వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగా? సహజమా?: పేద రాష్ట్రంలో 60శాతం క్యాండిడేట్లు కోటీశ్వరులే - అతిపేద అభ్యర్థి ఆస్తి రూ.3వేలు

|
Google Oneindia TeluguNews

పేరుకు పేద రాష్ట్రం.. అన్ని రంగాల్లో వెనుకబాటు.. జీడీపీ పర్ క్యాపిటా(తలసరి ఆదాయం)లో దేశంలోనే అట్టడుగు(34వ) స్థానం.. గణాంకాల సంగతి ఇలా ఉన్నప్పటికీ.. అక్కడ ఎన్నికల పోటీ దారుల్లో మాత్రం సగానికిపైగా కోటీశ్వరులే ఉండటం గమనార్హం. అవును, మనం చెప్పుకుంటున్నది బీహార్ గురించే. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అందులో కేవలం ఫస్ట్ ఫేజ్ లోనే 60 శాతానికి పైగా కోటీశ్వరులు బరిలో నిలబడ్డారంటే ధనవంతుల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది షాకింగా? సహజమా? పాఠకులే నిర్ణయించాలి. పూర్తి వివరాలివి..

సీఎం రేసులో చిత్తూరు వైసీపీ నేత - జగన్‌పై 2లక్షల మెజార్టీ ఇలా - వాలంటీర్ల దుస్థితి:ఎంపీ రఘురామసీఎం రేసులో చిత్తూరు వైసీపీ నేత - జగన్‌పై 2లక్షల మెజార్టీ ఇలా - వాలంటీర్ల దుస్థితి:ఎంపీ రఘురామ

ఫస్ట్‌ఫేజ్‌లో 153 మంది కోటీశ్వరులు

ఫస్ట్‌ఫేజ్‌లో 153 మంది కోటీశ్వరులు

ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీలు మహా కూటమిగా, జేడీయూ-బీజేపీ-హెచ్ఏఎం-వీఐపీ పార్టీలు ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగుతుండగా, వివిధ పార్టీలు, ఇండిపెండెంట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొదటి విడతలో భాగంగా బీహార్ లోని 71 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 28న పోలింగ్ జరుగనుంది. అన్ని పార్టీలు కలిపి ఫస్ట్ ఫేజ్ లో మొత్తం 1,065 అభ్యర్థులు ఉండగా, వాళ్లలో 153 మంది కోటీశ్వరులే కావడం విశేషం. ఎన్డీఏ కూటమి నుంచి టికెట్లు పొందినవారిలో 60 శాతం మంది, మహాకూటమి నుంచి 58 శాతం మంది కోటీశ్వరులు బరిలో ఉన్నారు. ఆయా అభ్యర్థులు తమ ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల మేరకే ఈ జాబితా రూపొందింది. అందులో..

 జేడీయూ మనోరమా దేవి రిచ్చెస్ట్.

జేడీయూ మనోరమా దేవి రిచ్చెస్ట్.

తొలి దశ ఎన్నికల్లో బరిలో నిలిచిన 153 మంది కోటీశ్వరుల్లో జేడీయూకి చెందిన మనోరమా దేవి బాగా సంపన్నురాలు. గయా జిల్లాలోని ఆత్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తోన్న ఆమె.. ఎన్నికల అఫిడవిట్ లో తనకు రూ.53 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. మద్యనిషేధం తరువాత ఆమె ఇంట్లో భారీగా మద్యం బాటిళ్లు పట్టుపడిన సందర్భంలో మనోరమా వార్తల్లో నిలిచారు. ఇక, రూ.33.6 కోట్ల ఆస్తులతో కుతుంబా(ఔరంగాబాద్ జిల్లా) కాంగ్రెస్ అభ్యర్థి రాజేశ్ కుమార్ రెండో రిచ్చెస్ట్ గా ఉన్నారు. ఇక కోటీశ్వరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న నవాడా జేడీయూ అభ్యర్థి కౌశల్ యాదవ్ కు రూ.26.13కోట్ల ఆస్తులున్నట్లు తెలిపారు. ఎన్నికల బరిలో నిలిచిన టాప్-10 కోటీశ్వరుల్లో ఆర్జేడీ నుంచి నలుగురు, జేడీయూకు చెందిన ముగ్గురు, కాంగ్రెస్, ఎల్జేపీ, ఆర్ఎస్ఎల్పీ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

అతి పేద అభ్యర్థి ఈయనే

అతి పేద అభ్యర్థి ఈయనే

ఎన్నికల్లో ధన ప్రభావం తగ్గాలని పోరాడుతోన్న స్వచ్ఛంద సంస్థ ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)' లెక్కల ప్రకారం బీహార్ లో గత అసెంబ్లీకి ఎన్నికైన 240 మంది ఎమ్మెల్యేల్లో 160 మంది కోటీశ్వరులే కావడం గమనార్హం. ఇక ప్రస్తుత 2020 ఎన్నికలకు వస్తే, ఫస్ట్ ఫేజ్ లో బరిలో ఉన్న అతి పేద అభ్యర్థిగా లోగ్ జన్ పార్టీ(సెక్యూలర్) గయా టౌన్ అభ్యర్థి రింకు కుమార్ నిలిచారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం అతని వద్ద కేవలం రూ.2,700 ఆస్తి మాత్రమే ఉంది. కుతుంబా ఎస్సీ స్థానం నుంచి అఖిల హిందూ ఫార్వర్డ్ బ్లాక్(క్రాంతికారి) పార్టీ తరఫున పోటీ చేస్తోన్న శైలేష్ రాహికి కేవలం రూ.9వేల ఆస్తి ఉంది. టాప్-10 పేద అభ్యర్థులందరి ఆస్తి రూ.10వేలకు అటు ఇటుగా ఉంది. 71 స్థానాల ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లోనే ఇంతటి విచిత్రాలు చోటుచేసుకుంటే, 94 సీట్ల రెండో ఫేజ్, 78
స్థానాల మూడో ఫేజ్ లో ఇంకా ఎన్ని సిత్రాలు చూడాలో..

జగన్ దెబ్బ.. రఘురామరాజు అబ్బా - జస్టిస్ రమణపై ఇవి చూశారా? 777 రెడ్లకు పదవులు: వైసీపీ ఎంపీజగన్ దెబ్బ.. రఘురామరాజు అబ్బా - జస్టిస్ రమణపై ఇవి చూశారా? 777 రెడ్లకు పదవులు: వైసీపీ ఎంపీ

English summary
Unbelievable it might sound in an in any other case poor state like Bihar, however data present that out 153 out of the 1,065 candidates in the fray in the first phase of state meeting election are crorepatis. 58% candidates of the Grand Alliance (RJD-Congress and Left) and 60% of the NDA (BJP-JDU-HAM-S and VIP) are crorepatis. here is the Richest and poorest candidates in fray in first phase of polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X