వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bihar assembly election 2020:50 సీట్లు పక్కా.. 71 సీట్లలో మెజార్టీ ఎన్డీఏ గెలుస్తోంది: మాంజీ

|
Google Oneindia TeluguNews

బీహర్ అసెంబ్లీ తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్ జరుగుతోంది. అయితే అప్పుడే విజయాలపై అంచనా వేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కాదండోయ్.. పొలిటికల్ లీడర్లు. బీహర్ మాజీ సీఎం, హిందుస్తానీ అవామ్ మోర్చా అధినేత జితన్ రామ్ మాంజీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు తథ్యమని చెబుతున్నారు.

Recommended Video

Bihar Elections 2020 Voting Underway: Modi Urges Voters కనీవినీ ఎరుగని రీతిలో ఓ రాష్ట్ర ఎన్నికలు!!

71 సీట్లలో జేడీయూ 35, బీజేపీ 29 మంది పోటీ చేస్తున్నారు. దాదాపు 64 సీట్లలో ఎన్డీఏ కూటమి బరిలో ఉంది. అయితే ఇందులో 50 సీట్లను గెలుచుకుంటుందని మాంజీ ధీమాతో ఉన్నారు. పోలింగ్ మరో మూడు గంటలు ఉండగానే ఆయన అంచనా వేశారు. అయితే మిగతా 21 సీట్లను మాత్రం ఆర్జేడీ, కాంగ్రెస్, లెప్ట్ గెలుచుకుంటాయని ఆయన అంచనా వేశారు. ఆర్జేడీ నుంచి 42 మంది, కాంగ్రెస్ నుంచి 21 మంది, 8 మంది లెప్ట్ పార్టీల నుంచి బరిలోకి దిగారు.

Bihar Election 2020:nda will be win 50 seats out of 71: Jitan Ram Manjhi

కరోనా వైరస్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకున్నా.. పోలింగ్ మాత్రం పెరగలేదు. మధ్యాహ్నాం 1.30 గంటల వరకు 31.54 శాతం పోలింగ్ జరిగింది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.01 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 599 మంది థర్డ్ జెండర్ ఉన్నారు.

వచ్చేనెల 3వ తేదీన రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. 7వ తేదీన మూడో విడత ఎన్నికలతో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తారు. వచ్చేనెల 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోతోంది.

English summary
Former bihar CM Jitan Ram Manjhi casts his vote at a polling booth in Gaya during the first phase of state assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X