Bihar election 2020:34 శాతం కోటీశ్వరులు..ఆర్జేడీ, బీజేపీ నుంచి ఎక్కువ, అధిక ధనవంతుడు..
బీహర్ రెండో విడత పోలింగ్ నవంబర్ 3వ తేదీన జరగనుంది. 17 జిల్లాల్లోని 94 నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల కోసం 1463 మంది బరిలో ఉన్నారు. వీరిలో 1315 పురుషులు, 147 మహిళలు, 1 ట్రాన్స్ జెండర్ బరిలో ఉన్నారు. వీరిలో 34 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. అంటే 495 మంది కరోడ్ పతి అని వారు సమర్పించిన అఫిడవిట్లు చెబుతున్నాయి. ఇందులో చాలా మంది ఆర్జేడీ, బీజేపీ నుంచి ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆర్జేడీ నుంచి 46 మంది కోటీశ్వరులు..
ఆర్జేడీ నుంచి 46 మంది కోటీశ్వరులు, 39 మంది బీజేపీ నుంచి ఎల్జేపీ నుంచి 38 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఎల్జేపీ నుంచి 52 మంది బరిలో ఉండగా.. 73 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. ఇక జేడీయూ నుంచి 81 శాతం కరోడ్ పతులు ఉన్నారు. జేఏపీ-ఎల్ నుంచి 25 మంది, ఆర్ ఎల్ఎస్పీ నుంచి 24 మంది, కాంగ్రెస్ 20 మంది, వీఐపీ నుంచి నలుగురు, 144 ఇండిపెండెంట్లు కూడా కోటీశ్వరులు ఉన్నారు.

ధనవంతుడు కాంగ్రెస్ నేత..
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంజయ్ సింగ్ ధనవంతుడిగా నిలిచారు. అతను రూ.56 కోట్ల ఆస్తులను చూపించారు. వైశాలీ నుంచి బరిలో ఉండగా.. జేడీయూ నుంచి సిద్దార్థ పటేల్, ఎల్జేపీ నుంచి అజయ్ కుమార్ ఉన్నారు. ఆర్జేడీ నుంచి డియో కుమార్ చౌరసియా హజీపూర్ నుంచి బరిలో దిగారు. ఇతను తనకు రూ.49 కోట్ల ఆస్తులను చూపించారు. దీంతో రెండో ధనవంతుడిగా నిలిచారు. లాల్ గంజ్ నుంచి విజయ్ కుమార్ శుక్లా బరిలో ఉన్నారు. ఇతను ఇండిపెండెంట్ కానీ.. తనకు 49 కోట్ల ఆస్తులను ఉన్నట్టు ప్రకటించారు.

తర్వాత వీరే..
ముజఫర్ నగర్ పరూ నుంచి అరుణయ్ సిన్హా రూ.46 కోట్ల ఆస్తులను చూపించారు. తర్వాత భాగల్ పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అజిత్ శర్మ 43.2 కోట్ల ఆస్తులను చూపించారు. జనతా పార్టీ నుంచి కుందన్ సింగ్ కూడా 38.6 కోట్ల ఆస్తులను చూపించారు. 118 మంది తమకు రూ.5 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. 185 మంది రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని తెలిపారు.

రూ.3 కోట్లు పెరిగిన తేజస్వీ ఆస్తులు
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ రాగొపూర్ నుంచి బరిలో ఉన్నారు. అయితే తనకు రూ.5.88 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. అయితే 2015లో రూ.2 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలుపగా.. రూ.3 కోట్లకు పైగా ఆస్తులు పెరిగాయి. అతని సోదరుడు తేజ్ ప్రతాప్ పేరుతో రూ.2.8 కోట్ల ఆస్తులు ఉన్నాయి.