక్కసి బారినపడి నేతలు కూడా చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.