వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ విద్యాశాఖామంత్రి ఔట్ .. అవినీతి ఆరోపణలతో మంత్రి అయిన గంటన్నర లోపే రాజీనామా

|
Google Oneindia TeluguNews

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి వివాదమే ఎన్డీఏ సర్కార్ కు తలనొప్పిగా తయారైంది. ముఖ్యమంత్రి నితీష్ ను ఇబ్బంది పెట్టింది . కేబినెట్ మంత్రి మేవాలాల్ చౌదరి పై చెలరేగిన వివాదంలో మూడు రోజులపాటు పలు విమర్శలు ఎదుర్కొన్న తర్వాత విద్యాశాఖ మంత్రిగా నేడు బాధ్యతలు చేపట్టిన గంటన్నర లోపే మేవాలాల్ చౌదరి రాజీనామా చేశారు. ప్రతిపక్ష ఆర్జెడి నాయకుడు జేడీయూ నేత మేవాలాల్ చౌదరిపై మూడేళ్ల నాటి అవినీతి కేసును గుర్తుచేసి, కళంక మంత్రి అయిన ఆయనను ప్రభుత్వంలో ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించడంతో పాటుగా జాతీయగీతం రాని విద్యాశాఖామంత్రి అని ట్రోల్ చెయ్యటంతో అవినీతి ఆరోపణల నేపధ్యంలో మేవాలాల్ రాజీనామా చేశారు.

కళంక విద్యాశాఖామంత్రి అంటూ .. బీహార్ లో నితీష్ క్యాబినెట్ టార్గెట్ గా ఆర్జేడీ ధ్వజంకళంక విద్యాశాఖామంత్రి అంటూ .. బీహార్ లో నితీష్ క్యాబినెట్ టార్గెట్ గా ఆర్జేడీ ధ్వజం

 అవినీతి మంత్రి అంటూ బీహార్ విద్యాశాఖామంత్రి మేవాలాల్ చౌదరిపై ఆరోపణలు

అవినీతి మంత్రి అంటూ బీహార్ విద్యాశాఖామంత్రి మేవాలాల్ చౌదరిపై ఆరోపణలు

విద్యా మంత్రి మేవలాల్ చౌదరి పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది.

భాగల్ పూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్‌గా అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ శాస్త్రవేత్తల పోస్టులకు నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో 2017 లో తారాపూర్‌కు చెందిన జెడి (యు) ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదైంది. ఆ సమయంలో బిజెపి నుండి విమర్శలు ఎదుర్కోవడం తో ఆయనను కొంతకాలం జేడీయూ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అప్పటి బీహార్ గవర్నర్‌గా ఉన్న అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ అనుమతి ఇచ్చిన తరువాత ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 జాతీయ గీతం రాదంటూ ట్రోల్స్ ... అవినీతి ఆరోపణలు .. ఆర్జేడీ నేత

జాతీయ గీతం రాదంటూ ట్రోల్స్ ... అవినీతి ఆరోపణలు .. ఆర్జేడీ నేత

రాష్ట్రంలో అధికారం కోసం ముఖ్యమంత్రి నేరస్తులకు కేబినెట్లో స్థానం కల్పిస్తున్నారని ఆర్జేడీ నేత నితీష్ టార్గెట్ గా మేవాలాల్ పై గన్ ఎక్కుపెట్టారు . తేజస్వి యాదవ్ మేవాలాల్ పై, నితీష్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మరో సోషల్ మీడియా పోస్టులో, మేవలాల్ చౌదరికి జాతీయ గీతం కూడా రాదు అంటూ ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ మండిపడ్డారు

. ఆర్జెడి పోస్ట్ చేసిన మేవాలాల్ చౌదరికి సంబంధించిన ఒక పాత వీడియోలో ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గీతమైన జనగణమన పాడుతూ ఆయన మధ్యలో పదాలను మర్చిపోయారు.

ప్రమాణ స్వీకారం చేసిన గంటన్నర లోపే రాజీనామా

ప్రమాణ స్వీకారం చేసిన గంటన్నర లోపే రాజీనామా

ఆ వీడియోను పోస్ట్ చేసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనేక అవినీతి కేసుల్లో నిందితుడైన బీహార్ విద్య శాఖ మంత్రి చౌదరికి జాతీయ గీతం కూడా రాదు అంటూ విమర్శించారు. అలాంటి వ్యక్తికి విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించిన ఆర్జెడి నేత తేజస్వి యాదవ్ , నితీష్ కుమార్ కి ఏమాత్రం సిగ్గు లేదంటూ, మీ మనసాక్షి ఎక్కడ మునిగిపోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో బీహార్ విద్యా శాఖ మంత్రి మంత్రిగా ప్రమాణం చేసిన గంటన్నరలోపే రాజీనామా చేయాల్సి వచ్చింది.

నితీష్ ను కలిసి రాజీనామా చేసిన మేవాలాల్ చౌదరి .. రాజీనామా గవర్నర్ ఆమోదం

నితీష్ ను కలిసి రాజీనామా చేసిన మేవాలాల్ చౌదరి .. రాజీనామా గవర్నర్ ఆమోదం

గురువారం మధ్యాహ్నం విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మేవాలాల్ చౌదరి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను తన అధికారిక నివాసంలో కలిసి రాజీనామా చేశారు. విద్యాశాఖ మంత్రి అయిన మేవాలాల్ చౌదరిపై కొనసాగుతున్న తాజా వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ నితీష్ మేవాలాల్ చౌదరిని రాజీనామా చేయాలని కోరారు. ఆయన రాజీనామాను గవర్నర్ అంగీకరించారు.మేవాలాల్ చౌదరి మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యా మంత్రి పదవిని చేపట్టారు మరియు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రాజీనామా చేశారు, ఆయన కేవలం ఒకటిన్నర గంటలు మాత్రమే మంత్రిగా చేశారు.

English summary
Newly-appointed Bihar Education Minister Mewalal Choudhary resigned from his cabinet post on Thursday. He tendered his resignation following the pressure from the opposition over corruption charges leveled against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X