వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చింది 61 మార్కులు.. వేసింది 4, బీహార్‌ స్కూల్‌ బోర్డు నిర్వాకం, పోరాడి గెలిచిన విద్యార్థిని!

ఈ ఏడాది ఆరంభంలో బీహార్‌ ఎడ్యుకేషన్ బోర్డు పదో తరగతి ఫలితాలను వెల్లడించింది. అందులో ప్రియాంక సింగ్‌ అనే విద్యార్థిని రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయినట్లు ప్రకటించింది. ఆ ఫలితాల్లో ఆమెకు సైన్స్‌లో 29, స

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్‌ ఎడ్యుకేషన్‌ బోర్డును వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆమధ్య బోర్డు పరీక్షల్లో మాస్‌ కాపియింగ్‌ జరగడం, అక్షరం ముక్క రాని వాళ్లను టాపర్లుగా ప్రకటించడం వంటి ఘటనలతో వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే.

ఆ కేసులు ఇంకా వీడకముందే తాజాగా ఈ ఎడ్యుకేషన్ బోర్డు మరో వివాదంలో చిక్కుకుంది. అయితే ఈసారి బాగా చదివే విద్యార్థిని ఫెయిల్‌ అయిందంటూ ప్రకటించింది. అదేంటని అడిగితే మరో విద్యార్థి జవాబు పత్రాలను చూపించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయింది.

Bihar Board Failed This Girl Twice. She Made Them ‘Pay’ By Winning In Court

ఈ ఏడాది ఆరంభంలో బీహార్‌ ఎడ్యుకేషన్ బోర్డు పదో తరగతి ఫలితాలను వెల్లడించింది. అందులో ప్రియాంక సింగ్‌ అనే విద్యార్థిని రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయినట్లు ప్రకటించింది. ఆ ఫలితాల్లో ఆమెకు సైన్స్‌లో 29, సంస్కృతంలో 4 మార్కులు వచ్చాయి.

అయితే తాను పరీక్షలు బాగా రాశానని, ఫెయిల్‌ అయ్యే అవకాశమే లేదని ఆమె రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. రీవాల్యుయేషన్‌ ఫలితాలు చూసి ప్రియంక కంగుతింది. సంస్కృతంలో ఆమె మార్కులు 4 నుంచి 9కి పెరగగా.. సైన్స్‌లో మాత్రం తొలుత 29 వస్తే ఈసారి 7 మార్కులే వచ్చాయి.

దీంతో ఆ విద్యార్థిని పాట్నా హైకోర్టును ఆశ్రయించింది. అయితే తొలుత ప్రియాంక పిటిషన్‌ను కోర్టు నమ్మలేదు. కోర్టు సమయం వృథా అవుతుందేమోనన్న అనుమానంతో ఆమెను రూ.40 వేలు డిపాజిట్‌ కూడా చేయమని ఆదేశించింది.

ఆ తర్వాత విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రియాంక జవాబు పత్రాలను చూపించాలని స్కూల్‌ బోర్డును ఆదేశించింది. తమ పొరబాటును గ్రహించిన బోర్డు అది కప్పిపుచ్చుకునేందుకు మరో విద్యార్థి జవాబు పత్రాలను కోర్టుకు అందజేసింది.

అయితే జవాబు పత్రాల్లోని చేతిరాత ప్రియాంక చేతిరాతతో సరిపోలకపోవడంతో అసలైన ఆన్సర్‌ షీట్లు తీసుకురావాలని బోర్డును ఆదేశించింది న్యాయస్థానం.
అందులో ప్రియాంకకు సైన్స్‌లో 80 మార్కులు, సంస్కృతంలో 61 మార్కులు వచ్చాయి.

దీంతో ఎడ్యుకేషన్ బోర్డు చర్యపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు విద్యార్థినికి రూ.5 లక్షల నష్టపరిహారం కూడా చెల్లించాలని ఆదేశించింది. అంతేగాక ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని సూచించింది. అయితే బోర్డు మాత్రం బార్‌కోడ్‌ వల్లే ఈ తప్పిదం జరిగిందని చెప్పుకొస్తోంది.

English summary
When it comes to the education board in Bihar, mostly, it is the other way around. People cheating in exams, parents scaling the walls of exam centers to help their kids, fake toppers etc, etc. But this time, it was a student who was the victim. Priyanka Singh's class 10th result showed she had flunked Science and Sanskrit by scoring only 29 and 4 respectively. But she knew that her exams had gone well!So naturally, like anyone would, she applied for revaluation. However, the second time, her marks in Sanskrit rose from 4 to only 9 whereas her marks in Science were actually deducted. The examiner saw fit to reduce her score from 29 to 7.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X