వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలకు ముందే బీజేపీ సంచలన స్టేట్‌మెంట్లు.. సీఎం పోస్టు కోసం గట్టి పట్టు.. మహారాష్ట్ర ఫలితం తిరగబడ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ హీట్ ఇంకా పెరగకముందే.. 2020 నవంబర్ లో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల చర్చ తెరపైకి వచ్చింది. 2017 నుంచి వరుసగా ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్నప్పటికీ బిహార్ లో రిస్క్ చేయడమే మంచిదని రాష్ట్ర బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, బీహార్ బీజేపీ కీలక నేత సంజయ్ పాశ్వాన్ బుధవారం చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి.

బీహార్ లో చాలా ఏళ్లుగా నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీఎస్ కు బీజేపీ జూనియర్ భాగస్వామిగా కొనసాగుతోంది. మధ్యలో కొన్ని సార్లు దోస్తీకి బ్రేక్ పడినా, బీజేపీ హైకమాండ్ పై నితీశ్ నిప్పులు చెరిగినా అంతలోనే సర్దుకుపోవడం పరిపాటిగా మారింది. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికలను మాత్రం తేలికగా తీసుకోడానికి వీల్లేదని, బీహార్‌లో బీజేపీకి సొంతంగానే గెలిచే సత్తా ఉందని సంజయ్ పాశ్వాన్ అన్నారు.

ఒకవేళ జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. బీహార్ సీఎం పోస్టు నితీశ్ కుమార్ కు కాకుండా.. బీజేపీ నేతకే దక్కాలని కోరుకుంటున్నట్లు పాశ్వన్ తెలిపారు. ఏదిఏమైనప్పటికీ అంతిమంగా మోదీ, షాల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. మిత్రులను కాదని ముందుకు పోతే మహారాష్ట్రలో లాగా దెబ్బతినే పరిస్థితి బీహార్ లో ఉండదని ఆయన అన్నారు. బీజేపీ నేతల సంచలన కామెంట్ల నేపథ్యంలో ఆ పార్టీతో జేడీఎస్ సంబంధాలు ఎలా ఉన్నాయన్న ప్రశ్నకు సీఎం నితీశ్ నితీశ్.. ''ఆల్ ఈజ్ వెల్''అని బదులిచ్చిన సంగతి తెలిసిందే.

English summary
While speaking to ANI, BJP leader and former Union Minister Sanjay Paswan said, "People of Bihar want to see a BJP leader as Bihar Chief Minister, BJP is the strongest and most active party in the state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X