వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రంలో నితీష్‌కు చెక్... బీహార్‌లో బీజేపీకి చెక్... లెక్క సరిపోయింది... !

|
Google Oneindia TeluguNews

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ట్రంలో బీజేపీ నేతలకు షాక్ ఇచ్చారు. నితీష్ కుమార్ రాష్ట్ర్రంలో చేపట్టిన మంత్రి పదవుల్లో బీజేపీకి మొండి చేయి చూపించాడు. బీహర్ మంత్రివర్గ విస్తరణలో భాగంగా జేడీయుకు చెందిన ఎనిమిది మందికి మంత్రిపదవులు ఇవ్వగా బీజేపీకి ఒక మంత్రి పదవిని ఇచ్చారు. అయితే నితీష్ ఇచ్చిన ఒక్క స్థానంలో కూడ పదవిని స్వీకరించడంపై తమ నిర్ణయాన్ని త్వరలో వెల్లడిస్తామని రాష్ట్ర్ర బీజేపీ నేతలు తెలిపారు.

బీహార్‌లో బీజేపీకి చెక్...

బీహార్‌లో బీజేపీకి చెక్...

బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ,బీజేపీ నేతల మధ్య రాజకీయ సంబంధాలకు ఫుల్‌స్టాప్ పడినట్టుగానే కనిపిస్తుంది. కేంద్రంలో తమ పార్టీ కి సరైన ప్రాతినిథ్యం లేకపోవడంతో జేడీయూ ఎంపీలు మంత్రిపదవులను చేపట్టేందుకు నిరాకరించాడు. దీంతో రెండు పార్టీల మధ్య అలయెన్స్ కొనసాగినా ప్రతిగా తాను రాష్ట్ర్రంలో చేపట్టిన మంత్రి పదవుల్లో కూడ బీజేపీకి మొండి చేయి చూపించారు. దీంతో రెండు పార్టీల మధ్య చెక్ పడేందుకు అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

అలయెన్స్‌తో నితీష్ ప్రభుత్వం

అలయెన్స్‌తో నితీష్ ప్రభుత్వం

ఇక బిహార్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీని కాదని జేడీయుకు 54 స్థానాలతో ఉన్న బీజేపీ నితీష్ కుమార్‌కు మద్దతిచ్చి ముఖ్యమంత్రిని చేసింది. కాగా బీహర్‌లో జేడీయు, బీజేపీ అలయెన్స్‌లో ప్రభుత్వం కొనసాగిస్తున్నారు.ఇప్పుడు అదే ప్రభుత్వంలోని మంత్రివర్గంలో మాత్రం నితీష్ ప్రభుత్వం బీజేపీకి హ్యాండ్ ఇచ్చింది. మరి బీజేపీ రాష్ట్ర్ర పార్టీ ఎలాంటీ నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.

బీహార్ స్వీప్ చేసిన ఏన్డీఏ పక్షాలు

బీహార్ స్వీప్ చేసిన ఏన్డీఏ పక్షాలు

గత ఎన్నికల్లో బీహార్‌లోని మొత్తం నలబై స్థానాలకు గాను బీజేపీ, జేడీయు,తోపాటు ఏల్‌జేపీలు కలిసి మొత్తం నలబై స్థానాలకు గాను 39 స్థానాలను గెలుచుకున్నాయి.కాగా బిహార్‌లో బీజేపీ 17 లోక్‌సభ స్థానాలను, ముఖ్యమంత్రి నితిష్ కుమార్ అధ్యర్యంలోని జనతాదళ్ యూ 16 స్థానాల్లో పోటి చేసి గెలిచాయి. ఇక వీరితోపాటు రాంవిలాస్ పాశ్వన్ నాయకత్వం వహిస్తున్న లోక్ జనశక్తి పార్టీ ఆరు స్థానాలను గెలుచుకున్నాయి. అయితే మోడీ క్యాబినెట్‌లో రాంవిలాస్ పాశ్వాన్ పార్టీ అయిన ఎల్‌జేపీకి ప్రాతినిథ్యం లభించగా ..జనతాదళ్ యూ కు మాత్రం క్యాబినెట్‌లో సరైన ప్రాతినిధ్యం లభించకపోవడంతో ఆయన మంత్రివర్గంలో చేరేందుకు నిరాకరించారు.

 బీజేపీపై రివర్స్ గేర్ వేసిన నితీష్

బీజేపీపై రివర్స్ గేర్ వేసిన నితీష్

మోడీ ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అక్కడి మీడీయాతో మాట్లాడుతూ... భవిష్యత్‌లో కూడ మోడీ ప్రభుత్వంలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇక బీహార్‌లో వ్యక్తులపై ఆధారపడి ప్రజలు తీర్పు ఇవ్వలేదని మోడీని ఉద్దేశించి పేర్కోన్నాడు. ఇది బిహార్ ప్రజల విజయమని స్పష్టం చేశాడు. బిహార్‌లో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారని అయితే అది బీజేపీ విజయంగా చెప్పుకుంటు అవాస్తవాన్ని ప్రచారం చేస్తున్నారని నితీష్ విమర్శలు చేశారు. ఇప్పుడు కాకుండా తర్వాతనైన ప్రభుత్వంలో చేరుతారా అనే ప్రశ్నకు బదులిస్తూ బీజేపీ అత్యధిక మెజారీటీ సాధించిందని అలాంటీ ప్రభుత్వంలో చేరాల్సిన అవసరం లేదని స్సష్టం చేశారు.

English summary
Bihar Chief Minister Nitish Kumar, who was upset after his party was offered only a single berth in the Narendra Modi government, has hit back at the BJP's state unit. In the much-awaited Cabinet expansion today, he included eight of his party colleagues. The BJP was given just one seat, for which the party is yet to find a candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X