వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిహార్ ఎన్నికల్లో రెండో దశ: రాహుల్ గాంధీ షెడ్యూల్ ఫిక్స్: రోడ్‌ షోలు..ర్యాలీలు: గెలుపుపై ఆశలు

|
Google Oneindia TeluguNews

పాట్నా: బిహార్‌లో తొలివిడత ఎన్నికల ప్రచార హోరుకు బ్రేక్ పడింది. బుధవారం అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం కాబోతోండగా.. నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రచారానికి తెరపడింది. తొలివిడతలో 16 జిల్లాల్లో 71 అసెంబ్లీ నియోజకవర్గాల కోసం పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 1,066 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండు కోట్ల 14 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 31 వేల పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది.

Recommended Video

Bihar Elections 2020 : Rahul Gandhi Rallies ఎన్నికల వేళ హామీలు వాస్తవం మాత్రం అందుకు విరుద్దంగా..

టాప్ అడ్వొకేట్ హరీష్ సాల్వే రెండో పెళ్లి: 65 ఏళ్ల వయస్సు: 18 ఏళ్ల కుమార్తె తల్లితో: లండన్‌లోటాప్ అడ్వొకేట్ హరీష్ సాల్వే రెండో పెళ్లి: 65 ఏళ్ల వయస్సు: 18 ఏళ్ల కుమార్తె తల్లితో: లండన్‌లో

రెండో విడత పోలింగ్ వచ్చేనెల 3వ తేదీన నిర్వహించనున్నారు. అదే నెల 7వ తేదీన చివరి విడత ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. 10వ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడవుతాయి. తొలి విడతలో పోలింగ్ నిర్వహించనున్న 71 అసెంబ్లీ స్థానాల్లో అధికార జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని మహాకూటమి ప్రభుత్వం మెజారిటీ స్థానాలను సాధించే అవకాశాలు ఉన్నాయంటూ సర్వేలు వెల్లడించాయి. దీనితో జేడీయూ-బీజేపీ సంకీర్ణ కూటమిలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోంది. మలి, తుది విడతల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోవడానికి ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్-కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది.

Bihar election 2020: Congress leader Rahul Gandhi to address two rallies in Bihar on 28th October

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ నెల 28వ తేదీన ఒకేసారి రెండు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనబోతున్నారు. వాల్మీకీనగర్, కుషేశ్వర్ అస్థాన్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ మేరకు బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల రూట్ మ్యాప్‌ను రూపొందించింది. యాదవ, మైనారిటీ సామాజిక వర్గం ఓటుబ్యాంకు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీలను నిర్వహించనున్నారు. రోడ్ షోల్లో పాల్గొనబోతున్నారు. రెండో విడత, తుది దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాలపై పట్టు సాధించడానికి రాష్ట్రీయ జనతాదళ్‌తో కలిసి కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను తలపెట్టారు.

English summary
Bihar election 2020, Congress senior leader Rahul Gandhi to address two rallies in Bihar on 28th October. He will participate in Valmikinagar and Kusheshwar Asthan rallies and public meetings organized by the Bihar Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X