వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bihar: సీఎం నితీశ్ కుమార్ గతంలో ఏం చేశారు ?, అదే మైండ్ గేమ్ రిపీట్ అయితే, ఎవరెవరికి సినిమా !

|
Google Oneindia TeluguNews

పాట్నా/బీహార్: బీహార్ కింగ్ ఎవరు ? అనే విషయం కొన్ని గంటల్లో తేలిపోనుంది. మంగళవారం మంచి రోజు బీహార్ రారాజు ఎవరు అనే విషయం వెలుగు చూడనుంది. బీహార్ ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ మళ్లీ అధికారంలోకి రావడం చాలా కష్టం అని సర్వేలు తేల్చిచెప్పాయి. ఇలాంటి సమయంలో భారతదేశం మొత్తం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత బీహార్ లో జరిగిన రాజకీయ రచ్చ మళ్లీ ఈసారి జరిగితే పరిస్థితి వేరుగా ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత నితీశ్ కుమార్ మైండ్ గేమ్ తో షాక్ కు గురైన ఆర్ జేడీ, కాంగ్రెస్ పార్టీలు ఈసారి ఏం చేస్తాయో ?, ఎవరు ఎవరెవరికి సినిమా చూపిస్తారో ? అనే విషయం కొన్ని గంటల్లో తేలిపోనుంది.

Bihar:ఓటర్లు ట్రెండ్ సెట్ చేస్తారు,ట్రెండ్ ఫాలో కారు, అరే సాంబా రాసుకోరా తేజస్వీ గర్బర్ సింగ్ జోస్యంBihar:ఓటర్లు ట్రెండ్ సెట్ చేస్తారు,ట్రెండ్ ఫాలో కారు, అరే సాంబా రాసుకోరా తేజస్వీ గర్బర్ సింగ్ జోస్యం

 243 సీట్లు.... 122 మ్యాజిక్ ఫిగర్

243 సీట్లు.... 122 మ్యాజిక్ ఫిగర్

బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. బీహార్ లోని 243 అసెంబ్లీ నియోజక వర్గాల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈరోజు (మంగళవారం) బీహార్ లో భారీ బందోబస్తు మధ్య అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైయ్యింది. బీహార్ లో ఎవరు అధికారంలోకి రావాలన్నా 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఎవరు బీహార్ సీఎం అవుతారు ? అనే విషయం ఈ రోజు తేలిపోతుంది.

 గతంలో అందరూ సామంతరాజులే..... రారాజు మాత్రం !

గతంలో అందరూ సామంతరాజులే..... రారాజు మాత్రం !

బీహార్ లో గత శాసన సభ ఎన్నికల సందర్బంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో సొంతంగా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేకపోయింది. గతంలో ఇప్పుడు ఉన్న పొత్తులు కూడా అప్పుడు లేవు. బీహార్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ (నితీశ్ కుమార్), కాంగ్రెస్, ఆర్ జేడీ పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఏక్ నిరంజన్ అంటూ ఎన్నికల బరిలో నిలిచింది.

 టైమ్ చూసి దెబ్బ కొట్టిన నితీశ్ కుమార్

టైమ్ చూసి దెబ్బ కొట్టిన నితీశ్ కుమార్

గత లోక్ సభ ఎన్నికలకు ముందు జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆర్ జేడీకి షాక్ ఇచ్చి వారి స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టి బీజేపీతో జత కలిశారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ హవా ఎక్కువగా ఉండటంతో బీజేపీతో చెయ్యి కలిపిన జేడీయూ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ సందర్బంలో ఆర్ జేడీకి పంగనామాలు పెట్టిన నితీశ్ కుమార్ పై దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. అయినా నితీశ్ కుమార్ డోంట్ కేర్ అంటూ బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు.

 సేమ్ సీన్ రిపీట్ అవుతుందా ?

సేమ్ సీన్ రిపీట్ అవుతుందా ?

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎవ్వరినీ లెక్కచెయ్యకుండా బీజేపీతో చెయ్యి కలిపి ఇప్పటికీ ఆ పార్టీతోనే కలిసి మెలసి మళ్లీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే గతంలో ఆర్ జేడీకి హ్యాండ్ ఇచ్చిన నితీశ్ కుమార్ ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఏం స్కెచ్ వేస్తారు ? అనే విషయం వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Recommended Video

Bihar polls: Counting of votes begins for 243 Assembly constituencies
 ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేదు

ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేదు

బీహార్ లో గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేకపోవడంతో స్వతంత్రంగా అధికారంలోకి రాలేకపోయారు. జేడీయూ, ఆర్ జేడీ, కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుని బీహార్ లో అధికారంలోకి వచ్చాయి. ఈ సారికూడా బీహార్ లో సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

*. గత అసెంబ్లీ ఎన్నిల్లో ఈ పార్టీల మెజారిటీ ఇదే

*. జేడీయూ - 67

*. బీజేపీ - 53

*. ఆర్ జేడీ - 73

*. కాంగ్రెస్ - 23

*. హెచ్ఎఏం - 1

*. సీపీఐ - 3

*. ఎల్ జేపీ - 1

* ఎఐఎంఐఎం - 1

*. స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు - 5

*. ఇతర స్థానాలు - 15

English summary
Bihar election results 2020: Five years back JDU own the election with the help of RJD, Bihar Chooses Mahaghatbandhan but Nitish Kumar rejected it later.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X