వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bihar CM: నితీశ్ మళ్లీ సీఎం అవుతారా ? నోడౌట్, బీజేపీ క్లారిటీ, చేతికి క్రిమ్ బిస్కెట్ ?, నిమ్మకాయ!

|
Google Oneindia TeluguNews

పాట్నా/బీహార్/ న్యూఢిల్లీ: బీహార్ సీఎం ఎవరు ? అనే విషయంపై దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు బీజేపీ నాయకులు మళ్లీ చాన్స్ ఇస్తారా ? అనే విషయంపై న్యూఢిల్లీ నుంచి అధికారికంగా పక్కా క్లారిటీ మాత్రం లేదు. బీహార్ లో ఎన్ డీఏ (BJP- JDU) కూటమి మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంది.

Recommended Video

#Biharelectionresults2020: NDA Will Again Form Government Under Nitish In Bihar-JDU

బీజేపీ భారీ సీట్లను గెలుచుకోవడం, జేడీయూ చితకలపడటంతో మళ్లీ నితీశ్ కుమార్ సీఎం చేస్తారా ? అనే విషయంపై ఉత్కంఠ మొదలైయ్యింది. నితీశ్ కుమార్ ను సీఎం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారని సమాచారం. అయితే నితీశ్ కుమార్ చేతికి క్రీమ్ బిస్కెట్ ఇస్తారా ? చేతిలో నిమ్మకాయ పెడుతారా ? అనే విషయంపై పక్కా క్లారిటీ మాత్రం లేదు.

Bihar: MGB అంటే మహాఘట్ బంధన్ కాదు 'మర్ గయా భయ్యా': మీరు ఫినిష్, కేంద్ర మంత్రి జోకులు !Bihar: MGB అంటే మహాఘట్ బంధన్ కాదు 'మర్ గయా భయ్యా': మీరు ఫినిష్, కేంద్ర మంత్రి జోకులు !

ఎన్డీఏకి ఎవ్వరితో పనిలేదు

ఎన్డీఏకి ఎవ్వరితో పనిలేదు

బీహార్ లో బీజేపీ- జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటికి 122 సీట్ల మ్యాజిక్ ఫిగర్ మార్క్ ను దాటి చేసి అధికారం కైవసం చేసుకొవడానికి సిద్దంగా ఉంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేసే పని తప్పిందని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే బీహార్ లో ఎవ్వరూ ఊహించనిదానికంటే బీజేపీ భారీగా పుంజుకోవడంతో ఆ పార్టీ నాయకులు మూడు రోజుల ముందుగానే పండగ చేసుకుంటున్నారు.

 నితీశ్ కు అమిత్ షా ఫోన్

నితీశ్ కు అమిత్ షా ఫోన్

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మళ్లీ తాను సీఎం అవుతానా ? అనే అనుమానంతో సతమతం అవుతున్నారని తెలిసింది. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పార్టీ తక్కువ సీట్లలో విజయం సాధించింది. ఇలాంటి సందర్బంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు ఫోన్ చేశారని సమాచారం.

బీజేపీ- జేడీయూ లెక్కల్లో భారీ తేడా

బీజేపీ- జేడీయూ లెక్కల్లో భారీ తేడా

బీహార్ లో ఎన్డీఏ భారీ విజయం సాధించింది. ఈ సందర్బంగా ముఖ్యంగా మీకు శుభాకాంక్షలు, మీరు ధైర్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి సిద్దంగా ఉండాలని అమిత్ షా నితీశ్ కుమార్ కు హామీ ఇచ్చారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేసి 74 స్థానాల్లో విజయం సాధించింది. అంటే గతంలో కంటే 21 సీట్లు ఎక్కువగా బీజేపీ సంపాధించుకుంది. 115 స్థానాల్లో పోటీ చేసిన జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించింది. గతంలో కంటే జేడీయూ ఇప్పుడు 28 సీట్లను కోల్పోయింది.

 నితీశ్ చేతికి నిమ్మకాయా ? క్రీమ్ బిస్కెట్ ఇస్తారా

నితీశ్ చేతికి నిమ్మకాయా ? క్రీమ్ బిస్కెట్ ఇస్తారా

నితీశ్ కుమార్ ఎన్డీఏకి నేతృత్వంలో బీహార్ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అందులో ఎలాంటి డౌట్ లేదని బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో స్పష్టం చేశారు. అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పని చేస్తున్న సమయంలోనే నితీశ్ కుమార్ ను మళ్లీ సీఎం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మాటకు మేము కట్టుబడి ఉన్నామని బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ స్పష్టం చేశారు.

మోదీ డిసైడ్ చేస్తారు..... మేము ఫాలో అవుతాము

మోదీ డిసైడ్ చేస్తారు..... మేము ఫాలో అవుతాము

నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉంటారా ? అంటే ఆ విషయం మన ప్రధాని నరేంద్ర మోదీ డిసైడ్ చేస్తారని, ప్రధాని మోదీ ఆదేశాలకు మేము పాటిస్తామని సంజయ్ జైస్వాల్ చల్లగా సమాధానం ఇచ్చారు. మొత్తం మీద గతంలో కంటే భారీ సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లను కొల్పోయిన నితీశ్ కుమార్ కు బీజేపీ నాయకులు క్రీమ్ బిస్కెట్ ఇస్తారా ?, ఆయన చేతిలో నిమ్మకాయలు పెట్టి చేతులు ఎత్తేస్తారా ? అనే విషయం వేచి చూడాల్సిందే.

English summary
Bihar Election Result 2020: As the results trickled in Tuesday evening pointing to the NDA scraping past the 122-seat majority mark with the BJP as the dominant partner for the first time in Bihar, its leaders underlined their campaign commitment to continue with Nitish Kumar as Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X