ముందు మెజార్టీ చూపించినా, వెనకబడిన గ్రాండ్ అలయన్స్ ..అయినా గెలుస్తామంటున్న ఆర్జేడీ నేతల ధీమా
గ్రాండ్ అలయన్స్ మహా ఘట్ బంధన్ కు నాయకత్వం వహిస్తున్న ప్రతిపక్ష పార్టీ , ఎన్డీయే ను ఛాలెంజ్ చేసిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి), కౌంటింగ్ ప్రక్రియ యొక్క ప్రారంభ దశలో కాస్త ముందంజలో ఉన్న మహా కూటమి క్రమంగా వెనుకబడింది. ఎన్డీఏ దూకుడు కొనసాగుతున్నప్పటికీ మూడు దశల బీహార్ ఎన్నికల ఫలితాల గురించి ఇంకా తమకు అనుకూలంగా వస్తాయని పూర్తి విశ్వాసంతో ఉంది మహా ఘట్ బంధన్ . జెడియు మరియు భారతీయ జనతా పార్టీ (బిజెపి) కూటమి, మరియు ఆర్జెడి నేతృత్వంలోని గ్రాండ్ అలయన్స్, కాంగ్రెస్ మరియు వామపక్ష పార్టీలతో కూడిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఫలితాలలో హోరాహోరీగా పోరాడుతున్నాయి.
బీహార్ లో యూఎస్ తీర్పు రిపీట్ ..ఇక్కడ నమస్తే ట్రంప్ అంటే అక్కడ బైబై ట్రంప్ అన్నారు : శివసేన

మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశిస్తున్నామన్న ఆర్జేడీ నేత మృతుంజయ్ తివారీ
ఇప్పటివరకూ ఎవరికి ఏకపక్ష ఫలితాలు రాలేదు. మొదట్లో ఆర్జెడి కూటమి హవా కనిపించగా , క్రమంగా ట్రెండ్ మారుతూ వచ్చింది. అయినప్పటికీ ఆర్జేడీ కూటమి విజయం సాధిస్తుంది అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆర్జెడి నేతలు. "మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశిస్తున్నాము. కొద్దిసేపు వేచి ఉండండి అంటూ ఆర్జేడీ నేత మృతుంజయ్ తివారీ అన్నారు. ఇక బీజేపీ ఎన్నికల ఫలితాలపై, కౌంటింగ్ సరళిపై వ్యాఖ్యానించడానికి బిజెపి బీహార్ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ నిరాకరించారు ఆయన ఫలితాల అనంతరం సాయంత్రం మాట్లాడతారని చెప్పారు.

ఇప్పటికే తేజస్వి ఇంటికి చేరుకున్న నాయకులు .. ఫలితాలపై ధీమా
అంతకుముందు, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఆర్జెడి కూటమికి ఘనమైన విజయాన్ని అంచనా వేశాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కుమారుడు, గ్రాండ్ అలయన్స్ సిఎం అభ్యర్థి అయిన తేజశ్వి ప్రసాద్ యాదవ్, ఫలితం తెలిసే వరకు వారి వేడుకలను నిలిపివేయాలని పార్టీ కార్యకర్తలను కోరుతున్నారు.తేజశ్వి మద్దతుదారులు ఇప్పటికే ఆయన నివాసానికి రావడం ప్రారంభించారు.
పాట్నా సాహిబ్ అసెంబ్లీ స్థానంలో ఎన్నికల బరిలో నిలిచిన రోడ్డు నిర్మాణ శాఖ మంత్రి నంద్ కిషోర్ యాదవ్ ఆర్జేడీ అభ్యర్థిపై వెనుకంజలో ఉన్నారు.

హోరాహోరీగానే పోరు ... విజయం ఎవరిదో ?
కుమ్రార్ లో , బిజెపి సిట్టింగ్ శాసనసభ్యుడు అరుణ్ సిన్హా ఆర్జెడి అభ్యర్థి డాక్టర్ ధ్రేమేంద్ర కంటే వెనుకంజలో ఉన్నారు. ఆర్జేడీ అభ్యర్థి, మాజీ మంత్రి అబ్దుల్ బారి సిద్దిఖీ కియోటి అసెంబ్లీ సీటు నుంచి వెనుకంజలో ఉన్నారు. మోకామాకు చెందిన ఆర్జేడీ నామినీ మస్క్లమన్ అనంత్ సింగ్ ముందస్తు ఆధిక్యాన్ని సాధించారు. ప్రస్తుతం బీహార్ కౌంటింగ్ ట్రెండ్స్ అటు ఇటు ఊగిసలాడుతున్నా కచ్చితంగా విజయం తమదేనన్న ధీమాలో మహా ఘట్ బంధన్ ఉంది.