వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్:రెండో దశ కూడా ప్రశాంతం -53.51శాతం పోలింగ్ - టర్నౌట్‌పై పార్టీల్లో గుబులు

|
Google Oneindia TeluguNews

కరోనా విలయ కాలంలో జరుగుతోన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రహాసనంలో మలి అంకం కూడా ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం నాటి రెండో దశ పోలింగ్ లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలు లేకుండా సాఫీగా సాగింది. ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన మేరకు బీహార్ ఎన్నికల రెండో దశలో 53.51 శాతం పోలింగ్ నమోదైంది.

బీజేపీలోకి విజయశాంతి ఎంట్రీ ఖాయమా? చేరికపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలుబీజేపీలోకి విజయశాంతి ఎంట్రీ ఖాయమా? చేరికపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

రెండో దశ ఎన్నికల్లో భాగంగా 17 జిల్లాల్లోని 94 అసెంబ్లీ స్థానాల్లో మంగళవారం పోలింగ్ జరిగింది. మొత్తం 41,362 పోలింగ్‌ కేంద్రాలకుగానూ దాదాపు ఎక్కడా చెప్పుకోదగ్గ ఫిర్యాదులు రాలేదు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందుగానే పోలింగ్ ముగించారు. పాట్నా సిటీలోనూ ఇవాళే పోలింగ్ జరగడంతో చాలా చోట్ల వీఐపీల సందడి కనిపించింది. రెండో దశ ఎన్నికలో మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ (రాఘోపుర్‌), లాలూ పెద్ద కొడుకు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ (హసన్‌పుర్‌)‌, బీజేపీ మంత్రి నంద్‌ కిశోర్‌ యాదవ్‌(పట్నా సాహెబ్‌) తదిర ప్రముఖులున్నారు.

 Bihar election 2020: 53.51% voter turnout recorded in 2nd phase

మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు 53.51 శాతం పోలింగ్ నమోదైందని, ఆరు గంటల తర్వాత కూడా చాలా చోట్ల ఓటర్లు క్యూలైన్లలో నిల్చొని ఉన్నారని, పోలింగ్ శాతం పూర్తి వివరాలు బుధవారం ఉదయంలోగా అందుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. తొలి విడతలాగే రెండో విడతలోనూ పోలింగ్ శాతం తక్కువగా ఉండటంతో ఆ ప్రభావం ఎవరి కొంప ముంచుతుందోనని పార్టీల్లో గుబులు పెరిగింది.

సంచలనం: అమెరికా తొలి మహిళా ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ - నెలరోజుల్లోనే చూస్తారన్న ట్రంప్సంచలనం: అమెరికా తొలి మహిళా ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ - నెలరోజుల్లోనే చూస్తారన్న ట్రంప్

మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌ 28న తొలి విడతలో 71 స్థానాలకు 53.4శాతం పోలింగ్‌ నమోదైంది. మంగళవారం నాటి రెండో దశలో 94 స్థానాలకు 53.51 శాతం పోలింగ్ రికార్డయింది. నవంబర్ 7న మూడోదైన చివరి దశ పోలింగ్ తో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి. ఈనెల 10న ఫలితాలు వెలువడతాయి.

English summary
Over 53 per cent of the total 2.85 crore electors in 94 constituencies of Bihar exercised their franchise in the second phase of voting on Tuesday, according to Election Commission data. The estimated overall turnout at 6 PM is 53.51 percent (provisional), the poll panel data said. Prominent personalities including Chief Minister Nitish Kumar, his deputy Sushil Kumar Modi, Tejashwi Yadav, and LJP president Chirag Paswan cast their votes in their respective polling booths. final and third phase polling will be conducted on november 7th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X