వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేజశ్వి యాదవ్ కూటమిని దెబ్బకొట్టిన కాంగ్రెస్: ఆ పొరపాటే అధికారానికి దూరం చేసిందా?

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేృత్వంలోని మహాకూటమి మహాగఠబంధన్) గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ.. ప్రస్తుతం విడుదలవుతున్న ఫలితాలు మాత్రం ఎన్డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఉండటం గమనార్హం. మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉండటం వల్లే ఆర్జేడీకి ప్రతికూల ఫలితాలొచ్చాయని కొందరు విమర్శలు చేస్తుండటం గమనార్హం.

Bihar Results: ఊహించనివిధంగా బీజేపీ వైపు బీహార్ ప్రజలు, ఆర్జేడీని నమ్మలేదా?Bihar Results: ఊహించనివిధంగా బీజేపీ వైపు బీహార్ ప్రజలు, ఆర్జేడీని నమ్మలేదా?

కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు కేటాయించినా..

కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు కేటాయించినా..

ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన వాటికంటే ఎక్కువ స్థానాలు కేటాయించి తప్పుచేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రీయ జనతా దల్(ఆర్జేడీ) 144 స్థానాల్లో పోటీ చేయగా.. కాంగ్రెస్ పార్టీకి 70 అసెంబ్లీ స్థానాలను కేటాయించింది. ఇక సీపీఎంకు 4, సీపీఐకి 6, సీపీఐఎంఎల్‌కు 19 స్థానాలు కేటాయించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ కంటే ఈ పార్టీలన్నీ ప్రత్యర్థులకు గట్టి పోటీనివ్వడం గమనార్హం. ఎన్నికల ఫలితాల్లో చతికికలపడిన కాంగ్రెస్ పార్టీ నాలుగో స్థానానికే పరిమితమైంది.

రాహుల్ కంటే తేజశ్వినే బెటర్..

రాహుల్ కంటే తేజశ్వినే బెటర్..

రాహుల్ గాంధీ బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి ప్రచారం నిర్వహించినప్పటికీ ఎలాంటి ప్రభావం లేకుండా పోయింది. రాహుల్ కంటే తేజశ్వి యాదవ్ ర్యాలీలు నిర్వహించిన ప్రాంతాల్లో ఆర్జేడీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండటం గమనార్హం. బీహార్ రాష్ట్రంలో గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 40 స్థానాల్లో 39 ఎన్డీఏ కూటమి విజయం సాధించగా, కేవలం 1 స్థానంలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. ఇక ఆర్జేడీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యంపై ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు నసీర్ హుస్సేన్ మాట్లాడుతూ.. పార్టీలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కాంగ్రెస్ ప్రముఖుల వారసులకూ ఓటమి తప్పలేదు?

కాంగ్రెస్ ప్రముఖుల వారసులకూ ఓటమి తప్పలేదు?


శరద్ యాదవ్ కూతురు సుభాశిని, బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ నేత కుమారుడు లవ్ సిన్హా లాంటి ప్రముఖ కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో ఓటమిదిశగా సాగుతున్నారు. తేజశ్వి యాదవ్ కాంగ్రెస్ పార్టీకి 70 స్థానాలను కేటాయించకుండా ఉండివుంటే ఈ ఎన్నికల ఫలితాలు మహాకూటమికి మరింత సానుకూలంగా ఉండేవని విశ్లేషకులు చెబుతున్నారు.

Recommended Video

#Biharelectionresults2020: మహాకూటమి vs ఎన్డీయే..కూటముల పరంగా స్వల్ప ఆధిక్యంలో NDA
ఆర్జేడీ చేసిన పొరపాటు అదే..

ఆర్జేడీ చేసిన పొరపాటు అదే..


ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం ఎవరూ లేరు. ఆయనను, బీజేపీని ఎదుర్కొనేంత సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీకి 48 సీట్లు కేటాయిస్తారని తాము భావించినప్పటికీ.. తేజశ్వి యాదవ్ అంతకుమించి సీట్లు ఇచ్చారు. ఈ తప్పే ఆర్జేడీ కూటమికి ప్రతికూల ఫలితాలు వచ్చాయని మాజీ జేడీయూ నేత పవన్ వర్మ చెప్పుకొచ్చారు. మహకూటమి.. కాంగ్రెస్ పార్టీకి 70 స్థానాలు కేటాయించగా.. కేవలం 20 స్థానాల్లోనే ఆ పార్టీ ఆధిక్యతను ప్రదర్శిస్తుండటం గమనార్హం. ఆర్జేడీ మాత్రం 144 పోటీ చేసి మెజార్టీ స్థానాల్లో ఆధిక్యతను చాటుకోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీని 20-30 స్థానాలకు పరిమితం చేసి.. మిగిలిన స్థానాల్లో ఆర్జేడీనే పోటీ చేసివుంటే.. ఫలితాలు మరోలా ఉండేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
The Congress today looked like the weak link as the Tejashwi Yadav-led Mahagathbandhan seemed set for second place in the Bihar election despite exit polls predicting an opposition victory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X