వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సేమ్ టు సేమ్.. హత్రాస్ మాదిరిగానే.. నలుగురు మృగాళ్ల రేప్, యువతి బలవన్మరణం..

|
Google Oneindia TeluguNews

హత్రాస్‌లో దళిత యువతిపై లైంగికదాడి చేయడంతో.. తీవ్రగాయాలతో చనిపోవడంతో దేశమంతా రగిలిపోతోంది. తర్వాత మధ్యప్రదేశ్, ఇతర చోట్ల కూడా దళిత యువతులపై లైంగికదాడి జరిగాయి. అయితే బీహర్‌లో కూడా హత్రాస్ లాంటి ఘటన జరిగింది. దళిత యువతిపై లైంగిక దాడి జరిగింది. ఆమె అవమానభారంతో ఆత్మహత్య చేసుకొంది.

గయా జిల్లాలో నలుగురు దళిత యువతిపై గ్యాంగ్ రేప్ చేశారు. యువతిపై రాహుల్ కుమార్, చింటు కుమార్, చందన్ కుమార్, మరొకరు లైంగికదాడి చేశారని బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఆ యువతి అవమానానికి గురయ్యారు. ఆత్మహత్య చేసుకొని.. తనువు చాలించింది. మృతదేహానికి గయాలోని మెడికల్ కాలేజీలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

Bihar Dalit Teen Dies By Suicide After Alleged Gang Rape..

ఈ ఘటన కూడా హత్రాస్ మాదిరిగానే ఉంది. కానీ అక్కడ తీవ్ర గాయాలతో యువతి చనిపోగా.. ఇక్కడ యువతి అవమాన భారంతో మృతిచెందింది. మరో నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ దళిత సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. నలుగురు మృగాళ్లను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నాయి.

Recommended Video

Motkupalli Narasimhulu Warns Ysrcp Goverment

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా కొందరు మారడం లేదన్నారు. మరింత కఠిన చట్టాలు తీసుకొచ్చి.. వేగంగా శిక్ష అమలు చేయాలని కోరారు. లేదంటే వసుదైక కుటుంబం గల భారత్.. అత్యాచార భారత్‌గా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల నుంచి బీహర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లైంగికదాడి జరగడం, యువతి ఆత్మహత్య చేసుకోవడంతో.. ప్రచారం చేసే పార్టీలను ప్రజలు నిలదీసే అవకాశం ఉంది.

English summary
Dalit teenage girl in poll-bound Bihar's Gaya district died by suicide on Friday after allegedly being gang raped by four men, the police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X