వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ముఖ్యమంత్రికి పరాభవం తప్పనట్టే? వెనుకంజ: ఆధిక్యతలో మాజీ స్పీకర్

|
Google Oneindia TeluguNews

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కొన్ని అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి చెందిన కొందరు కీలక అభ్యర్థులు ఓటమి బాటలో ప్రయాణిస్తున్నారు. రాష్ట్రీయ జనతాదళ్ నేతృత్వాన్ని వహిస్తోన్న మహాకూటమిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గెలిచి తీరుతారనుకుంటోన్న అభ్యర్థులకు పరాజయం తప్పదనిపించేలా కనిపిస్తోంది.

బీజేపీ సర్కార్..బేఫికర్: ఆధిక్యత: కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసినా: సింధియా మంత్రాంగంబీజేపీ సర్కార్..బేఫికర్: ఆధిక్యత: కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసినా: సింధియా మంత్రాంగం

ఇదే క్రమంలో- మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ వెనుకంజలో ఉన్నారు. రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి ఆయనపై భారీ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. రౌండ్, రౌండ్‌కూ ఆధిక్యత పెరుగుతోంది. హిందుస్తానీ ఆవామీ మోర్చా పార్టీని స్థాపించిన జీతన్ రామ్ మాంఝీ.. జేడీయూ-బీజేపీలతో కలిసి పోటీ చేస్తున్నారు. ఇమామ్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిల్చున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఇదివరకు వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ఆ తరువాత నియోజకవర్గాన్ని వీడారు.

Bihar election results 2020: Jitan Ram Manjhi of HAMS Trailing in Imamganj

మళ్లీ తన సొంత పార్టీ హిందుస్తాన్ ఆవామ్ మోర్చా తరఫున 2015 ఎన్నికల్లో ఇమామ్ గంజ్ నుంచే పోటీకి దిగారు. విజయం సాధించారు. ఈ సారి ఫలితం ప్రతికూలంగా వెలువడుతోంది. ఆర్జేడీకి చెందిన ఉదయ్ నారాయణ్ చౌధురి ఆయనపై ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. ఈ నియోజకవర్గం ఆర్జేడీకి పెట్టని కోట. ఉదయ్ నారాయణ్ సింగ్ 2015కు ముందు ఈ స్థానం నుంచి నాలుగు సార్లు గెలుపొందారు. ఈ సారి మళ్లీ గెలిచేలా కనిపిస్తున్నారు.

Recommended Video

#Biharelectionresults2020: who forms the next government in Bihar

కాగా- ఈ ఎన్నికల సందర్భంగా బిహార్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు దాదాపు ఖాయమైనట్టే ఉన్నాయి. 243 స్థానాలు ఉన్న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 సభ్యుల సంఖ్య అవసరం అవుతుంది. ఈ మేజిక్ ఫిగర్‌ను ఏ పార్టీ కూడా అందుకోలేకపోయే అవకాశాలు ఉన్నాయి. మెజారిటీ సాధించినా అది బొటాబొటీగానే మారుతుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం.. ఎన్డీఏ, మహకూటమి అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. ఎన్డీఏదే ఒకింత పైచేయిలా కనిపిస్తోంది.

English summary
The Hindustani Awam Morcha party head Jitan Ram Manjhi is contesting from Imamganj against RJD candidate Uday Narayan Choudhary, former Bihar Assembly Speaker and veteran Dalit leader. He is contesting from Imamganj constituency in the 2020 Bihar Assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X