వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుష్పమ్ ప్రియకు షాక్: బీహార్ సీఎం అవుదామనుకుంటే డిపాజిట్ గల్లంతు, నోటాకే ఎక్కువ ఓట్లు

|
Google Oneindia TeluguNews

పాట్నా: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎంతో ఉత్కంఠగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టేందుకు కావాల్సిన మెజార్టీని సాధించింది. అయితే, ఎన్డీఏ కూటమిలో జేడీయూ కన్నా బీజేపీకే ఎక్కువ స్థానాలు రావడం గమనార్హం.

 Bihar Results: ఊహించనివిధంగా బీజేపీ వైపు బీహార్ ప్రజలు, ఆర్జేడీని నమ్మలేదా? Bihar Results: ఊహించనివిధంగా బీజేపీ వైపు బీహార్ ప్రజలు, ఆర్జేడీని నమ్మలేదా?

నోటాకే 7 లక్షలకుపైగా ఓట్లు..

నోటాకే 7 లక్షలకుపైగా ఓట్లు..

ఇది ఇలావుంటే, బీహార్ రాష్ట్ర ప్రజలు ఏ అభ్యర్థిపై ఆసక్తి చూపకుండా ‘నోటా'కు కూడా ఓట్లు వేశారు. రాష్ట్రంలో 7,06,252(అంటే పోలైన ఓట్లలో 1.7శాతం) మంది ఓటర్లు నోటాకే ఓటు వేయడం గమనార్హం. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుంచి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగగా, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి నుంచి తేజశ్వి యాదవ్ సీఎం అభ్యర్థిగా పోటీలో నిలిచారు.

పుష్పమ్ ప్రియకు షాక్..

పుష్పమ్ ప్రియకు షాక్..


ఇక కొత్తగా ఫ్లూరల్స్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత్రి 28ఏళ్ల పుష్పమ్ ప్రియ చౌధురి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, ఆమె పార్టీ నుంచి ఏ ఒక్కరూ గెలవకపోగా.. ఆమెకు కూడా డిపాజిట్లు రాకపోవడం గమనార్హం. రెండు స్థానాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ప్రియ.. పరాజయం పాలయ్యారు.

పోటీ చేసిన రెండుస్థానాల్లోనూ డిపాజిట్లు గల్లంతు.. నోటాకే

పోటీ చేసిన రెండుస్థానాల్లోనూ డిపాజిట్లు గల్లంతు.. నోటాకే

అంతేగాక, పుష్పమ్ ప్రియ పోటీ చేసిన ఒక స్తానంలో నోటా కంటే కూడా తక్కువ ఓట్లు రాగా, మరో స్థానంలో డిపాజిట్ గల్లంతయ్యింది. బిస్ఫీ నియోజకవర్గంలో పుష్పమ్ ప్రియకు 1521 ఓట్లు రాగా, ఆరో స్థానంలో నిలిచారు. మరో స్థానం బంకీపూర్‌లో 5189 ఓట్లతో ఐదో స్థానానికే పరిమితమయ్యారు. ఇక్కడ నోటాకు 1213 ఓట్లు వచ్చాయి. ప్రియా పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.

లండన్ నుంచి వచ్చిన ప్రియ.. బీహార్ సీఎం కావాలని..

లండన్ నుంచి వచ్చిన ప్రియ.. బీహార్ సీఎం కావాలని..


ఇక ప్రియ గురించి చెప్పాలంటే.. దర్బాంగాకు చెందిన పుష్పమ్ ప్రియ.. జేడీయూ సీనియర్ నేత, ఎమ్మెల్సీ వినోద్ చౌధురి కుమార్తె. లండన్‌లో స్థిరపడిన ఆమె.. తన తండ్రి ఉన్న జేడీయూలో చేరకుండా.. ‘ప్లూరల్స్' అనే పార్టీని ఏర్పాటు చేసి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అంతేగాక, బీహార్ ప్రజలకు భారీ హామీలు కూడా ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి అయితే 2025 నాటికి బీహార్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.

Recommended Video

#Biharelectionresults2020: 'This Is PM Narendra Modi's Win'| Chirag Paswan On Bihar Results
ఈవీఎంలు హ్యాక్ అంటూ బీజేపీపై ప్రియ ఆరోపణలు

ఈవీఎంలు హ్యాక్ అంటూ బీజేపీపై ప్రియ ఆరోపణలు

అయితే, అటు ఎన్డీఏ, ఇటు మహాకూటమి హోరాహోరీ పోటీలో బీహార్ ప్రజలు ఈమె వైపు చూడలేదు. దీంతో ఆమెకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈవీఎంలలో ఏదో కుట్ర జరిగిందంటూ ప్రియ ఆరోపణలు చేశారు. ఈవీఎంలను బీజేపీ హ్యాక్ చేసిందంటూ ఆరోపించారు. ఈమె ఆరోపణలను కార్తీ చిదంబరం మద్దతు పలికారు. ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ కూడా ఈవీఎంల ఓట్ల లెక్కింపులో ఏదో కుట్ర జరిగిందని ఆరోపించారు.

English summary
Pushpam Priya Chaudhary, 28, a London School of Economics (LSE) alumnus, who had floated her own political outfit 'Plurals Party' and declared herself a contender for the Bihar Chief ministerial post, suffered a blow on Tuesday after she lost badly in both assembly seats she contested for Bihar elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X