వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేజశ్వి యాదవ్ హెలికాప్టర్ చుట్టూ భారీగా జనం: భద్రత పెంచాలంటూ ఆర్జేడీ వినతి

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ అధినేత, మహాకూటమి ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్‌కు సెక్యూరిటీని పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరింది ఆ పార్టీ. ఓ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన తేజశ్వి యాదవ్ హెలికాప్టర్ వద్దకు భారీగా జనం చేరుకోవడంతో గందరగోళం నెలకొంది.

కరోనా నిబంధనలు కూడా పాటించకుండా జనం హెలికాప్టర్ వద్దకు చేరుకోవడంతో స్వల్ప తోపులాట కూడా చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా జతచేసిన ఆర్జేడీ.. ట్విట్టర్ వేదికగా తేజశ్వికి భద్రత పెంచాలని ఈసీని కోరింది. ఆర్జేడీ నేత, రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా ఈ మేరకు బీహార్ ఎన్నికల సంఘం అధికారిని కోరారు.

Bihar elections 2020: Crowd mobs Tejashwi’s helicopter, RJD raises security concerns

తేజశ్వి యాదవ్‌కు భద్రత పెంచాలని ఇప్పటికే పలుమార్లు కోరినట్లు మనోజ్ కుమార్ ఝా తెలిపారు. తేజశ్వి యాదవ్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న సమయంలో భద్రతా ఏర్పాట్లు సరిగా ఉండటం లేదని, దీంతో జనం ఆయన దగ్గరకు చేరుకుంటున్నారని, దీంతో తోపులాట జరుగుతోందని వివరించారు. అంతేగాక, ఈ జనంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా చేరే అవకాశం ఉందని ఆందోలళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈసీకి రాసిన లేఖను కూడా ఆర్జేడీ జతచేశారు.

ఓ ర్యాలీలో హెలికాప్టర్‌లో తేజశ్వి యాదవ్ పాల్గొన్న సమయంలో జనం ఒక్కసారిగా అక్కడకు చేరుకున్నారు. మాస్కులు లేకుండా, కరోనా నిబంధనలు పాటించకుండా జనం భారీగా చేరుకోవడంతో తేజశ్వి భద్రతపై ఆందోళన నెలకొందని ఆర్జేడీ పేర్కొంది. ఇప్పటికే పలుమార్లు తేజశ్వి భద్రతపె పుంపుపై ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు చేసినా ఇప్పటికీ భద్రత పెంచాలని తెలిపింది.

తేజశ్వి సభలకు భారీగా జనం వస్తున్నారని, బారికేడ్లు కూడా బద్దలు కొట్టుకుని ముందుకు వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. తేజశ్వి యాదవ్‌కు పోలీసు విభాగం కూడా సరైన భద్రత కల్పించడం లేదని ఆర్జేడీ ఆరోపించింది. ముంగర్‌లో అమాయకుల ప్రాణాలు తీశారని పోలీసులపై మండిపడింది.

11 ప్రశ్నలు: ప్రధాని మోడీకి తేజస్వీ యాదవ్, ర్యాలీల నేపథ్యంలో కొశ్చన్స్11 ప్రశ్నలు: ప్రధాని మోడీకి తేజస్వీ యాదవ్, ర్యాలీల నేపథ్యంలో కొశ్చన్స్

కాగా, ఈ బుధవారం బీహార్ అసెంబ్లీకి తొలి దశ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. సుమారు 53 శాతం పోలింగ్ జరింగి. ఇక రెండో దశ పోలింగ్ నవంబర్ 3న 94 స్థానాలకు, నవంబర్ 7న మూడో దశలో 78 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

English summary
The Rashtriya Janata Dal (RJD) has asked the Election Commission to strengthen the security cover of Tejashwi Yadav after people hovered close to his helicopter at an election rally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X