వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీత కష్టం: ‘రామ, లక్ష్మణులపై సాక్షులు, ఆధారాలేవి?’

|
Google Oneindia TeluguNews

పాట్నా: సీతాదేవిని అడవులకు పంపించి కష్టపెట్టారని రామలక్ష్మణులపై వేసిన పిటిషన్‌పై సోమవారం బీహార్‌లోని సీతామర్హి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాముడు సీతను కష్టపెట్టాడనడానికి సాక్ష్యమేది? ఆ ఘటనకు ఇప్పుడు ఎవరిని శిక్షించాలి? అని జడ్జి పిటిషన్‌దారుడిని ప్రశ్నించారు.

సీతాదేవిని కష్టపెట్టారని, నిజానిజాలు తెలుసుకోకుండా అడవులకు పంపించారని ప్రాక్టీస్‌ లాయర్‌ ఠాకూర్‌ చందన్‌ కుమార్‌ సింగ్.. కోట్లాదిమంది ప్రజలు దైవంగా పూజించే రాముడు, లక్ష్మణులపై పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా? లేదా? అనే అంశంపై సోమవారం సీతామర్హి కోర్టు విచారణ చేపట్టింది. ఇలాంటి పురాతన అంశాలపై కేసు ఎందుకు పెట్టావు? అని పిటిషన్‌ వేసిన వ్యక్తిని అడిగింది.

Bihar court hears case against Lord Rama for exiling Sita, judge asks, 'Where are the witnesses?'

‘ఘటనకు సాక్షులు ఉన్నారా..? సీతను రాముడు ఏ తేదీన అడవులకు పంపించాడో పిటిషన్‌లో పేర్కొనలేదేంటి? నీ ఫిర్యాదుకు ఆధారం ఏంటి?' అని పిటిషన్‌ దాఖలు చేసిన చందన్‌ కుమార్‌ను జడ్జి ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు.

ఈ కేసు విచారణకు అనర్హం అని, ఇందులో ఎలాంటి తర్కం లేదని జడ్జి కేసును కొట్టేశారు.
అయితే పిటిషన్‌దారు మాత్రం తాను సీతాదేవికి న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని తెలిపారు.

బీహార్‌లోని మిథిలా కూతురైన సీతాదేవికి న్యాయం జరగాలని అర్థిస్తున్నానని చందన్‌ కుమార్‌ కోర్టులో జడ్జిని కోరారు. ఆమె ఎలాంటి తప్పు చేయకపోయినా గర్భిణిగా ఉన్న సమయంలో అన్యాయంగా రాముడు అడవులకు పంపించారని చెప్పారు. భర్త మాట జవదాటని భార్యను ఇలా అడవులపాలు జేసి ఆమెను కష్టపెట్టడం సరైనది కాదని తెలిపారు.

English summary
As a Bihar court on Monday began hearing of a case against Lord Rama for exiling his wife Sita to forest as Ramayana narrates, it asked the petitioner who should be punished for an incident of such ancient times, a government lawyer said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X